Watch Video: ఐపీఎల్‌కు ముందు పొట్టుపొట్టు తిట్టుకున్నారు.. ఇప్పుడేమో హగ్‌లతో ఫ్రెండ్స్ అయ్యారు.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో..
Krunal Pandya vs Deepak Hooda: ఐపీఎల్ 2022లో సోమవారం లక్నో-గుజరాత్ మధ్య జరిగిన మ్యాచ్‌లో క్రికెట్ అభిమానులు నమ్మలేని ఓ సంఘటన జరిగింది. క్రికెట్ ప్రపంచంలో శతృవులుగా పేరుగాంచిన ఇద్దరు..
ఐపీఎల్ 2022లో సోమవారం లక్నో-గుజరాత్(LSG vs GT) మధ్య జరిగిన మ్యాచ్‌లో క్రికెట్ అభిమానులు నమ్మలేని ఓ సంఘటన జరిగింది. క్రికెట్ ప్రపంచంలో శతృవులుగా పేరుగాంచిన ఇద్దరు.. దీపక్ హుడా(Deepak Hooda), కృనాల్ పాండ్యా(Krunal Pandya) ఒకే మ్యాచ్‌లో కలిసి ఆడుతూ కనిపించారు. అయితే, ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ క్యాచ్‌ను దీపక్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో కృనాల్ అతని వైపు పరుగున వచ్చి కౌగిలించుకున్నాడు. లక్నో ఇన్నింగ్స్‌లో దీపక్ పెవిలియన్‌కు వెనుదిరుగుతున్నప్పుడు, కృనాల్ అతనితో కరచాలనం కూడా చేశాడు.
దీపక్‌ను దుర్భాషలాడిన కృనాల్..
దీపక్ హుడా, కృనాల్ పాండ్యా దేశవాళీ క్రికెట్‌లో వడోదర తరపున ఆడేవారు. గతేడాది సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సందర్భంగా ఉత్తరాఖండ్‌తో మ్యాచ్ జరగాల్సి ఉంది. ఆ సమయంలో జట్టుకు వైస్ కెప్టెన్ దీపక్ కాగా, కెప్టెన్‌గా కృనాల్ ఉన్నారు. ఈ సందర్భంగా వారిద్దరూ పరస్పరం ఘర్షణ పడ్డారు. గొడవ బాగా పెరిగి దీపక్ ప్రాక్టీస్ మానేసి ఇంటికి వెళ్లిపోయాడు. ఆ తర్వాత బరోడా క్రికెట్ అసోసియేషన్ (బీసీఏ)కి కూడా ఫిర్యాదు చేశాడు. కృనాల్ తనను ప్రతి విషయంలోనూ దుర్భాషలాడేవాడని చెప్పాడు. జట్టు క్యాచింగ్ ప్రాక్టీస్ చేయాలా, బ్యాటింగ్ చేయాలా అనే విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది.
నా పేరు టీమ్‌లో లేకుండా చేశాడు: దీపక్ హుడా
ఆ సంఘటన తర్వాత దీపక్ మాట్లాడుతూ, ‘నేను నెట్స్ ప్రాక్టీస్ తర్వాత బ్యాటింగ్ చేయడానికి వెళ్లినప్పుడు, కృనాల్ నన్ను క్యాచ్ ప్రాక్టీస్ చేయమని అడిగాడు. బ్యాటింగ్ ప్రాక్టీస్‌కు కోచ్ నుంచి అనుమతి లభించిందని చెప్పాను. దీనిపై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇలాంటి సమయంలోనే వడోదర తరపున ఎలా ఆడతావో నేను చూస్తాను అని కృనాల్ చెప్పాడు. ఆ తర్వాత హోటల్‌కి వెళ్లినప్పుడు టీమ్‌లో నా పేరు లేకపోవడంతో ఇంటికి వెళ్లాను’ అని చెప్పుకొచ్చాడు. దీని తర్వాత దీపక్ కూడా వడోదర జట్టు నుంచి తప్పుకున్నాడు. అదే సమయంలో, కృనాల్ పాండ్యా కూడా సోషల్ మీడియాలో చాలా ట్రోల్ అయ్యాడు.
ఇప్పుడు ఇద్దరు ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఒకే జట్టు తరపున ఆడుతుండడంతో ఇద్దరి మధ్య మంచి స్నేహం కూడా ఏర్పడింది. దీపక్‌ను లక్నో రూ. 5 కోట్ల 75 లక్షలకు కొనుగోలు చేసింది. అదే సమయంలో కృనాల్ పాండ్యాను రూ. 8 కోట్ల 25 లక్షలకు కొనుగోలు చేసింది.
Krunal Pandya hugging Deepak hooda https://t.co/umWJhY0Etu pic.twitter.com/InTfczI3jn
— Uneeb?? (@khan_68578) March 28, 2022