IPL 2022: ఇదేందయ్యా భువీ.. ఇలా చేశావ్.. ఫైరవుతోన్న ఫ్యాన్స్.. ఎందుకంటే?

Bhuvneshwar Kumar No Ball: భువనేశ్వర్ కుమార్ అత్యంత నియంత్రణతో బౌలింగ్ చేస్తాడు. అలాగే చాలా తక్కువ నో బాల్స్ వేసే బౌలర్‌గా పేరుగాంచాడు. కానీ IPL-2022లో అతని మొదటి మ్యాచ్‌లో, నో బాల్స్ విసిరి బ్యాట్స్‌మెన్ ఔట కాకుండా చేశాడు.

IPL 2022: ఇదేందయ్యా భువీ.. ఇలా చేశావ్.. ఫైరవుతోన్న ఫ్యాన్స్.. ఎందుకంటే?
Sunrisers Hyderabad Vs Rajasthan Royals Bhuvneshwar Kumar
Follow us

|

Updated on: Mar 29, 2022 | 8:43 PM

ఐపీఎల్ -2022 (IPL 2022) లో రాజస్థాన్ రాయల్స్ మంగళవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడుతోంది. పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఈ రెండు జట్లు ఢీకొంటున్నాయి. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బౌలింగ్ చేయడం బాగా కలిసి వస్తుంది. రాజస్థాన్ రెండవ ఇన్నింగ్స్‌లో మంచు అడ్డంకిగా రానుంది. అప్పుడు బౌలింగ్ చేయడం కష్టం కాబట్టి భారీ స్కోరు చేయకుండా నిరోధించవచ్చని తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ విధంగా, బ్యాట్స్‌మెన్‌లకు ఇది సులభం కానుంది. విలియమ్సన్ తన బౌలర్లు వికెట్లు తీయాలని కోరుకున్నాడు. భువనేశ్వర్ కుమార్(Bhuvneshwar Kumar) కూడా ఇదే పని చేశాడు. జోస్ బట్లర్(Jos Butler) పెవిలియన్ చేరబోతున్నాడు. కానీ, అదృష్టం అతనిని కాపాడింది. భువనేశ్వర్ అద్భుతంగా బౌలింగ్ చేసి ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. మొదట్నుంచీ లైన్ అండ్ లెంగ్త్ పట్టుకుని వేస్తూనే ఉన్నాడు. అతను ఆఫ్-స్టంప్ చుట్టూ బంతిని లోపలికి, వెలుపలికి కదుపుతూనే ఉన్నాడు.

బట్లర్ నో బాల్‌లో ఔటయ్యాడు..

తొలి ఓవర్ ఐదో బంతికే బట్లర్‌ను అవుట్ చేశాడు. ఆఫ్ స్టంప్ దగ్గర నుంచి భువనేశ్వర్ బంతిని వదలడంతో బట్లర్ బ్యాట్ అంచున తగిలి వికెట్ కీపర్ చేతుల్లోకి వెళ్లింది. హైదరాబాద్ జట్టు మొత్తం సంబరాలు చేసుకున్నప్పటికీ థర్డ్ అంపైర్ నో బాల్ చెక్ చేస్తుండగా అంపైర్ బట్లర్‌ను అడ్డుకున్నాడు. థర్డ్ అంపైర్ ఈ బాల్ నో బాల్ అని చెప్పడంతో బట్లర్ ఔట్ కాకుండా కాపాడాడు. భువనేశ్వర్ చాలా తక్కువ నో బాల్స్ వేసే బౌలర్. అయితే ఈ మ్యాచ్‌లో ఏం జరిగిందో భువనేశ్వర్‌కి తెలియదు. తొలి ఓవర్‌లో నో బాల్‌ వేసిన అతను మూడో ఓవర్‌లోనూ నో బాల్‌ వేశాడు.

ఫ్రీ హిట్ క్యాచ్‌లు..

దీని తర్వాత, బట్లర్ ఐదో ఓవర్‌లో కూడా అవుట్ అయ్యాడు. కానీ, ఈసారి కూడా అతను బతికిపోయాడు. ఐదో ఓవర్ వేసిన వాషింగ్టన్ సుందర్ తొలి బంతికి నోబాల్ వేయగా.. ఆ తర్వాతి బంతి ఫ్రీ హిట్‌గా మారింది. దీనిపై బట్లర్ ఒక షాట్ కొట్టాడు. లాంగ్ ఆన్‌లో క్యాచ్ పట్టాడు. కానీ, అది ఫ్రీ హిట్ కావడంతో అతను బతికిపోయాడు. లైఫ్‌లైన్‌ను అందుకున్న తర్వాత, బట్లర్ జోరుగా బ్యాటింగ్ చేసి ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. ఉమ్రాన్ మలిక్ వేసిన నాలుగో ఓవర్‌లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు బాదాడు. అయితే తొమ్మిదో ఓవర్ తొలి బంతికే ఉమ్రాన్ బట్లర్‌ను పెవిలియన్‌కు పంపాడు. బట్లర్ 28 బంతుల్లో 35 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో మూడు ఫోర్లు, మూడు సిక్సర్లు బాదాడు. బట్లర్(35 పరుగులు, 28 బంతులు, 3 ఫోర్లు, 3 సిక్సులు) రూపంలో రాజస్థాన్ రాయల్స్ టీం రెండో వికెట్‌ను కోల్పోయింది. ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లో బట్లర్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం 13 ఓవర్లకు రాజస్థాన్ రాయల్స్ టీం 2 వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసింది.