AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Credit Score: మంచి క్రెడిట్ స్కోర్ ఉన్నా లోన్ రిజెక్ట్ అవుతోందా..? అయితే ఇలాంటి తప్పులు అస్సలు చేయకండి..

Credit Score: క్రెడిట్ స్కోర్ అందరికీ తెలిసిన విషయమే. లోన్ తీసుకోవాలనుకునే వారికి  క్రెడిట్ స్కోర్ ఎంతో ముఖ్యమైనది. క్రెడిట్ స్కోర్ బాగుంటేనే లోన్ ఈజీగా లభిస్తుంది. కానీ ఆ తప్పులు చేస్తే మంచి సిబిల్ ఉన్నా లోన్ రిజెక్ట్ అవుతుంది.

Credit Score: మంచి క్రెడిట్ స్కోర్ ఉన్నా లోన్ రిజెక్ట్ అవుతోందా..? అయితే ఇలాంటి తప్పులు అస్సలు చేయకండి..
Credit Score
Ayyappa Mamidi
|

Updated on: Mar 28, 2022 | 1:09 PM

Share

Credit Score: క్రెడిట్ స్కోర్ అందరికీ తెలిసిన విషయమే. లోన్ తీసుకోవాలనుకునే వారికి  క్రెడిట్ స్కోర్ ఎంతో ముఖ్యమైనది. క్రెడిట్ స్కోర్ బాగుంటేనే లోన్ ఈజీగా లభిస్తుంది. లోన్(Loan) ఇవ్వటానికి ముందుగా.. బ్యాంకులు(Banks) రుణ గ్రహీత క్రెడిట్ స్కోర్‌ను పరిశీలిస్తాయి. అందుకే క్రెడిట్ స్కోర్‌ను చాలా జాగ్రత్తగా చూసుకుంటుండాలి. సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్నట్లయితే పర్సనల్ లోన్, హోమ్ లోన్.. ఇలా ఏది పొందాలన్నా చాలా కష్టంగా మారుతుంది. కానీ.. కొన్ని సందర్భాల్లో క్రెడిట్ స్కోర్ బాగున్నప్పటికీ బ్యాంకులు లోన్ అప్లికేషన్ రిజెక్ట్ చేస్తుంటాయి. సాధారణంగా 750కి పైన క్రెడిట్ స్కోర్ ఉంటే.. దాన్ని మంచి క్రెడిట్ స్కోర్ గా బావిస్తారు. ఇలాంటి వారికి సులభంగానే రుణాలు పొందుతారు.

కానీ అన్నీ బాగున్నా కొన్ని సార్లు లోన్ రాకపోవటాని ఈ అంశాలు కారణంగా మారవచ్చు. అవేంటంటే.. రుణగ్రహీత కంపెనీ, నెలవారీ జీతం, క్రెడిట్ స్కోర్, ఇన్‌కమ్ ఈఎంఐ రేషియో లాంటివి. వీటిల్లో మీరు ప్రతి నెలా చెల్లించే ఈఎంఐలు కీలకమైనవిగా చెప్పుకోవాలి. ఎక్కువ ఈఎంఐలు చెల్లిస్తూ ఉంటే.. అప్పుడు క్రెడిట్ స్కోర్ ఎక్కువున్నా కూడా కొత్తగా రుణం పొందడం సాధ్యం కాకపోవచ్చు. దీనకి తోడు క్రెడిట్ కార్డుపై లోన్ తీసుకోవటం వల్ల కూడా కొన్నిసార్లు లోన్ రిజెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. అనేక బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థల నుంచి లోన్ పొంది ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఎదురుదెబ్బ తగలవచ్చు. కొన్ని బ్యాంకుల్లో లోన్ రిజెక్ట్ అయినా కూడా మీ తరువాతి లోన్ పై కూడా పడుతుంది. కొత్తగా లోన్ తీసుకునేటప్పుడు ఇలాంటి అన్ని విషయాలనూ తప్పక సరిచూసుకోవాలి. లేకుంటే ఇబ్బంది పడాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల క్రెడిట్ స్కోర్ కూడా గణనీయంగా ప్రభావితమయ్యే ప్రమాదం ఉంటుంది.

ఇవీ చదవండి..

Tax Alert: టాక్స్ చెల్లింపుదారులకు హెచ్చరిక.. మార్చి 31 నాటికి అవి పూర్తి చేయకపోచే జైలుకే..

Markets: నష్టాలతో వారం ప్రారంభం.. నెగెటివ్‌లో ట్రేడ్ అవుతున్న సూచీలు..