సినిమా టికెట్లపై మరో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఇకపై ఆన్‏లైన్‏లోనే..

సినిమా టికెట్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రేక్షకులకు ఆన్‏లైన్‏లోనే సినిమా టికెట్స్ అందుబాటులో తీసుకోచ్చేందుకు చర్యలు చేపట్టనుంది.

సినిమా టికెట్లపై మరో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఇకపై ఆన్‏లైన్‏లోనే..
Tollywood
Follow us

|

Updated on: Mar 29, 2022 | 1:03 PM

సినిమా టికెట్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రేక్షకులకు ఆన్‏లైన్‏లోనే సినిమా టికెట్స్ అందుబాటులో తీసుకోచ్చేందుకు చర్యలు చేపట్టనుంది. ఇప్పటికే టికెట్స్ అమ్మకాల కోసం టెండర్లను పూర్తిచేసింది ఏపీ ప్రభుత్వం.. ఇతర ప్రైవేట్ సంస్థల కంటే తక్కువగా ప్రభుత్వమే నిర్వహించేలా ఏర్పాట్లు పూర్తిచేసింది. ఇప్పటికే పూర్తైన సినిమా టికెట్స్ అమ్మకాల టెండర్లలో జస్ట్ టిక్కెట్ సంస్థ L-1గా నిలిచినట్లు సమాచారం. అన్ని థియేటర్లు ఒకే సంస్థ ద్వారా టిక్కెట్ల అమ్మకాలు చేసేలా చర్యలు చేపట్టనుంది. దీంతో ప్రేక్షకులపై ఆన్లైన్ చార్జీల భారం లేకుండా ప్రభుత్వమే నిర్వహించేలా ఏర్పాట్లు చేసింది. ఏపీలో ఏప్రిల్ 1 నుంచి ఆన్లైన్‏లో సినిమా టిక్కెట్లు అందుబాటులోకి తీసుకురానుంది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రేక్షకులపై టికెట్స్ రేట్స్ భారం తగ్గనుంది. ఆన్లైన్లో టికెట్స్ విక్రయించగా వచ్చిన డబ్బును ప్రభుత్వమే వాటిని డిస్టిబ్యూటర్లకు , థియేటర్లకు ఇవ్వనున్నట్లు తెలిపింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో బ్లాక్ టికెట్స్ దందాకు చెక్ పడడమే కాకండా.. టికెట్స్ విషయంలో ప్రేక్షకులను ఎలాంటి ఇబ్బందులు ఉండవని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

గతంలో సినిమా టికెట్స్ రేట్స్ విషయంలో ప్రభుత్వానికి.. సినీ ప్రముఖులకు మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. సినిమా రేట్స్ తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో సినీ ప్రముఖులు.. డిస్టిబ్యూటర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి… రాజమౌలి.. మహేష్ బాబు.. ప్రభాస్ వంటి స్టార్స్ అందరూ కలిసి సీఎం జగన్మోహన్ రెడ్డితో సమావేశమై.. టికెట్స్ వివాదాన్ని పరిష్కరించిన సంగతి తెలిసిందే. దీంతో టికెట్స్ రేట్స్ పై ప్రభుత్వం పలు మార్పులు చేస్తూ మరో జీవోను జారీచేసింది.

Also Read: Penny Song: పెన్నీ సాంగ్ మేకింగ్ వీడియో చూశారా.. సీతూపాప ఎంత ముద్దుగా చేసిందో..

Deepika Padukone: గుడ్ న్యూస్ చెప్పిన దీపికా పదుకొనే.. శుభాకాంక్షలు తెలుపుతున్న సెలబ్రెటీలు, ఫ్యాన్స్.. ఎందుకో తెలుసా..

Rashmika Mandanna: జిమ్‌లో తగ్గేదేలే అంటోన్న శ్రీవల్లి.. రష్మిక వర్కవుట్ వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..

Suriya: మరోసారి ఆ స్టార్ డైరెక్టర్‏తో హీరో సూర్య.. 18 ఏళ్ల తర్వాత హీట్ కాంబో రిపీట్..

Latest Articles
జోరుగా ప్రచారం చేస్తున్న బీజేపీ అభ్యర్థి.. కాంగ్రెస్‎కు కౌంటర్..
జోరుగా ప్రచారం చేస్తున్న బీజేపీ అభ్యర్థి.. కాంగ్రెస్‎కు కౌంటర్..
ఏపీలో పోలింగ్‎కు ఏర్పాట్లు పూర్తి.. ఈసీ కీలక విషయాలు వెల్లడి..
ఏపీలో పోలింగ్‎కు ఏర్పాట్లు పూర్తి.. ఈసీ కీలక విషయాలు వెల్లడి..
టీ 20 ప్రపంచకప్ జట్టులో మార్పులు! ఆ ప్లేయర్లకు చిగురిస్తోన్న ఆశలు
టీ 20 ప్రపంచకప్ జట్టులో మార్పులు! ఆ ప్లేయర్లకు చిగురిస్తోన్న ఆశలు
గుండెపోటు వచ్చిన వారికి అందించాల్సిన ప్రాథమిక చికిత్స ఇదే..
గుండెపోటు వచ్చిన వారికి అందించాల్సిన ప్రాథమిక చికిత్స ఇదే..
కారు బీమాతో ఎంతో ధీమా.. క్లెయిమ్ చేసే సమయంలో ఆ జాగ్రత్తలు మస్ట్
కారు బీమాతో ఎంతో ధీమా.. క్లెయిమ్ చేసే సమయంలో ఆ జాగ్రత్తలు మస్ట్
ఓట్స్‌తో ఆరోగ్యమే కాదు.. అందాన్ని కూడా పెంచుకోవచ్చు..
ఓట్స్‌తో ఆరోగ్యమే కాదు.. అందాన్ని కూడా పెంచుకోవచ్చు..
ఎండాకాలంలో అమృతమే.. చెరుకు రసం ఎందుకు తాగాలో తెలుసా..?
ఎండాకాలంలో అమృతమే.. చెరుకు రసం ఎందుకు తాగాలో తెలుసా..?
ఇదెక్కడి మాస్ రా మావా..!! డ్యూయల్ రోల్‌లో అల్లు అర్జున్..
ఇదెక్కడి మాస్ రా మావా..!! డ్యూయల్ రోల్‌లో అల్లు అర్జున్..
ఆ టయోటా కారు బుకింగ్స్ రీ ఓపెన్.. రూ.13 లక్షలకే సీఎన్‌జీ కారు
ఆ టయోటా కారు బుకింగ్స్ రీ ఓపెన్.. రూ.13 లక్షలకే సీఎన్‌జీ కారు
నీట్‌ యూజీ 2024 అడ్మిట్‌కార్డులు విడుదల
నీట్‌ యూజీ 2024 అడ్మిట్‌కార్డులు విడుదల