Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRR Movie: ఓటీటీలో సందడి చేయనున్న ఆర్ఆర్ఆర్.. ఎప్పటినుంచి స్ట్రీమింగ్ అంటే..

ఆర్ఆర్ఆర్(RRR).. బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. టాలీవుడ్ గత రికార్డ్స్‏ను తిరగరాస్తూ విజయవంతంగా దూసుకుపోతుంది. మార్చి 25న విడుదలైన

RRR Movie: ఓటీటీలో సందడి చేయనున్న ఆర్ఆర్ఆర్.. ఎప్పటినుంచి స్ట్రీమింగ్ అంటే..
Rrr
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 28, 2022 | 8:52 AM

ఆర్ఆర్ఆర్(RRR).. బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. టాలీవుడ్ గత రికార్డ్స్‏ను తిరగరాస్తూ విజయవంతంగా దూసుకుపోతుంది. మార్చి 25న విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. జక్కన్న విజువల్ మ్యాజిక్.. రామ్ చరణ్.. ఎన్టీఆర్ అద్భుత నటన ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. ఈ సినిమాకు ఎక్కడ చూసిన పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై దానయ్య దాదాపు 450 కోట్ల బడ్జెట్‏తో ఈ చిత్రాన్ని నిర్మించగా.. ఇందులో చరణ్ అల్లూరి సీతారామారాజుగా.. ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటించి మెప్పించారు. అంతేకాకుండా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్.. అలియా భట్.. శ్రియా సరన్, సముద్రఖని కీలకపాత్రలలో నటించారు. ప్రస్తుతం ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్‏తో దూసుకుపోతుంది. తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమా ఓటీటీలో సందడి చేయనున్న వార్తలు ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి.

జక్కన్న అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా నెట్ ఫ్లిక్స్, జీ5 ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో విడుదలయ్యే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. భారీ ధరకు ఇప్పటికే డిజిటల్ రైట్స్ దక్కించుకున్నాని.. సినిమా విడుదలై 90 రోజులు దాటిన తర్వాత ఆర్ఆర్ఆర్ ఓటీటీలో సందడి చేయనుందట. జీ5లో దక్షిణాది భాషలలో.. నెట్ ఫ్లిక్స్ లో హిందీతోపాటు.. ఇతర భాషలైన ఇంగ్లీష్, పోర్చుగల్, కొరియన్, టర్కీష్, స్పానిష్ భాషలలో స్ట్రీమింగ్ చేయనున్నారట. సినిమా విడుదలైన 90 రోజుల తర్వాతనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలనే నిబంధనను ముందే ఫిక్స్ చేసుకున్నారట మేకర్స్. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందట.

Also Read: Viral Photo: ఈ అందాల ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా ?.. అబ్బాయిల కలల రాకుమారి మన తెలుగమ్మాయి..

KGF 2 Trailer: కేజీఎఫ్ 2 ట్రైలర్ వచ్చేసింది.. ఇక ఫ్యాన్స్‏కు పూనకాలే..

RRR Movie: ఆ థియేటర్‌లో జక్కన్న సినిమాను ఫస్ట్‌ హాఫ్‌ మాత్రమే వేసి ఆపేశారు.. కారణమేంటంటే..

Varsha Bollamma: చూపుతిప్పుకోనివ్వని అందాల తార వ‌ర్ష బొల్ల‌మ్మ‌. పాప ఎక్స్‌ప్రెషన్స్‌‌కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..!