IPL 2022: ఇంజనీరింగ్‌ చదివి క్రికెటర్ అయ్యాడు.. ఇప్పుడు ఐఎస్‌బీ హైదరాబాద్‌లో అడ్మిషన్‌.. ఎటువైపు మొగ్గుచూపు..!

IPL 2022: కోల్‌కతా ప్లేయర్, ఎడమచేతి బ్యాట్స్‌మెన్ ప్రథమ్ సింగ్ ఇంజనీరింగ్ తర్వాత ఇప్పుడు హైదరాబాద్‌ బిజినెస్‌ స్కూల్‌లో సీటు సంపాదించాడు.

IPL 2022: ఇంజనీరింగ్‌ చదివి క్రికెటర్ అయ్యాడు.. ఇప్పుడు ఐఎస్‌బీ హైదరాబాద్‌లో అడ్మిషన్‌.. ఎటువైపు మొగ్గుచూపు..!
Pratham Singh
Follow us
uppula Raju

|

Updated on: Mar 28, 2022 | 12:37 PM

IPL 2022: కోల్‌కతా ప్లేయర్, ఎడమచేతి బ్యాట్స్‌మెన్ ప్రథమ్ సింగ్ ఇంజనీరింగ్ తర్వాత ఇప్పుడు హైదరాబాద్‌ బిజినెస్‌ స్కూల్‌లో సీటు సంపాదించాడు. అయితే క్రికెట్ పట్ల అతనికి ఉన్న మక్కువ చివరికి ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కి దారితీసింది. ఢిల్లీకి చెందిన 29 ఏళ్ల ప్రథమ్‌ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో రైల్వేస్ కోసం మంచి ప్రదర్శనను కొనసాగించాడు. ఐదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్ గత మెగా వేలంలో అతడిని కొనుగోలు చేసింది. ఇప్పుడు ఐపీఎల్ 2022 లో తన సత్తా నిరూపించుకునేందుకు సిద్ధమయ్యాడు. ప్రథమ్ సింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్‌లో ఇంజినీరింగ్ చేశాడు. ఆ తర్వాత ఐఎస్‌బీ హైదరాబాద్‌లో అడ్మిషన్‌ పొందాడు. ఇప్పుడు క్రికెట్‌ ఆడుతూనే ఎంబీఏ గురించి ఆలోచిస్తున్నాడు. అతను ఈ విధంగా చెప్పాడు.. ‘లాక్డౌన్ సమయంలో ఖాళీగా ఉన్నాను. అప్పటికే నాకు 27 ఏళ్లు. ఐపీఎల్ జట్టులో కూడా ఆడలేదు. కాబట్టి చదువుకోవాలని ఆలోచించి ISB హైదరాబాద్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాను. కానీ క్రికెట్ మళ్లీ మొదలైంది. క్రికెట్‌ను వీలైనంత ఎక్కువగా ఆడాలనుకుంటున్నాను ఎందుకంటే అది నా ఆసక్తి’ అన్నాడు.

ఐపీఎల్‌ ఆడటంపై సింగ్ మాట్లాడుతూ.. “దేశవాళీ క్రికెటర్లందరికీ ఇది గొప్ప అవకాశం. నేను రైల్వేస్‌కు బాగా రాణిస్తున్నాను. ఐపీఎల్‌లో ఒక్క ఇన్నింగ్స్ కూడా మీ జీవితాన్ని మార్చేస్తుంది. బాగా రాణిస్తే దేశం తరఫున కూడా ఆడే అవకాశం ఉంటుంది. నేను గత రెండు వారాలుగా టీమ్‌తో ఉన్నాను. బ్రెండన్ మెకల్లమ్, అభిషేక్ నాయర్ నుంచి చాలా నేర్చుకున్నాను. నేను మరింత మెరుగుపరుచుకోవడం ద్వారా క్రికెటర్‌గా ప్రభావం చూపడానికి ప్రయత్నిస్తున్నాను”

2019-20 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ప్రథమ్ సింగ్ 10 మ్యాచ్‌ల్లో 438 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతని సగటు 54.75 కాగా స్ట్రైక్ రేట్ 136.02. దీంతో లీగ్ దశలో రైల్వే జట్టు అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత 2020-21 సీజన్‌లో ఒక సెంచరీ, రెండు అర్ధ సెంచరీల సాయంతో 229 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతని సగటు 74.75.

Knowledge: పెద్ద పెద్ద భవనాలు నిర్మించేటప్పుడు ఆకుపచ్చ పరదాలతో కప్పుతారు.. ఎందుకో తెలుసా..!

Alert: వాహనదారులు అలర్ట్.. ఫిట్‌నెస్‌ నిబంధనలలో పలు మార్పులు..!

Healthy Foods: ఎండాకాలం వేడి భరించలేకపోతున్నారా.. ఈ ఆహారాలు డైట్‌లో చేర్చుకోండి..!