Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి.. బాబీ మూవీ ఇంట్రెస్టింగ్ అప్డేట్.. భారీ యాక్షన్ షెడ్యూల్..

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాను

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి.. బాబీ మూవీ ఇంట్రెస్టింగ్ అప్డేట్.. భారీ యాక్షన్ షెడ్యూల్..
Megastar
Rajitha Chanti

|

Mar 28, 2022 | 7:56 AM

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాను పూర్తిచేయగా.. గాడ్ ఫాదర్ (God Father).. భోళా శంకర్ (Bhola Shankar) సినిమాలో ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి. ఇప్పటికే ఆయా సినిమాల నుంచి విడుదలైన పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలతోపాటు.. చిరు..డైరెక్టర్ బాబీ దర్శకత్వంలోనూ ఓ మూవీ చేయనున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమాకు ప్రస్తుతం మెగా 154 వర్కింగ్ టైటిల్ షూటింగ్ జరుగుతోంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని టాలీవుడ్‏లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది . ఈ చిత్రానికి సంబంధించిన హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్సెస్‏ని హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో షూట్ చేస్తున్నారు.

చిత్ర యూనిట్ ఈ షెడ్యూల్‏లో మెగాస్టార్ చిరంజీవి, ఫైటర్స్ తో ఉత్కంఠ భరితమైన యాక్షన్ ఎపిసోడ్‏ని ఫైట్ మాస్టర్స్ ద్వయం రామ్ లక్ష్మణ్ సారథ్యంలో చిత్రీకరిస్తున్నారు. ఇది అభిమానులకి, మాస్ ఆడియన్స్ కి ఒక కిక్ ఇచ్చేలా ఉండబోతుంది. హీరోయిన్ శృతి హాసన్ కూడా ఈ షెడ్యూల్ లో పాల్గొంటున్నారు. మెగా 154 చిత్రం మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపు దిద్దుకుంటుంది ఇందులో కమర్షియల్ అంశాలు సమపాళ్లలో ఉంటూ వింటేజ్ చిరంజీవిని మళ్ళీ స్క్రీన్ మీదకి తీసుకు వచ్చేలాగా పవర్ ఫుల్ దర్శకుడు బాబీ సిద్ధం చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి – బాబీ – శృతి హాసన్ కలయికలో ఇదే మొదటి చిత్రం .

ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్‏తో ఫాన్స్ కి పూనకాలు తెప్పించిన బాబీ ఈ చిత్రం లో తన ఫుల్ పొటెన్షియల్ తో మెగాస్టార్ చిరంజీవి ని ఒక సరికొత్త మాస్ పాత్ర లో చూపించనున్నారు. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, జి కె మోహన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం అగ్రశ్రేణి సాంకేతిక బృందం సహకరిస్తోంది, అయితే పలువురు ప్రముఖ నటీనటులు ఇందులో భాగమయ్యారు.

మెగా154 కి చిరంజీవి కి అనేక చార్ట్ బస్టర్ ఆల్బమ్ లను అందించిన రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, ఆర్థర్ ఎ విల్సన్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. ఎడిటర్ గా నిరంజన్ దేవరమానె, ప్రొడక్షన్ డిజైనర్ గా ఎఎస్ ప్రకాష్ పని చేస్తున్నారు. సుస్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్. బాబీ స్వయంగా కథ, మాటలు రాయగా, కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి స్క్రీన్ ప్లే రాశారు. రైటింగ్ డిపార్ట్మెంట్ లో హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి కూడా ఉన్నారు.

Also Read: Viral Photo: ఈ అందాల ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా ?.. అబ్బాయిల కలల రాకుమారి మన తెలుగమ్మాయి..

KGF 2 Trailer: కేజీఎఫ్ 2 ట్రైలర్ వచ్చేసింది.. ఇక ఫ్యాన్స్‏కు పూనకాలే..

RRR Movie: ఆ థియేటర్‌లో జక్కన్న సినిమాను ఫస్ట్‌ హాఫ్‌ మాత్రమే వేసి ఆపేశారు.. కారణమేంటంటే..

Varsha Bollamma: చూపుతిప్పుకోనివ్వని అందాల తార వ‌ర్ష బొల్ల‌మ్మ‌. పాప ఎక్స్‌ప్రెషన్స్‌‌కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..!

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu