Harish Shankar: హరీష్ శంకర్ అయితేనే బెటర్ అంటున్న మెగాస్టార్.. ఈమూవీ కోసం అంటే
అన్న-తమ్ముడు... మధ్యలో ఒక స్టార్ డైరెక్టర్ దోబూచులాట ఆడుతున్నారు. మెగా కాంపౌండ్‌నే కాదు... టోటల్ టాలీవుడ్ సర్కిల్స్‌నే ఎలర్ట్ చేస్తోంది ఈ తాజా ఖబర్.
అన్న-తమ్ముడు.. మధ్యలో ఒక స్టార్ డైరెక్టర్ దోబూచులాట ఆడుతున్నారు. మెగా కాంపౌండ్‌నే కాదు… టోటల్ టాలీవుడ్ సర్కిల్స్‌నే ఎలర్ట్ చేస్తోంది ఈ తాజా ఖబర్. మెగా ఫ్యాన్స్‌నైతే ఇంకా ఇంకా ఫిదా చేస్తోంది. ఈ ఊసే న్యూసుగా మారి.. త్వరలో అనౌన్స్‌మెంట్ వస్తే బావుండు కదా అనుకుంటున్నారట. ఇంతకీ ఏమిటా ఊసు అనుకుంటున్నారా.. ఈ గ్యాప్ ఇచ్చిందా లేక వచ్చిందా అంటే నో కామెంట్స్ అని ఇంటిలిజెంట్‌గా ఎస్కేప్ అవుతారు స్టార్ కెప్టెన్ హరీష్ శంకర్(Harish Shankar). లవర్‌బాయ్ వరుణ్‌తేజ్‌ని సడన్‌గా గద్దలకొండ గణేశ్‌గా ట్రాన్స్‌ఫామ్ చేసి.. దాదాపు మూడేళ్లు కావస్తోంది. అప్పటినుంచి పవర్‌స్టార్ వైపే ఆశగా చూస్తున్న హరీష్‌కి.. ఇప్పుడు మరోవైపు చూడాల్సిన అవసరం వచ్చేసింది. పరాయిభాషల్లో సక్సెస్సయిన స్టోరీ లైన్స్‌ని తెలుగు ఆడియన్స్ మనసుకు నచ్చేట్టు రీమేక్ చెయ్యగల సూపర్‌స్పెషలిస్ట్ హరీష్ శంకర్. గబ్బర్‌సింగ్‌తో పవర్‌స్టార్‌కి మాంచి కమర్షియల్ హిట్ ఇచ్చిన ఆ చెయ్యి… ఇప్పుడు మెగాస్టార్ చేతిని అందుకోబోతోంది. తాను మనసు పడ్డ ఒక మలయాళ సూపర్‌హిట్ మూవీ రీమేక్‌కి హరీషైతేనే బెటరని ఫిక్సయ్యారట చిరు.
మోహన్‌లాల్, పృథ్విరాజ్ తండ్రీకొడుకులుగా నటించిన హిలేరియస్ కంటెట్ ఇది. దీన్ని తెలుగులో రీప్రొడ్యూస్ చేసే బాధ్యతను హరీష్ తీసుకున్నారట. తండ్రిగా చిరంజీవి చేస్తారని, తనయుడిగా మరో మెగాహీరో బోర్డ్‌లోకి వస్తారని టాక్. వివి వినాయక్ ఇచ్చిన పవర్‌ఫుల్ కమ్‌బ్యాక్ మూవీతో రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్… రీమేక్స్ మీద ఫోకస్ కంటిన్యూ చేస్తున్నారు. తర్వాత చిరూతో మోహన్‌రాజా, మెహర్‌రమేష్ మరో రెండు సాలిడ్ రీమేక్స్‌ని డీల్ చేస్తున్నారు. అదే సీక్వెన్స్‌లో హరీష్‌శంకర్ చేరబోతున్నారని, స్క్రిప్ట్ వర్క్ వేగంగా జరుగుతోందని ఫీలరుంది. ప్రస్తుతం మైత్రీ సంస్థ కోసం పవర్‌స్టార్‌తో భవదీయుడు భగత్‌సింగ్ అనే సినిమా అనౌన్స్ చేశారు హరీష్. పవన్ మరో రెండు సినిమాల తర్వాతే భవదీయుడి వైపు చూస్తారు. అందాకా… అన్నయ్యతో స్పెండ్ చేస్తా అని తమ్ముడి దగ్గర పర్మిషన్ తీసుకున్నారట గబ్బర్ డైరెక్టర్.