AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Alia Bhatt: ఆర్‌ఆర్‌ఆర్‌పై అలియా అలిగిందా? సోషల్‌ మీడియాలో జక్కన్న సినిమా ఫొటోలు డిలీట్‌ ఎందుకు?

RRR Movie: దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR) సినిమా గత శుక్రవారం (మార్చి 25) ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మొదటి షో నుంచే బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ తెచ్చుకోవడంతో ప్రేక్షకులు సినిమా థియేటర్లకు పోటెత్తుతున్నారు.

Alia Bhatt: ఆర్‌ఆర్‌ఆర్‌పై అలియా అలిగిందా? సోషల్‌ మీడియాలో జక్కన్న సినిమా ఫొటోలు డిలీట్‌ ఎందుకు?
Aliabhatt
Basha Shek
|

Updated on: Mar 29, 2022 | 1:34 PM

Share

RRR Movie: దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR) సినిమా గత శుక్రవారం (మార్చి 25) ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మొదటి షో నుంచే బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ తెచ్చుకోవడంతో ప్రేక్షకులు సినిమా థియేటర్లకు పోటెత్తుతున్నారు. మొదటి రోజే రూ.223 కోట్లు కొల్లగొట్టిన ఈ పాన్‌ ఇండియా సినిమా.. మూడు రోజుల్లో రూ. 500 కోట్లకు పైగా వసూలు చేసినట్లు ట్రేడ్‌ పండితులు చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో రామ్‌చరణ్‌ (Ramcharan), ఎన్టీఆర్ (JR.NTR) పాత్రలపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. కాగా ఈ సినిమాలో వీరితో పాటు బాలీవుడ్‌ బ్యూటీ అలియాభట్‌, హాలీవుడ్‌ ముద్దుగుమ్మ ఒలివియా మోరిస్‌, శ్రియాశరణ్‌, సముద్ర ఖని తదితరులు కీలక పాత్రలు పోషించారు. సాధారణంగా రాజమౌళి తన సినిమాల్లోని క్యారెక్టర్లన్నింటికీ సమ ప్రాధాన్యం ఇస్తారు. గత సినిమాల్లోనూ ఇది నిరూపితమైంది. అయితే ఫిక్షనల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో అలియాకు తగిన ప్రాధాన్యమివ్వలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సినిమాలో ఆమె పాత్ర నిడివి తక్కువగా ఉందని సోషల్‌ మీడియాలో ప్రచారం సాగుతోంది.

ఇదిలా ఉంటే తన సోషల్‌మీడియా ఫీడ్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు సంబంధించిన ఫొటోలన్నింటినీ తొలగించింది అలియా. అంతేకాదు రాజమౌళిని కూడా అన్‌ఫాలో చేసిందని తెలుస్తోంది. దీనికి కారణం స్పష్టంగా తెలియనప్పటికీ.. సినిమాలో తన స్ర్కీన్‌ టైం తక్కువగా ఉన్నందుకే ఇలా చేసిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. కాగా కరోనా మూడో వేవ్‌కు ముందు ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ప్రమోషన్లలో చురుగ్గా పాల్గొంది అందాల తార. చిత్రబృందంతో కలిసి పలు నగరాలు తిరిగింది. ప్రెస్‌మీట్లు, ప్రమోషన్‌ ఈవెంట్లలో యాక్టివ్‌గా పాల్గొంది. అయితే రెండో దశ ప్రమోషన్‌ కార్యక్రమాల్లో మాత్రం ఎక్కడా కనిపించలేదు అలియా. రాజమౌళి, చరణ్‌, తారక్‌లు మాత్రమే ప్రమోషన్‌ ఈవెంట్లలో పాల్గొన్నారు.

Also Read:సినిమా టికెట్లపై మరో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఇకపై ఆన్‏లైన్‏లోనే..

Shocking News: అదో మిస్టరీ.. తిరుగుతూ.. తిరుగుతూ రైలు కింద పడ్డ కానిస్టేబుల్.. అసలు ఏం జరిగిదంటే..

ICAI CA May 2022 admit card: సీఏ 2022 మే సెషన్‌ రిజిస్ట్రేషన్‌కు రేపే ఆఖరు.. వెంటనే దరఖాస్తు చేసుకోండి..