AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Alert: వాహనదారులు అలర్ట్.. ఫిట్‌నెస్‌ నిబంధనలలో పలు మార్పులు..!

Motorists Alert: వాహనాల ఫిట్‌నెస్‌ తనిఖీ కోసం ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ (ATS)ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కొన్ని సవరణలను ప్రతిపాదించింది. వీటి ప్రకారం..

Alert: వాహనదారులు అలర్ట్.. ఫిట్‌నెస్‌ నిబంధనలలో పలు మార్పులు..!
Vehicles Fitnes
uppula Raju
|

Updated on: Mar 28, 2022 | 11:22 AM

Share

Motorists Alert: వాహనాల ఫిట్‌నెస్‌ తనిఖీ కోసం ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ (ATS)ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కొన్ని సవరణలను ప్రతిపాదించింది. వీటి ప్రకారం.. ఒక రాష్ట్రంలో రిజిస్టర్ అయిన వాహనాలు మరొక రాష్ట్రంలో ఫిట్‌నెస్‌ చేసుకోవచ్చు. దీంతో పాటు వెహికిల్‌ వ్యాలిడిటీ ముగిసిందని ఈ కేంద్రాలు ప్రకటించవచ్చు. రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్‌ల గుర్తింపు, నియంత్రణ, నిబంధనలలో సవరణలు చేయడానికి మార్చి 25, 2022న డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇందులో కొన్ని చిన్న మార్పులు కూడా ప్రతిపాదించారు. ATSలో నిర్వహించాల్సిన పరీక్షల జాబితా, ఇన్‌స్టాల్ చేయాల్సిన పరికరాల నిర్దిష్ట వివరాల గురించి ప్రతిపాదించారు. ఫిట్‌నెస్ పరీక్ష ఫలితాలు ఆటోమేటిక్‌గా మారడంతో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం ఉండదు. ఫిట్‌నెస్ పరీక్షలో వాహనాలను తనిఖీ చేసే సిగ్నల్స్‌ యంత్రం నేరుగా విషయాన్ని సర్వర్‌కు పంపుతుంది.

వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి వాహనాలకు ఫిట్‌నెస్ పరీక్ష

వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి దశలవారీగా ఏటీఎస్‌ ద్వారా వాహనాల ఫిట్‌నెస్‌ పరీక్షను నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నిబంధన దశలవారీగా అమలు చేస్తుంది. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ప్రకారం ఏప్రిల్ 1, 2023 నుంచి ATS ద్వారా భారీ వస్తువుల వాహనాలు, భారీ ప్యాసింజర్ మోటారు వాహనాలకు ఫిట్‌నెస్ పరీక్ష తప్పనిసరి. మధ్యస్థ వస్తువుల వాహనాలు, మధ్యస్థ ప్రయాణీకుల మోటారు వాహనాలు, తేలికపాటి మోటారు వాహనాల (రవాణా) విషయంలో జూన్ 1, 2024 నుంచి అమలుచేస్తారు. వ్యక్తిగత వాహనం (నాన్ ట్రాన్స్‌పోర్ట్) ఫిట్‌నెస్ టెస్టింగ్ 15 సంవత్సరాల తర్వాత జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గతేడాది ఆగస్టులో నేషనల్ వెహికల్ స్క్రాపేజ్ పాలసీని ప్రారంభించి, కాలుష్యకారక వాహనాలను దశలవారీగా నిర్మూలించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. వాహన స్క్రాపేజ్ విధానం 1 ఏప్రిల్ 2022 నుంచి వర్తిస్తుంది.

Healthy Foods: ఎండాకాలం వేడి భరించలేకపోతున్నారా.. ఈ ఆహారాలు డైట్‌లో చేర్చుకోండి..!

Scooters: ఇండియాలో మహిళలు మెచ్చే 5 ఫేమస్ స్కూటర్లు ఇవే..!

Heart Attack: గుండెపోటు తర్వాత బ్రెయిన్‌లో మార్పులు.. అధ్యయనంలో షాకింగ్‌ నిజాలు..!