RRR: ఆర్ఆర్ఆర్ సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేసిన ఎమ్మెల్యే సీతక్క.. అలా అనుకుంటేనే సినిమా చూడాలంటూ..

దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ (RRR) సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.

RRR: ఆర్ఆర్ఆర్ సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేసిన ఎమ్మెల్యే సీతక్క.. అలా అనుకుంటేనే సినిమా చూడాలంటూ..
Rrr
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 29, 2022 | 12:14 PM

దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ (RRR) సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటించిన మూవీని చూసేందుకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ దూసుకెళ్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంపై ప్రశంశలు వెల్లువెత్తుతున్నాయి. చరణ్, తారక్ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఈ సినిమాపై తాజాగా ములుగు ఎమ్మెల్యే సీతక్క స్పందించారు. ఆర్ఆర్ఆర్ మూవీపై ప్రశంసలు కురిపించారు.. భారతదేశాన్ని విభజించాలనుకుంటే ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమా చూడండి.. దేశాన్ని ఏకం చేయాలనుకుంటే ‘ఆర్ఆర్ఆర్’ చూడండంటూ సీతక్క కామెంట్స్ చేశారు.

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌లు హీరోలుగా, దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రమే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. భారీ అంచనాల మధ్య మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. బాక్సాఫీస్‌ వద్ద దుమ్ము రేపుతోంది. మూడు రోజుల్లోనే 500 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లని రాబట్టి తెలుగు సినిమా సత్తాని మరోసారి ప్రపంచానికి చాటింది. ఇందులో చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటించగా.. ఎన్టీఆర్.. గోండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో నటించి మెప్పించాడు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, హాలీవుడ్ ముద్దుగుమ్మ ఒలివియా మోరీస్ హీరోయిన్లుగా నటించగా.. బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్, సముద్రఖని, శ్రియా సరన్ కీలకపాత్రలలో నటించారు. ఈ సినిమాలోని సాంగ్స్ మరోవైపు యూట్యూబ్‏ను షేక్ చేస్తున్నాయి.

Also Read: Penny Song: పెన్నీ సాంగ్ మేకింగ్ వీడియో చూశారా.. సీతూపాప ఎంత ముద్దుగా చేసిందో..

Deepika Padukone: గుడ్ న్యూస్ చెప్పిన దీపికా పదుకొనే.. శుభాకాంక్షలు తెలుపుతున్న సెలబ్రెటీలు, ఫ్యాన్స్.. ఎందుకో తెలుసా..

Rashmika Mandanna: జిమ్‌లో తగ్గేదేలే అంటోన్న శ్రీవల్లి.. రష్మిక వర్కవుట్ వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..

Suriya: మరోసారి ఆ స్టార్ డైరెక్టర్‏తో హీరో సూర్య.. 18 ఏళ్ల తర్వాత హీట్ కాంబో రిపీట్..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!