Radhe Shyam: డార్లింగ్ ఫ్యాన్స్‌కు పండగలాంటి వార్త.. రాధేశ్యామ్‌ ఓటీటీలో వచ్చేది ఆ రోజే.. అధికారిక ప్రకటన..

Radhe Shyam OTT: ప్రభాస్‌ (Prabhas), పూజా హెగ్డేలు (Pooja Hegde) జంటగా తెరకెక్కిన ఈ సినిమా రాధేశ్యామ్‌. మార్చి 11న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదలైన విషయం తెలిసిందే. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది...

Radhe Shyam: డార్లింగ్ ఫ్యాన్స్‌కు పండగలాంటి వార్త.. రాధేశ్యామ్‌ ఓటీటీలో వచ్చేది ఆ రోజే.. అధికారిక ప్రకటన..
Radhe Shyam Ott
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 28, 2022 | 4:26 PM

Radhe Shyam OTT: ప్రభాస్‌ (Prabhas), పూజా హెగ్డేలు (Pooja Hegde) జంటగా తెరకెక్కిన ఈ సినిమా రాధేశ్యామ్‌. మార్చి 11న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదలైన విషయం తెలిసిందే. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ప్రభాస్‌ లాంటి యాక్షన్‌ హీరో నుంచి క్లాస్‌ మూవీని ఊహించకపోవడం, సినిమా క్లాస్‌ ఆడియన్స్‌ను టార్గెట్‌ చేసుకొని రావడంతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అయితే కొన్ని వర్గాల ప్రేక్షకులకు మాత్రం సినిమాకు ఫిదా అయ్యారు. విడుదలైన తొలి నాళ్లలో నెగిటివ్‌ టాక్‌ వచ్చినా ఆ తర్వాత నెమ్మదిగా కొన్ని వర్గాల్లో పాజిటివ్‌ బజ్‌ వచ్చిందని చెప్పాలి.

ఇదిలా ఉంటే ఈ సినిమా విడుదలై నెల రోజులు కూడా గడవక ముందే ఓటీటీలో రానుంది. నిజానికి మూడు నెలల వరకు ఓటీటీలో విడుదల చేయకూడదని మొదట్లో చిత్ర యూనిట్ భావించింది. అయితే మిక్స్‌డ్‌ టాక్‌ రావడం, అంతలోనే ఆర్‌.ఆర్‌.ఆర్‌ థియేటర్లలోకి రావడంతో చిత్ర యూనిట్‌ అనుకున్న సమయాని కంటే ముందుగానే ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. తాజాగా ఈ సినిమాను ఏప్రిల్‌ 1 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ అమెజాన్‌ కొత్త ట్రైలర్‌ను విడుదల చేసింది.

జ్యోతిష్యం, డెస్టినీ అనే విభిన్న కథాంశంతో తెరక్కిందే ఈ రాధేశ్యామ్‌. విధిని ఎదురించే శక్తి ప్రేమకు మాత్రమే ఉందన్న విషయాన్ని దర్శకుడు చెప్పే ప్రయత్నం చేశాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన రాధేశ్యామ్‌ విజువల్‌ పరంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా విదేశాల్లో చిత్రీకరించిన సన్నివేశాలు ఆడియన్స్‌ను మెస్మరైజ్‌ చేశాయి. మరి డిజిటల్‌ స్క్రీన్‌పై స్ట్రీమింగ్ కానున్న ఈ సినిమాకు ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాలి.

Also Read: కేవలం 8 బంతులు.. 312 స్ట్రైక్‌రేట్‌‌తో మ్యాచ్ ఫలితానే మార్చిన తుఫాన్ ఇన్నింగ్స్.. బిత్తర పోయిన బౌలర్లు..

Viral Video: వాళ్ల రెక్కలను కత్తిరించవద్దు.. కత్తిరించాల్సి వస్తే మీ రెక్కలు కత్తిరించుకోండి.. మిస్ యూనివర్స్ – 2021 కామెంట్స్

Beauty Tips: అవిసెగింజలతో అందానికి మెరుగులు.. ఇలా చేసి చూడండి..!

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో