AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: బీసీసీఐ సంచలన నిర్ణయం.. అమలులోకి న్యూ రూల్స్.! ఆ విదేశీ క్రికెటర్లకు దిమ్మతిరిగే షాక్..

ముందస్తు సమాచారం లేకుండా చివరి క్షణంలో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ (IPL 2022) నుంచి వైదొలగిన ఇంగ్లండ్ క్రికెటర్లపై బీసీసీఐ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది

IPL 2022: బీసీసీఐ సంచలన నిర్ణయం.. అమలులోకి న్యూ రూల్స్.! ఆ విదేశీ క్రికెటర్లకు దిమ్మతిరిగే షాక్..
Ipl 2022
Basha Shek
|

Updated on: Mar 29, 2022 | 12:11 PM

Share

ముందస్తు సమాచారం లేకుండా చివరి క్షణంలో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ (IPL 2022) నుంచి వైదొలగిన ఇంగ్లండ్ క్రికెటర్లపై బీసీసీఐ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. జేసన్‌ రాయ్‌ (Jason Roy), అలెక్స్‌ హేల్స్‌ (Alex Hales), మార్క్‌ వుడ్ (Mark Wood)లపై కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. ఈమేరకు తాజాగా జరిగిన ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశంలో దీనిపై చర్చ జరిగింది. ‘వేలంలో ఆటగాళ్లను కొనుగోలు చేసే ముందు ఆయా ఫ్రాంఛైజీలు ఎన్నో ప్రణాళికలు వేసుకుంటాయి. తమకు నచ్చిన ఆటగాళ్లను సొంతం చేసుకునేందుకు కోట్లు ఖర్చుపెట్టాయి. అయితే వేలంలో పాల్గొన్న కొందరు క్రికెటర్లు టోర్నీకి ముందు తప్పుకున్నారు. ఇలాంటి నిర్ణయాలు ఆయా ఫ్రాంఛైజీల టోర్నీ ప్రణాళికలను దెబ్బతీస్తాయి. ఈ విషయంలో బోర్డు కూడా ఫ్రాంఛైజీలకు మద్దతుగా ఉంటుంది. వేలంలో పాల్గొని టోర్నీకి ముందు తప్పుకున్న విదేశీ క్రికెటర్లపై కఠిన చర్యలు తీసుకునేందుకు బీసీసీఐ సమాయత్తమవుతోంది’ అని బీసీసీఐ ప్రతినిధి ఒకరు చెప్పుకొచ్చారు.

జరిమానాతో పాటు.. గతేడాది ఐపీఎల్‌ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించి మెరుగ్గా రాణించాడు ఇంగ్లండ్‌ ఆటగాడు జేసన్‌ రాయ్‌. దీంతో అతడిని కనీస ధర రూ. 2కోట్లు పట్టు బట్టి మరీ వేలంలో దక్కించుకుంది గుజరాత్‌ టైటాన్స్‌. కొత్తగా ఐపీఎల్‌లో పాల్గొంటున్న ఆ జట్టు రాయ్‌ను ఓపెనర్‌గా భావించాలని ప్రణాళికల కూడా వేసుకుంది. అయితే టోర్నీకి ముందే గుజరాత్‌ యాజమాన్యానికి షాకిచ్చాడు జేసన్‌. ఐపీఎల్‌ జరిగే రెండు నెలల పాటు బయోబబుల్‌లో గడపడం చాలా కష్టమంటూ మెగా లీగ్‌ నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపాడు. ఇక మరో ఇంగ్లాండ్ ఆటగాడు అలెక్స్ హేల్స్‌ని బేస్ ప్రైజ్ రూ.1.5 కోట్లకు కొనుగోలు చేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్. అయితే బిగ్‌బాష్ లీగ్ తర్వాత కొన్నాళ్లు బయో బబుల్‌ లైఫ్‌కు దూరంగా ఉండాలంటూ ఐపీఎల్‌ నుంచి అర్ధాంతరంగా తప్పుకున్నాడు. ఇంగ్లండ్‌ స్టార్‌ బౌలర్‌ మార్క్‌వుడ్ కూడా వీరి దారిలోనే నడిచాడు. అతడిని లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఏకంగా రూ.7.25 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. అయితే గాయం కారణంగా ఆడలేనంటూ ఐపీఎల్‌ నుంచి తప్పుకున్నాడు. అయితే గాయం కారణంగానే తప్పుకోవడంతో మార్క్‌వుడ్‌పై బీసీసీఐ ఎలాంటి చర్యలు తీసుకోకపోవచ్చని సమాచారం. Also Read:Video: గుజరాత్ సింగర్‌పై డాలర్ల వర్షం.. ఉక్రెయిన్‌కు గీతాబెన్‌ రూ.2.5 కోట్ల విరాళం..

ICAI CA May 2022 admit card: సీఏ 2022 మే సెషన్‌ రిజిస్ట్రేషన్‌కు రేపే ఆఖరు.. వెంటనే దరఖాస్తు చేసుకోండి..

Delhi Legal Affairs Jobs 2022: లా గ్రాడ్యుయేట్లకు బంపరాఫర్‌! ఢిల్లీలోని లీగల్‌ అఫైర్స్‌లో ఉద్యోగావకాశాలు..పూర్తి వివరాలివే!