SRH vs RR Highlights, IPL 2022: రాయల్స్ బోణీ.. హైదరాబాద్ 61 పరుగుల తేడాతో ఓటమి..
ఐపీఎల్ 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓటమితో తన ప్రయాణాన్ని ప్రారంభించింది. పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విలియమ్సన్ సేన 61 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
ఐపీఎల్ 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓటమితో తన ప్రయాణాన్ని ప్రారంభించింది. పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విలియమ్సన్ సేన 61 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. రాయల్స్ నిర్దేశించిన 211 పరుగుల భారీ టార్గెట్‌ను చేధించడంలో హైదరాబాద్ తడబడింది. నిర్ణీత 20 ఓవర్లకు 7 వికెట్ల నష్టానికి 149 పరుగులు మాత్రమే చేసింది. మార్కరమ్(54) అర్ధ సెంచరీతో ఒంటరి పోరాటం చేయగా.. చివర్లో వాషింగ్టన్ సుందర్(40) మెరుపులు జట్టు విజయానికి ఏమాత్రం సరిపోలేదు. దీనితో ఎస్‌ఆర్‌హెచ్ టోర్నీలో మొదటి పరాభవాన్ని మూటగట్టుకుంది.
అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాయల్స్ జట్టు.. మొదటి ఓవర్ నుంచే దూకుడుగా ఆడటం మొదలుపెట్టింది. ఓపెనర్లు బట్లర్(35), జైస్వాల్(20) తొలి వికెట్‌కు అర్ధ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇక వన్ డౌన్‌లో వచ్చిన రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్(55) అర్ధ సెంచరీ చేయగా.. పడిక్కల్(41), హిట్‌మెయిర్(32) క్యామియో రోల్స్ జట్టుకు భారీ స్కోర్ అందించడంలో సహాయపడింది. దీనితో రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 6 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. కాగా, ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ పాయింట్స్ పట్టికలో అగ్రస్థానానికి చేరుకోగా.. హైదరాబాద్ టీం అట్టడుగు స్థానంలో ఉంది.
SRH vs RR జట్లు:
రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్, సంజు శాంసన్ (కెప్టెన్/కీపర్), షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, నాథన్ కౌల్టర్-నైల్, యుజ్వేంద్ర చాహల్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, కేన్ విలియమ్సన్(కెప్టెన్), నికోలస్ పూరన్(కీపర్), ఐడెన్ మార్క్రామ్, అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, టి. నటరాజన్, ఉమ్రాన్ మాలిక్
LIVE Cricket Score & Updates
-
హైదరాబాద్ ఓటమి..
ఐపీఎల్ 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓటమితో తన ప్రయాణాన్ని ప్రారంభించింది. పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విలియమ్సన్ సేన 61 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
-
ఢమాల్.. ఏడో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్.. జట్టు స్కోర్ 133/7
సన్‌రైజర్స్ టీమ్ ఓటమిపాలయ్యేలా కనిపిస్తోంది. వరుసగా వికెట్లు సమర్పించుకుంటోంది. తాజాగా 7వ వికెట్ కోల్పోయింది. వాషింగ్టన్ సుందర్ క్యాచ్ అవుట్ అయ్యాడు. ప్రస్తుతం జట్టు స్కోర్ 134/7.
-
-
రెండో వికెట్ డౌన్..
త్రిపాఠి (0) రూపంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం రెండో వికెట్‌ను కోల్పోయింది. ప్రసీద్ధ్ బౌలింగ్‌లో హైదరాబాద్ టీంకు వరుసగా షాకిలిస్తున్నాడు. దీంతో 3.1 ఓవర్లలో 7 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది.
-
కేన్ మామ ఔట్..
కేన్ విలియమ్సన్ (2) రూపంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం తొలి వికెట్‌ను కోల్పోయింది. ప్రసీద్ధ్ బౌలింగ్‌లో హైదరాబాద్ టీంకు భారీ షాకిచ్చాడు. దీంతో 1.4 ఓవర్లలో 3 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది.
-
SRH Vs RR: హైదరాబాద్ టార్గెట్ 211
తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ టీం నిర్ణత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ముందు 211 పరుగుల టార్గెట్‌ను ఉంచింది.
-
-
ఐదో వికెట్ డౌన్..
షిమ్రాన్ (32 పరుగులు, 13 బంతులు, 2 ఫోర్లు, 3 సిక్సులు) రూపంలో రాజస్థాన్ రాయల్స్ టీం ఐదో వికెట్‌ను కోల్పోయింది. నటరాజన్ బౌలింగ్‌లో షిమ్రాన్ బౌల్డయ్యాడు.
-
19 ఓవర్లకు స్కోరు..
19 ఓవర్లు ముగిసే సరికి రాజస్థాన్ టీం 4 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది. హెట్ మేయర్ 28, రియాన్ పరాగ్ 11 పరుగులతో క్రీజులో ఉన్నారు.
-
శాంసన్ హాఫ్ సెంచరీ..
రాజస్థాన్ రాయల్స్ సారథి కేవలం 25 బంతుల్లోనే 3 ఫోర్లు, 5 సిక్సులతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోర్ దిశగా సాగుతోంది. ప్రస్తుతం 16 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది.
-
మూడో వికెట్ డౌన్..
పడిక్కల్ (41 పరుగులు, 29 బంతులు, 4 ఫోర్లు, 2 సిక్సులు) రూపంలో రాజస్థాన్ రాయల్స్ టీం మూడో వికెట్‌ను కోల్పోయింది. ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లో పడిక్కల్ బౌల్డయ్యాడు. దీంతో 15 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసింది.
-
రెండో వికెట్ డౌన్..
బట్లర్(35 పరుగులు, 28 బంతులు, 3 ఫోర్లు, 3 సిక్సులు) రూపంలో రాజస్థాన్ రాయల్స్ టీం రెండో వికెట్‌ను కోల్పోయింది. ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లో బట్లర్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 8.1 ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయి 75 పరుగులు చేసింది.
-
7 ఓవర్లకు స్కోరు..
7 ఓవర్లు ముగిసే సరికి రాజస్థాన్ టీం ఒక వికెట్ కోల్పోయి 60 పరగులు చేసింది. శాంసన్ 1, బట్లర్ 34 పరుగులతో క్రీజులో ఉన్నారు. జైస్వాల్ 20 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.
-
SRH vs RR జట్లు:
రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్, సంజు శాంసన్ (కెప్టెన్/కీపర్), షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, నాథన్ కౌల్టర్-నైల్, యుజ్వేంద్ర చాహల్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, కేన్ విలియమ్సన్(కెప్టెన్), నికోలస్ పూరన్(కీపర్), ఐడెన్ మార్క్రామ్, అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, టి. నటరాజన్, ఉమ్రాన్ మాలిక్
-
SRH vs RR Live Score: టాస్ గెలిచిన హైదరాబాద్..
టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో రాజస్థాన్ రాయల్స్ టీం మొదట బ్యాటింగ్ చేయనుంది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు జరిగిన 4 మ్యాచ్‌ల్లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీంలే విజయాలు సాధించాయి. మరి ఈ మ్యాచ్‌లో ఏంజరగుతుందో చూడాలి.
-
Sunrisers Hyderabad Rajasthan Royals Live Score: ఎవరిది పైచేయి?
IPL 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ ఈరోజు తమ ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాయి. SRH వర్సెస్ RR మధ్య ఇప్పటివరకు 15 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో హైదరాబాద్ 8 మ్యాచ్‌లు గెలవగా, రాజస్థాన్ 7 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.
Published On - Mar 29,2022 6:45 PM