AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suriya: మరోసారి ఆ స్టార్ డైరెక్టర్‏తో హీరో సూర్య.. 18 ఏళ్ల తర్వాత హీట్ కాంబో రిపీట్..

ప్రస్తుతం విభిన్న కథలతో శరవేగంగా దూసుకుపోతున్నాడు హీరో సూర్య (Suriya). దాదాపు 18 సంవత్సరాల తర్వాత మళ్ళీ తన డైరెక్టర్ బాలతో (Bala) కలిసి పని చేయనున్నారు.

Suriya: మరోసారి ఆ స్టార్ డైరెక్టర్‏తో హీరో సూర్య.. 18 ఏళ్ల తర్వాత హీట్ కాంబో రిపీట్..
Suriya
Rajitha Chanti
|

Updated on: Mar 29, 2022 | 6:30 AM

Share

ప్రస్తుతం విభిన్న కథలతో శరవేగంగా దూసుకుపోతున్నాడు హీరో సూర్య (Suriya). దాదాపు 18 సంవత్సరాల తర్వాత మళ్ళీ తన డైరెక్టర్ బాలతో (Bala) కలిసి పని చేయనున్నారు. వీరు ఇరువురు కలిసి చేసిన చివరి చిత్రం ‘శివపుత్రుడు’ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కావడం, ఈ చిత్రం లో సూర్య పాత్ర కి తెలుగు, తమిళంలో మంచి పేరు రావడంతో ప్రేక్షకులలో ఈ కలయిక పై మరిన్ని అంచనాలు పెరగనున్నాయి.ఈ చిత్రానికి 2డి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో సూర్య మరియు జ్యోతిక నిర్మాతలుగా, రాజేశేఖర పాండియన్ సహా నిర్మాతగా వ్యవహరించనున్నారు.”నా గురువు లాంటి వ్యక్తి బాల యాక్షన్ చెప్పడానికి వెయిట్ చేస్తున్నా, 18 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు జరిగింది మాకు మీ అందరి ఆశీస్సులు కావాలి” అని హీరో సూర్య ట్వీట్ చేసారు.

సూర్యని సరికొత్తగా ఒక డిఫరెంట్ రోల్ లో చూపించడానికి డైరెక్టర్ బాల ఒక యూనిక్, ఉద్వేగభరితమైన కథని సిద్ధం చేసారట. “సూర్య41” చిత్రం పూజ కార్యక్రమాలు నిర్వహించుకుని కన్యాకుమారిలో ఈ రోజు నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయింది. మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ కృతి శెట్టి ఈ చిత్రం లో సూర్యకి జోడీ గా నటించనుంది. మెగా హీరో వైష్ణవ్ తేజ్ సరసన ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్‏గా పరిచయమైంది కృతి శెట్టి. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఈ మూవీ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది..శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలతో ప్రేక్షకులను మరోసారి మెప్పించింది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీ షెడ్యూల్ గడిపేస్తున్న బేబమ్మ ఇప్పుడు మరో లక్కీ ఛాన్స్ అందుకుంది. ఏకంగా తమిళ్ స్టార్ హీరో సూర్యకు జోడీగా నటించనుంది కృతిశెట్టి. సెన్సషనల్ మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించనున్నారు..బాల సుబ్రమణియం సినిమాటోగ్రాఫర్ గా చేస్తున్నారు.

Also Read: Dubai Expo 2020: ప్రపంచవ్యాప్తంగా భారతీయ సినిమా ఇండస్ట్రీ ఖ్యాతి.. కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్, రణవీర్ సింగ్

Harish Shankar: హరీష్ శంకర్ అయితేనే బెటర్ అంటున్న మెగాస్టార్.. ఈమూవీ కోసం అంటే

Tollywood: ఇన్​స్టాలో ఒక్క పోస్ట్‌కు సమంత ఎంత తీసుకుంటుందో తెలిస్తే షాక్ తినాల్సిందే..!

S. Thaman : దేవీ శ్రీ పై క్రేజీ కామెంట్స్ చేసిన తమన్.. డార్లింగ్ బ్రదర్ అంటూ డీఎస్పీ ట్వీట్