Bharti Airtel: ఆ కంపెనీలో ఎయిర్ టెల్ వాటా కొనుగోలు.. వ్యూహాత్మకంగా పెట్టుబడి..

Bharti Airtel: దేశీయ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌ మరో భారీ పెట్టుబడి పెట్టింది. కంపెనీ అవసరాలకు అనుగుణంగా ఉపయోగపడే విధంగా విద్యుత్ రంగంలో వ్యూహాత్మకంగా పెట్టుబడిని పెట్టింది.

Bharti Airtel: ఆ కంపెనీలో ఎయిర్ టెల్ వాటా కొనుగోలు.. వ్యూహాత్మకంగా పెట్టుబడి..
Bharati Airtel
Follow us

|

Updated on: Mar 28, 2022 | 7:57 AM

Bharti Airtel: దేశీయ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌ మరో భారీ పెట్టుబడి పెట్టింది. కంపెనీ అవసరాలకు అనుగుణంగా ఉపయోగపడే విధంగా విద్యుత్ రంగంలో వ్యూహాత్మకంగా పెట్టుబడిని పెట్టింది. మహరాష్ట్రకు చెందిన ఎలక్ట్రిక్‌ యూటీలిటీ(Electric Utility) కంపెనీ అవాదా కేఎన్‌షోరాపూర్(Avaada Knshorapur) ప్రైవేట్ లిమిటెడ్‌లో ఈ మేరకు టెలికాం దిగ్గజం భారీగా పెట్టుబడులు పెట్టింది. సొంతంగా విద్యుత్ ఉత్పాదక కంపెనీలను కలిగివుండాలనే నిబంధనలో భాగంగా భారతి ఎయిర్‌టెల్‌ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. అవాదా కేఎన్‌షోరాపూర్‌లో 7 శాతానికిపైగా వాటాను రూ. 1.74 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసినట్లు భారతి ఎయిర్‌టెల్‌ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. డీల్ వివరాలను వెల్లడిస్తూ.. ఒక్కో ఈక్వీటి షేర్‌ను రూ. 10 చొప్పున చెల్లిస్తూ.. 17,42,650 షేర్లను కొనుగోలు చేసినట్లు పేర్కొంది. ఇందుకోసం రూ. 1.74 కోట్లు చెల్లించినట్లు స్పష్టం చేసింది. సంస్థ సొంత అవసరాల కోసం అవాదా కేఎన్‌షోరాపూర్ నుంచి విద్యుత్‌ను తీసుకోనున్నట్లు వివరించింది.

మల్టీ నేషనల్ కంపెనీలు  తమ విద్యుత్ అవసరాల కోసం సొంతంగా క్యాప్టివ్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యుత్ చట్టం- 2003 ప్రకారం కంపెనీ తమ సొంత అవసరాల కోసం అవాదా కేఎన్‌షోరాపూర్ నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేసుకునేందుకు వీలుగా పెట్టుబడులు పెట్టింది. పెట్టుబడులను పెట్టడం ద్వారా వచ్చే ఆదాయాన్ని భారతి ఎయిర్‌టెల్ విద్యుత్ రూపంలో పొందే అవకాశాలు ఉన్నట్లు మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.

ఇవీ చదవండి..

Home Insurance: ఒక కప్పు టీ ధరకు గృహ బీమా పొందవచ్చు! ఎలాగో తెలుసుకోండి

Investment Frauds: సోషల్ మీడియా టిప్స్ తో పెట్టుబడులు పెడుతున్నారా..? అయితే జాగ్రత్త గురూ..