Paresh Rawal: ప్రతిచోటా కమెడియన్స్ డేంజర్లోనే ఉన్నారు.. ‘క్రిస్ రాక్ లేదా జెలెన్స్కీ అయినా అంటున్న పరేష్ రవెల్

Paresh Rawal: 94వ ఆస్కార్ (Oscar)వేడుకలు ముగిసినా ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా  మారాయి. ఈ సారి ఆస్కార్ వేడుకలకు హోస్ట్ గా వ్యవహరించిన క్రిస్ రాక్ (Chris Rock) ని హాలీవుడ్..

Paresh Rawal: ప్రతిచోటా కమెడియన్స్ డేంజర్లోనే ఉన్నారు.. 'క్రిస్ రాక్ లేదా జెలెన్స్కీ అయినా అంటున్న పరేష్ రవెల్
Paresh Rawal
Follow us

|

Updated on: Mar 30, 2022 | 11:37 AM

Paresh Rawal: 94వ ఆస్కార్ (Oscar)వేడుకలు ముగిసినా ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా  మారాయి. ఈ సారి ఆస్కార్ వేడుకలకు హోస్ట్ గా వ్యవహరించిన క్రిస్ రాక్ (Chris Rock) ని హాలీవుడ్ (Hollywood ) నటుడు విల్ స్మిత్ వేదికపైనే చెంప చెళ్లు మనిపించాడు. ఈ ఘటనపై ప్రపంచ వ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు క్రిస్ రాక్ ని సపోర్ట్ చేయగా మరి కొందరు విల్ స్మిత్ కి మద్దతుగా నిలిచారు. ఓ రకంగా ఆస్కార్ కి ఈ ఘటన చెరగని మరకగానే చెప్పాలి.. హోస్ట్ చేస్తూ.. రాక్  పరిధికి మించి మాట్లాడడం.. వెంటనే విల్ కోపంతో వేదికపైనే లాగి కొట్టడం ఈ రెండు సంఘటనలు తప్పేనని అంటున్నారు కొందరు. తాజాగా ఈ ఘటనపై బాలీవుడ్ విలక్షణ నటుడు పరేష్ రావల్.. ట్వీట్ చేశాడు. హాస్యనటుడు క్రిస్ రాక్‌కు తన మద్దతును తెలిపాడు.  అంతేకాదు మాజీ హాస్యనటుడు ఉక్రేనియన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్స్కీ పట్ల కూడా సానుభూతిని ట్విట్టర్ వేదికగా వ్యక్తం చేశాడు. ట్విటర్‌లో పరేష్ ఇలా వ్రాశాడు, “కమెడియన్లు ప్రతిచోటా ప్రమాదంలో ఉన్నారు, అది క్రిస్ లేదా జెలెన్స్కీ  అయినా సరే అంటూ తన ట్విట్టర్‌ ఖాతాలో రాసుకొచ్చారు.

రష్యాను ఎదుర్కొంటూ జెలెన్ స్కీ.. విల్ స్మిత్ భార్యపై కామెంట్స్ చేసి క్రిస్ రాక్ ప్రమాదంలో ఉన్నారంటూ రావల్‌ చేసిన ట్విట్‌ ఇప్పుడు మరో చర్చకు దారి తీసింది.ఈ ఏడాది ఫిబ్రవరి 24న  రష్యా, ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం ప్రారంభమై ఐదో వారంలోకి ప్రవేశించిన సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడి గురించి పరేష్ మాట్లాడారు. ఈ యుద్ధంలో ఇప్పటివరకు వందలాది మంది మరణించారు, వేలాది మంది గాయపడ్డారు. ఇది రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపాలో అధికంగా శరణార్థులుగా ప్రజలు ఇతరదేశాల తరలి వెళ్తున్నారు.

అయితే, కామెడీయన్‌ క్రిస్‌ రాక్‌, ఉక్రెయిన్‌ ప్రెసిడెంట్‌గా ఉన్న జెలెన్‌స్కీ కి పోలిక ఏమిటంటే.. ఉక్రెయిన్ అధ్యక్షుడుగా పదవి చేపట్టక ముందు.. గతంలో జెలెన్ స్కీ అనేక టీవి కార్యక్రమాల్లో, సినిమాల్లో కమెడియన్‌గా నటించారు. ప్రస్తుతం ఉక్రెయిన్ ప్రెసిడెంట్‌గా జెలెన్ స్కీ రష్యాతో యుద్ధాన్ని ఎదుర్కొంటున్నారు.

Also Read: Telangana: తాగివచ్చి స్కూల్‌లో నిద్రపోతున్న టీచర్.. అడిగినవారికి తలతిక్క సమాధానాలు

Chanakya Niti: ఎంత సంపాదించిన శాంతి లేదా.. అయితే ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోమంటున్న చాణక్య