Rashmika Mandanna: బాలీవుడ్లో జోరు పెంచిన రష్మిక.. ఏకంగా ఆ స్టార్ హీరోకు భార్యగా నేషనల్ క్రష్..
రష్మిక మందన (Rashmika Mandanna).. ఇప్పుడు ఫుల్ జోష్ మీదుంది. ఇటీవల పాన్ ఇండియా లెవల్లో విడుదలైన పుష్ప సినిమాతో
రష్మిక మందన (Rashmika Mandanna).. ఇప్పుడు ఫుల్ జోష్ మీదుంది. ఇటీవల పాన్ ఇండియా లెవల్లో విడుదలైన పుష్ప సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ. అలాగే.. టాలెంటెడ్ హీరో శర్వానంద్.. రష్మిక కాంబోలో వచ్చిన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాతో మరో సూపర్ హిట్ అందుకుంది. ఇటు తెలుగులో వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న రష్మిక.. మరోవైపు బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ సత్తా చాటుతోంది. ఇప్పటికే హిందీలో వరుస చిత్రాలు చేస్తూ టాప్ హీరోయిన్గా క్రేజ్ సంపాదించుకుంటుంది. ఇప్పటికే వరుణ్ దావన్ సినిమాలో నటిస్తోన్న రష్మిక తాజాగా మరో లక్కీ ఛాన్స్ అందుకుందట.
బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్ ప్రధాన పాత్రలో యానిమల్ సినిమా తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్గా ఎంపికైందట. మొదట ఈ మూవీలో పరిణీతి చోప్రా నటించాల్సి ఉంది.. కానీ డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో రష్మికను సెలక్ట్ చేసినట్లుగా టాక్ నడుస్తోంది. క్రైమ్ యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో రణ్బీర్ భార్య పాత్రలో రష్మిక కనిపించనుంది.
Also Read: Mishan Impossible : తాప్సీ పన్ను `మిషన్ ఇంపాజిబుల్` కోసం రంగంలోకి జాతిరత్నం
NTR: యంగ్ టైగర్ అభిమానులకు పండగలాంటి వార్త.. కొరటాల శివ సినిమా మొదలయ్యేది అప్పుడే..
Sudheer Babu : కొత్త సినిమా షురూ చేసిన యంగ్ హీరో.. ఆకట్టుకుంటున్న సుధీర్ బాబు న్యూ పోస్టర్
Kangana Ranaut : ఆ ప్లేస్‌లో నేనుంటే గట్టిగా తన్నేదాన్ని.. ‘ఆస్కార్’ ఘటన పై కంగనా రియాక్షన్