Tax Alert: టాక్స్ చెల్లింపుదారులకు హెచ్చరిక.. మార్చి 31 నాటికి అవి పూర్తి చేయకపోచే జైలుకే..
Tax Alert: టాక్స్ పేయర్స్(Tax Payer) గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయటానికి కేవలం కొన్నిరోజులు మాత్రమే సమయం ఉంది. డెడ్ లైన్ లోపు కచ్చితంగా ఆదాయపన్ను రిటర్న్ (Income Tax Return) దాఖలు చేయాల్సిందే. లేకపోతే ఏం జరుగుతుందంటే..
Tax Alert: టాక్స్ పేయర్స్(Tax Payer) గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయటానికి కేవలం కొన్నిరోజులు మాత్రమే సమయం ఉంది. డెడ్ లైన్ లోపు కచ్చితంగా ఆదాయపన్ను రిటర్న్ (Income Tax Return) దాఖలు చేయాల్సిందే. 2021 – 22 అసెస్‌మెంట్ ఇయర్‌కు సంబంధించి ఐటీఆర్ దాఖలు చేయడానికి మార్చి 31తో గడువు పూర్తిగా ముగిసిపోతుంది. సాధారణంగా డెడ్‌లైన్ 2021 డిసెంబర్ 31 వరకే అయినప్పటికీ.. పెనాల్టీతో మార్చి నెల చివరి వరకు ఐటీఆర్ దాఖలు చేయొచ్చు. ఇప్పటికే ఐటీఆర్ దాఖలు చేసి.. అందులో తప్పులు ఉన్నట్లయితే వాటిని సరిచేసి మళ్లీ ఐటీఆర్ దాఖలు చేసేందుకు కూడా మార్చి 31 చివరి గడువు. ఇది మిస్ అయితే టాక్స్ పేయర్ ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. ఆదాయపన్ను చట్టంలోని రూల్స్ అతిక్రమిస్తే 3 నుంచి 7 సంవత్సరాలు జైలు శిక్ష పడే ప్రమాదం కూడా ఉంది.
టాక్స్ పేయర్ గతంలో పన్ను చెల్లించకపోయినట్లయితే.. అధికారులు ఇప్పుడు దానిని 50 నుంచి 200 శాతం అపరాద రుసుముతో కలిపి వసూలు చేస్తారని టాక్స్ నిపుణులు అంటున్నారు. సమయానికి టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయకపోతే కోర్టులో దావా వేసేందుకు ఆదాయపు పన్ను శాఖ పవర్స్ కలిగి ఉంటుందని వారు చెబుతున్నారు. రూ. 10 వేలకు పైగా టాక్స్ చెల్లించాల్సి ఉన్నట్లయితే అప్పుడు ఐటీ అధికారులు చర్యలు తీసుకుని జైలుకు పంపే అవకాశం ఉంటుంది. అంతకంటే తక్కువ టాక్స్ లైబెలిటీ ఉన్న వారికి నోటీసులు జారీ చేసే అవకాశం ఉంటుంది. ఆదాయం రూ.5 లక్షలకు పైన ఉన్నట్లయితే.. అప్పుడు రూ.5 వేలు, తక్కువ ఉన్నట్లయితే రూ.1000 పెనాల్టీ పడుతుంది. 2021-22 అసెస్‌మెంట్ ఇయర్‌కు సంబంధించిన రిటర్న్ ను 2022 మార్చి తర్వాత దాఖలు చేసినట్లియితే రూ .10 వేలు జరిమానా పడుతుంది. కాబట్టి పన్ను చెల్లింపుదారులు గడువులోగా పన్ను చెల్లించటం మంచిది.
ఇవీ చదవండి..
Minors Tax: మైనర్లు కూడా టాక్స్ చెల్లించాలా..? దానిని ఎలా లెక్కిస్తారో తెలుసుకోండి..
Rich Indians Migrating: పౌరసత్వం వదులుకుని ఆ దేశాలకు వెళ్లిపోతున్న భారతీయులు.. ఎందుకో తెలుసా..