Rich Indians Migrating: పౌరసత్వం వదులుకుని ఆ దేశాలకు వెళ్లిపోతున్న భారతీయులు.. ఎందుకో తెలుసా..
Rich Indians Migrating: దేశీయ ధనికులు క్రమంగా విదేశాల్లో సెటిల్ అయ్యేందుకు మక్కువ చూపుతున్నారు. వేరే దేశాల్లో ఇన్వెస్ట్ మెంట్(Investment) చేయటం ద్వారా అక్కడ శాశ్వత వివాసాలను ఏర్పాటు చేసుకుంటున్నారని తాజా నివేదికలు చెబుతున్నాయి. ఎందుకంటే..
Rich Indians Migrating: దేశీయ ధనికులు క్రమంగా విదేశాల్లో సెటిల్ అయ్యేందుకు మక్కువ చూపుతున్నారు. వేరే దేశాల్లో ఇన్వెస్ట్ మెంట్(Investment) చేయటం ద్వారా అక్కడ శాశ్వత వివాసాలను(Permanent Residence) ఏర్పాటు చేసుకోవటం, ఆయా దేశాల పౌరసత్వం పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ తరహా చర్యలు 2020తో పోల్చితే 54 శాతం పెరిగినట్లు హెన్లీ అండ్ పార్ట్‌నర్స్ నివేదిక చెబుతోంది. ఈ కంపెనీ విదేశీ నివాస, పౌరసత్వం కోసం ప్రయత్నించే వారికి సేవలను అందిస్తూ ఉంటుంది. ఇతర దేశాల్లో స్థిరపడేందుకు తమను సంప్రదిస్తున్న ప్రపంచ శ్రీమంతుల్లో ఎక్కువ మంది భారత్, అమెరికా, బ్రిటన్ కు చెందిన వారేనని సంస్థ వెల్లడించింది.
గడచిన ఐదేళ్ల కాలంలో 6 లక్షల మందికి పైగా భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నట్లు తెలుస్తోంది. కానీ.. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అందించిన గణాంకాలను గమనిస్తే ఐదేళ్లలో మన దేశ పౌరసత్వం వదులుకున్నవారి సంఖ్య 6 లక్షలకు పైగానే ఉంది. వారిలో 40 శాతం మంది అమెరికాకు వలసపోయారు. ఈ ఆరు లక్షల మందిలో గోల్డెన్ వీసా ద్వారా పోర్చుగల్, మాల్టా, సైప్రస్ తదితర దేశాల్లో స్థిరపడిన వారు కూడా ఉన్నారు. ఐదేళ్ల కాలంలో చూసుకున్నట్లయితే అత్యధికంగా 2019లో 1,44,017 మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నారు. కరోనా కారణంగా 2020లో ఈ సంఖ్య కొంత తగ్గి 85,248కి పరిమితమైంది. 2021 సెప్టెంబరు నాటికే 1,11,287 కు చేరుకుంది. ఈ ఏడాదిలో ఈ సంఖ్య మరింత పెరగవచ్చని గ్లోబల్ వెల్త్ మైగ్రేషన్ అంచనా వేస్తోంది. 2020లో 2 శాతం భారత మిలియనీర్లు విదేశాలకు మకాం మార్చారని ఈ సంస్థ వెల్లడించింది.
పెట్టుబడుల ద్వారా వలసలకు భారత ధనికులు అధికంగా మొగ్గుచూపుతున్న దేశాల్లో పోర్చుగల్ అగ్రస్థానంలో ఉంది. ఆస్ట్రేలియా, అమెరికా, మాల్టా, గ్రీస్ దేశాలు టాప్ 5లో నిలిచాయని హెన్లీ అండ్ పార్ట్‌నర్స్ రిపోర్టు స్పష్టం చేసింది. స్పెయిన్, యూఏఈ, సింగపూర్ వంటి దేశాలు కూడా ఈ జాబితాలోనే ఉన్నాయి. ఇంతకు ముందు కాలంలో భారతీయులు ఎక్కువగా అమెరికా, కెనడాలో ప్రత్యామ్నాయ నివాసం ఏర్పాటు చేసుకునేందుకు మొగ్గుచూపేవారు. కానీ.. సులభతరమైన ప్రక్రియతో తక్కువ పెట్టుబడికే వేగంగా రెసిడెన్స్ వీసాలు ఆఫర్ చేస్తుండటంతో గత కొన్నేళ్లుగా భారత సంపన్నుల్లో అధికమంది యూరోపియన్ దేశాల వైపు ఆకర్షితులవుతున్నట్లు నివేదిక చెబుతోంది. అక్కడ హాలిడే హోం ఏర్పాటు చేసుకునేందుకు HNIలు, స్టార్టప్ వ్యవస్థాపకులు ఎక్కువగా ఇష్టపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ వీసా ద్వారా పోర్చుగల్‌లో జీవించడంతో పాటు అక్కడే పనిచేసుకోవచ్చు, చదువుకోవచ్చు. దీనికి తోడు యూరోపియన్ స్కెంజెన్ పరిధిలోని 26 దేశాల్లో వీసా లేకుండానే పర్యటించేందుకు వారికి వెసులుబాటు కలుగుతుంది.
ఇవీ చదవండి..
Bharti Airtel: ఆ కంపెనీలో ఎయిర్ టెల్ వాటా కొనుగోలు.. వ్యూహాత్మకంగా పెట్టుబడి..
Investment Frauds: సోషల్ మీడియా టిప్స్ తో పెట్టుబడులు పెడుతున్నారా..? అయితే జాగ్రత్త గురూ..