AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NTR: యంగ్‌ టైగర్‌ అభిమానులకు పండగలాంటి వార్త.. కొరటాల శివ సినిమా మొదలయ్యేది అప్పుడే..

NTR: ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR) సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇక ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు సైన్‌ చేసిన తర్వాత నుంచి ఎన్టీఆర్‌ మరో సినిమాను పట్టాలెక్కించలేదు...

NTR: యంగ్‌ టైగర్‌ అభిమానులకు పండగలాంటి వార్త.. కొరటాల శివ సినిమా మొదలయ్యేది అప్పుడే..
Ntr Koratala Movie
Narender Vaitla
|

Updated on: Mar 29, 2022 | 8:32 PM

Share

NTR: ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR) సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇక ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు సైన్‌ చేసిన తర్వాత నుంచి ఎన్టీఆర్‌ మరో సినిమాను పట్టాలెక్కించలేదు. 2018లో వచ్చిన అరవింద సమేత తర్వాత మళ్లీ ఎన్టీఆర్‌ ఆర్‌ఆర్‌ఆర్‌ ద్వారానే ప్రేక్షకులను పలకరించారు. ఒక్క సినిమాకు ఏకంగా మూడేళ్లు గ్యాప్‌ తీసుకున్నారు తారక్‌. అయితే ప్రస్తుతం ఆ లోటు తీర్చాలని డిసైడ్‌ అయ్యాడు ఎన్టీఆర్‌. ఇందులో భాగంగానే తన తర్వాతి చిత్రాన్ని వెంటనే ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఎన్టీఆర్‌ 30వ చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెలిసిందే. జనతా గ్యారేజ్‌ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. కొరటాల ప్రస్తుతం చిరంజీవి హీరోగా తెరకెక్కుతోన్న ‘ఆచార్య’ను పూర్తి చేశారు. వచ్చే నెలలో ఈ సినిమా విడుదల చేయనున్నారు. ఇక ఇటు కొరటాల శివ, అటు ఎన్టీఆర్‌ ఇద్దరూ ఖాళీగా ఉండడంతో కొత్త ప్రాజెక్ట్‌ను మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది.

తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్‌, కొరటాల శివల సినిమా షూటింగ్‌ను జూన్‌ మొదటి వారంలో మొదలు పెట్టనున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడిగా అలియాభట్‌ నటిస్తోంది. ఇదిలా ఉంటే ఆర్‌ఆర్‌ఆర్‌తో చాలా రోజులు గ్యాప్‌ ఇచ్చిన ఎన్టీఆర్‌ వరుస సినిమాలను పట్టాలెక్కించనున్నారు ఎన్టీఆర్‌. తారక్‌ ఇప్పటికే ప్రశాంత్‌ నీల్‌, ఉప్పెన ఫేం బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమా చేయడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే.

Also Read: Watch Video: ఐపీఎల్‌కు ముందు పొట్టుపొట్టు తిట్టుకున్నారు.. ఇప్పుడేమో హగ్‌లతో ఫ్రెండ్స్ అయ్యారు.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో..

Telangana: తెలంగాణలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కీలక ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..

SRH vs RR Playing XI IPL 2022: తొలిపోరుకు సిద్ధమైన మాజీ ఛాంపియన్లు.. రాజస్థాన్, హైదరాబాద్ ప్లేయింగ్‌ XI ఎలా ఉండనుందంటే?