Shocking News: అదో మిస్టరీ.. తిరుగుతూ.. తిరుగుతూ రైలు కింద పడ్డ కానిస్టేబుల్.. అసలు ఏం జరిగిదంటే..
కొన్ని ఎప్పటికీ మిస్టరీగానే ఉండిపోతాయి.. అసలు ఏం జరిగిందో కూడా అర్థం కాదు.. అలా చూస్తుండగానే స్టోరీ ముగిసిపోతుంది. కొందరు ఇలాంటి ఘటనలను మిస్టరీ అంటే..
కొన్ని ఎప్పటికీ మిస్టరీగానే ఉండిపోతాయి.. అసలు ఏం జరిగిందో కూడా అర్థం కాదు.. అలా చూస్తుండగానే స్టోరీ ముగిసిపోతుంది. కొందరు ఇలాంటి ఘటనలను మిస్టరీ అంటే.. మరికొందరు మాత్రం ఇలాంటి ఘటనలపై అనుమానాలు వ్యక్తం చేస్తుంటారు. అయితే కాలం మారుతోంది. హె టెక్నాలజీ యుగంలోనూ ఇలా.. ఎలా జరుగుతుంది. కాని జరిగింది. ఏం జరిగిందో తెలియదు. తిరుగుతూ.. తిరుగుతూ అలా పక్క నుంచి వెళ్తున్న గూడ్స్ రైలు కింద పడిపోయాడు ఓ కానిస్టేబుల్. ఈ ఘటన ఆగ్రా రైల్వే స్టేషన్లో(Agra Railway station) జరిగింది. ఆ దృశ్యాలు సీసీటీవీలో(CCTV) రికార్డ్ అయ్యాయి. ఎవరో పట్టుకుని తిప్పినట్లుగా తిరుగుతూ.. తిరుగుతూ రైల్వే ప్లాటుఫార్మ్ నుంచి రైలు కింద పడిపోయాడు. రైల్వే ప్లాటుఫార్మ్ పై డూటీలో ఉన్న ఓ రైల్వే కానిస్టేబుల్ ఉన్నట్టుండి గింగిరాలు తిరుగుతూ.. కదులుతున్న గూడ్స్ రైలు కిందపడి మృతి చెందాడు.
దిగ్భ్రాంతికర ఈ ఘటన ఆగ్రాలోని రాజా మండి రైల్వే స్టేషన్లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. రింగేల్ సింగ్ అనే వ్యక్తి గవర్నమెంట్ రైల్వే పోలీస్ విభాగంలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. ఎనిమిది నెలల క్రితం ఆగ్రాలోని “రాజా కీ మండి” రైల్వే స్టేషన్‌కు డెప్యూటేషన్ పై రింగేల్ సింగ్ వచ్చాడు. మార్చి 27న స్టేషన్ లోని ప్లాట్ ఫార్మ్ నెంబర్ ఒకటిపై విధులు నిర్వహిస్తున్నాడు. అదే సమయంలో ప్లాట్ ఫారం ఒకటిపై నుంచి గూడ్స్ రైలు వెళుతుంది.
అయితే ఏమైందో తెలియదుగాని.. రింగేల్ సింగ్ ఉన్నట్టుండి అలా తిరుగుతూ.. తిరుగుతూ ఒక్కసారిగా కదులుతున్న గూడ్స్ రైలు కింద పడ్డాడు. రింగేల్ సింగ్ రైలు కింద పడిన వెంటనే ప్లాట్ ఫార్మ్ పైనున్న ఒక వ్యక్తి రక్షించేందుకు వచ్చినా అప్పటికే జరగాల్సిన ప్రమాదం జరిగిపోయింది.
ఈ దిగ్భ్రాంతికర ఘటన తాలూకు దృశ్యాలు స్టేషన్ లో ఏర్పాటు చేసిన సీసీటీవీలో రికార్డు అయ్యాయి. ఘటనపై రైల్వే అధికారుల ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రింగేల్ సింగ్ చేతిలో లాఠీ పట్టుకుని ఉండగా.. చేయి అమాంతం గాల్లోకి లేచి.. అతని శరీరం కూడా అతనికి తెలియకుండానే తిరగడం మొదలు పెట్టాడు అంతే.. అలా తిరిగిన రింగేల్ సింగ్గూ డ్స్ రైలు కింద పడ్డాడు. ఈ ఘటనపై ఎన్నో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు జనం. అసలు అక్కడ ఏదో ఉందని.. అతడిని తిప్పి.. తిప్పి పడేసిందని కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇవి కూడా చదవండి: Gangster Naeem: గ్యాంగ్స్టర్ నయీం బినామీల ఆస్తులపై ఐటీ శాఖ నజర్.. 150 కోట్ల విలువైన ఆస్తులు సీజ్..
ఈ ఫోటోలో ఎన్ని చిత్రాలు ఉన్నాయో గుర్తుపట్టండి చూద్దాం.. మీరు మొదట చూసేదే మీ వ్యక్తిత్వం..