కేవలం 8 బంతులు.. 312 స్ట్రైక్‌రేట్‌తో మ్యాచ్ ఫలితానే మార్చిన తుఫాన్ ఇన్నింగ్స్.. బిత్తర పోయిన బౌలర్లు..
Odean Smith: ఇది మాములు బ్యాటింగ్ కాదు.. బౌలర్లకు చుక్కలు చూపిస్తూ.. కేవలం 8 బంతుల్లోనే మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసిన అద్భుత ఇన్నింగ్స్.. భారీ స్కోర్ చేసిన ప్రత్యర్థులు విజయంపై ధీమాగా ఉన్న సమయంలో.. బరిలోకి దిగిన ఈ బ్యాటర్..
IPL 2022: ఇది మాములు బ్యాటింగ్ కాదు.. బౌలర్లకు చుక్కలు చూపిస్తూ.. కేవలం 8 బంతుల్లోనే మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసిన అద్భుత ఇన్నింగ్స్.. భారీ స్కోర్ చేసిన ప్రత్యర్థులు విజయంపై ధీమాగా ఉన్న సమయంలో.. బరిలోకి దిగిన ఈ బ్యాటర్.. కేవలం ఆరంటే ఆరే బంతుల్లో వారి ఆశలను కైమా చేసిన ఖతర్నాక్ ఇన్నింగ్స్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో అంతే ఉండదు. మొత్తంగా ఈ బ్యాటర్ ఆడింది కేవలం 8 బంతులు. ఇందులో విశేషం ఏముందని అనుకుంటున్నారా. అక్కడికే వస్తున్నాం. ఈ 8 బంతుల్లో బౌలర్లను ఊచకోత కోస్తూ.. బౌండరీల వర్షం కురిపిస్తూ.. 25 పరుగులు సాధించాడు. ఇందులో 1 ఫోర్, 3 సిక్సులు ఉన్నాయి. ఇక స్ట్రైక్ రేట్ చూస్తే మాత్రం బిత్తరపోవాల్సిందే. ఓడియన్ స్మిత్(Odean Smith ) 312.50 స్ట్రైక్ రేట్‌తో పరుగులు సాధించాడు. ఇదంతా ఏమ్యాచ్ గురించి అనుకుంటున్నారా? క్రికెట్ రిచ్ లీగ్‌గా పేరుగాంచిన ఐపీఎల్‌లోనే ఇంతటి భీకరమైన బ్యాటింగ్ చోటుచేసుకుంది. ఆదివారం జరిగిన డబుల్ హెడర్‌లో భాగంగా రెండో మ్యాచులో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(PBKS vs RCB) టీంలు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు టీం నిర్ణీత ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి 205 పరగులు చేసింది. ప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్(88 పరుగులు, 57 బంతులు, 3 ఫోర్లు, 7 సిక్సులు) అద్భుత ఇన్నింగ్స్‌కు తోడు కోహ్లీ(41 పరుగులు, 29 బంతులు, 1 ఫోర్, 2 సిక్సులు), దినేష్ కార్తీక్(32 పరుగులు, 14 బంతులు, 3 ఫోర్లు, 3 సిక్సులు) తోడవడంతో బెంగళూరు స్కోర్ 200 పరుగులు దాటింది.
అనంతరం 206 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌కు శుభారంభం లభించింది. పవర్ ప్లేలో మయాంక్, ధావన్ 10కి పైగా రన్ రేట్ తో పరుగులు చేశారు. వీరిద్దరూ ఓపెనింగ్ వికెట్‌కు 71 పరుగులు అందించారు. మయాంక్ 32 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. ఆ తర్వాత ధావన్(43) పెవిలియన్ చేరాడు. పంజాబ్ ఇన్నింగ్స్ 14వ ఓవర్ వేసిన మహ్మద్ సిరాజ్ వరుసగా రెండు బంతుల్లో రెండు వికెట్లు తీశాడు. ఆ ఓవర్ తొలి బంతికే నిలకడగా చెలరేగుతున్న భానుక రాజపక్సే (43)ను సిరాజ్ అవుట్ చేశాడు. రాజపక్సే క్యాచ్ పాయింట్ వద్ద షాబాజ్ అహ్మద్ చేతికి చిక్కాడు. ఆ తర్వాతి బంతికే సిరాజ్ ఐపీఎల్‌లో అరంగేట్రం చేస్తున్న అండర్-19 ప్రపంచకప్ హీరో రాజ్ బావా (0)ను ఎల్‌బీడబ్ల్యూతో పెవిలియన్ చేర్చాడు. ఇన్నింగ్స్ 17వ ఓవర్‌లో బెంగళూరు 3 వికెట్లు కోల్పోయింది. ఓవర్ నాలుగో బంతికి, డీప్ ఎక్స్‌ట్రా కవర్‌లో ఓడియన్ స్మిత్ ఇచ్చిన సాధారణ క్యాచ్‌ను అనుజ్ రావత్ వదిలేశాడు. షారుఖ్ ఖాన్ తర్వాతి బంతిని డ్రైవ్ చేసి రెండు పరుగులు చేశాడు. ఇంతలో, ఒడియన్ తృటిలో రనౌట్ నుంచి తప్పించుకున్నాడు. ఓవర్ చివరి బంతికి లాంగ్ ఆన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న డేవిడ్ విల్లీ, షారుఖ్ ఖాన్ క్యాచ్‌ను వదిలేశాడు.
ఓడియన్ స్మిత్ 8 బంతుల్లో 312 స్ట్రైక్ రేట్‌తో 25 పరుగులు చేశాడు. షారుక్ 120 స్ట్రైక్ రేట్‌తో 20 బంతుల్లో 24 పరుగులు చేశాడు. తడబడిన పంజాబ్ ఇన్నింగ్స్‌ను ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్స్ సూపర్బ్‌గా హ్యాండిల్ చేసి విజయాన్ని ఖాయం చేశారు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 52 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. షారుఖ్ 20 బంతుల్లో 24, ఓడియన్ స్మిత్ అజేయంగా 25 పరుగులు చేసి పంజాబ్ పాలిట హీరోలుగా, బెంగళూరు పాలిట విలన్లుగా మారారు.
ఓడియన్ స్మిత్ బ్యాటింగ్ చూసిన విరాట్ కోహ్లీతోపాటు బెంగళూరు ఆటగాళ్లు షాకయ్యారు. ఒక్క ఓవర్‌లో మ్యాచ్‌ను వారి నుంచి లాక్కోవడంతో ధీనంగా ఉండిపోయారు. అప్పటి దాక విజయం సాధిస్తామన్నట్లు ఉన్న బెంగళూరు టీం.. ఓడియన్ స్మిత్ తుఫాన్ ఇన్నింగ్స్‌తో అంతా తారుమారు అవ్వడంతో అయోమయానికి గురయ్యారు. ఇదేం బ్యాటింగ్‌రా బాబు అంటూ పంజాబ్ విజయానికి హీరోలుగా మారిన ఓడియన్ స్మిత్, షారుక్ ఖాన్‌లకు కంగ్రాట్స్ చెప్పారు.
Also Read: IPL 2022: రోహిత్ శర్మకు వరుస షాక్‌లు.. ఇదే రిపీటైతే వేటు పడే అవకాశం?