AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓవైపు సీనియర్ బౌలర్లు.. మరోవైపు 29కే 4 వికెట్లు డౌన్.. ఆడింది ఒకటే మ్యాచ్.. అయినా చుక్కలు చూపించిన బ్యాటర్

Ayush Badoni, IPL 2022: నాల్గవ మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ యువ బ్యాట్స్‌మెన్ ఆయుష్ బదోనికి అవకాశం వచ్చింది. అతను మొదటి మ్యాచ్‌లో అద్భుతమైన అర్ధ సెంచరీతో అందరి హృదయాలను గెలుచుకున్నాడు.

ఓవైపు సీనియర్ బౌలర్లు.. మరోవైపు 29కే 4 వికెట్లు డౌన్.. ఆడింది ఒకటే మ్యాచ్.. అయినా చుక్కలు చూపించిన బ్యాటర్
Ayush Badoni, Ipl 2022
Venkata Chari
|

Updated on: Mar 29, 2022 | 7:15 PM

Share

ఆయుష్ బదోని(Ayush Badoni)… ఈ పేరు నేడు లక్షల మంది నాలుకలపై నానుతోంది. 24 గంటల క్రితం వరకు చాలా కొద్ది మంది క్రికెట్ అభిమానులకు మాత్రమే ఈ పేరు గురించి తెలుసు. కానీ, సోమవారం ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా జరిగిన నాల్గవ మ్యాచ్ తర్వాత, అందరికీ ఆయుష్ బదోని తెలుసు. ఈ యువ కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ ఐపీఎల్ (IPL 2022) లో తొలిసారి మ్యాచ్ ఆడి 41 బంతుల్లో 54 పరుగులు చేసి సత్తా చాటాడు. కష్టాల్లో ఉన్న లక్నో సూపర్‌జెయింట్స్ (Lucknow Super Giants vs Gujarat Titans) ను బదోని చక్కని ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. అతని సీనియర్ భాగస్వామి దీపక్ హుడాతో కలిసి 68 బంతుల్లో 87 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ భాగస్వామ్యం ఆధారంగా, లక్నో జట్టు 158 పరుగులకు చేరుకోగలిగింది. మ్యాచ్ చాలా ఉత్కంఠగా మారేలా చేశాడు.

సరే ప్రశ్న ఏమిటంటే, మొదటి మ్యాచ్‌లో ఆయుష్ బదోనికి అవకాశం ఇవ్వాలని ఎవరు నిర్ణయించారు? అంతెందుకు, కేవలం రూ. 20 లక్షల ఆటగాడిపై మెంటార్ గౌతం గంభీర్, కెప్టెన్ కేఎల్ రాహుల్ ఎందుకు అంత నమ్మకం పెట్టుకున్నారు? అత్యుత్తమ అర్ధ సెంచరీ ఇన్నింగ్స్ ఆడిన తర్వాత ఆయుష్ స్వయంగా ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు.

ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో బ్యాట్‌తో సత్తా చాటిన..

లక్నో జట్టు ఆయుష్ బదోనీకి అవకాశం ఇవ్వాలనే ఆలోచన కూడా చేయలేదు. కానీ, ప్రాక్టీస్ మ్యాచ్‌లలో ఈ ఢిల్లీ బ్యాట్స్‌మెన్ తన నైపుణ్యంతో అందరి హృదయాలను గెలుచుకున్నాడు. బదోని లక్నో సూపర్‌జెయింట్స్ ప్రాక్టీస్ మ్యాచ్‌లలో అర్ధ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత అతను నెట్స్‌లో కూడా బాగా బ్యాటింగ్ చేసి కోచ్, కెప్టెన్‌ను ఆకట్టుకున్నాడు. ఆయుష్ ప్రతిభ, ఫామ్‌ను చూసిన లక్నో సూపర్‌జెయింట్‌ యాజమాన్యం అతనిని కృనాల్ పాండ్యా కంటే ఎక్కువగా బ్యాటింగ్ చేసే అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.

ఒకే ఒక్క టీ20 మ్యాచ్‌ అడాడు..

IPL 2022కి ముందు, ఈ ఆటగాడు తన బ్యాట్‌తో 8 పరుగులు మాత్రమే చేశాడు. ఒక T20 మ్యాచ్ మాత్రమే ఆడాడంటే, బదోనిపై లక్నో సూపర్‌జెయింట్స్‌కి ఎంత నమ్మకం ఉందో మీరు ఊహించుకోవచ్చు. అయితే అతని ప్రతిభపై గౌతమ్ గంభీర్, కేఎల్ రాహుల్‌లకు ఎలాంటి సందేహాలు లేవు. కెప్టెన్ రాహుల్ ఈ ఆటగాడిని ఏబీ డివిలియర్స్‌కి మారుపేరుగా పరిగణించారు. మ్యాచ్ ఓడిన అనంతరం కేఎల్ రాహుల్ మాట్లాడుతూ.. ‘ఆయుష్ మా బుల్లి ఏబీడీ. అతను మొదటి రోజు నుంచే అద్భుతంగా ఉన్నాడు. చిన్నవాడైనప్పటికీ, అతనికి అద్భుతమైన సామర్థ్యం ఉంది. 360 డిగ్రీల షాట్లు కొట్టగల శక్తి అతనికి ఉంది. బదోని అవకాశాన్ని చేజిక్కించుకున్నందుకు సంతోషంగా ఉంది. ఒత్తిడిలో బదోని అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు.

లాకీ ఫెర్గూసన్ వంటి ఫాస్ట్ బౌలర్‌ బంతులను కూడా ఆయుష్ బదోని పుల్ షాట్ ఆడి, 6 పరుగులు సాధించాడు. అతని బాల్ 146 కి.మీ. స్పీడ్ కంటే ఎక్కువగా ఉంది. కానీ, బదోనికి ఏ మాత్రం తేడా లేదు. ఇది మాత్రమే కాదు, బదోని కూడా రషీద్ ఖాన్‌పై సులభంగా బ్యాటింగ్ చేశాడు. అతని బంతికి కూడా భారీ సిక్స్ కొట్టాడు. ఈ ఆటగాడు ప్రత్యేకమని, త్వరలో ఐపీఎల్‌లో ఆపై ప్రపంచ క్రికెట్‌లో తన పేరును ప్రకాశవంతం చేయగలడని స్పష్టమైంది.

Also Read: IPL 2022 Cricketers: ఐపీఎల్ 2022 గుజరాత్‌ క్రికెటర్ల వైఫ్‌లను చూశారా? మోస్ట్‌ బ్యూటిఫుల్‌ కపుల్స్..

IPL 2022: బీసీసీఐ సంచలన నిర్ణయం.. అమలులోకి న్యూ రూల్స్.! ఆ విదేశీ క్రికెటర్లకు దిమ్మతిరిగే షాక్..