AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Investment Frauds: సోషల్ మీడియా టిప్స్ తో పెట్టుబడులు పెడుతున్నారా..? అయితే జాగ్రత్త గురూ..

Investment Frauds: గతవారం మార్కెట్స్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) మార్కెట్ మానిప్యులేషన్ రాకెట్‌ను ఛేదించింది. ఇలాంటి వాటి వల్ల ఎంత నష్టమో తెలుసా.

Investment Frauds: సోషల్ మీడియా టిప్స్ తో పెట్టుబడులు పెడుతున్నారా..? అయితే జాగ్రత్త గురూ..
Inveatment Frauds
Ayyappa Mamidi
|

Updated on: Mar 28, 2022 | 7:28 AM

Share

Investment Frauds: గతవారం మార్కెట్స్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) మార్కెట్ మానిప్యులేషన్ రాకెట్‌ను ఛేదించింది. మోసపూరిత స్టాక్ సిఫార్సులను ప్రచారం సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసేందుకు వినియోగిస్తున్నట్లు బయటపడింది. ఫైనాన్స్ స్కామ్స్(Finance Scams) నిర్వహించేందుకు ఆన్ లైన్ వేదికలను వినియోగించుకోవటం విపరీతంగా పెరిగిపోయింది. 18 నుంచి 34 ఏళ్ల వయస్సు మధ్య వారిలో 35% మంది తమ ఇన్వెస్ట్ మెంట్ అడ్వౌజ్(Investment Advise) కోసం సోషల్ మీడియాను వినియోగిస్తున్నట్లు తేలింది. ఇదే సమయంలో 80% మంది సంస్థాగత పెట్టుబడిదారులు తమ రోజువారీ పెట్టుబడి అవసరాల పనిలో సోషల్ మీడియాను వినియోగిస్తున్నట్లు వెల్లడైంది.

ఇదే సమయంలో పంప్ అండ్ డంప్ అంటే కొన్ని షేర్లలో క్రయవిక్రయాలు చేస్తూ వాటి రేట్లను అమాంతం పెంచి తరువాత వాటి విలువను పతనం చేయటం అనే పద్ధతిలో చాలా మంది కొత్త పెట్టుబడిదారులు ఇరుక్కుని బలవుతున్నారు. సోషల్ మీడియాలో వేగంగా సమాచార మార్పిడి, అధికారులు వీటిని గుర్తించలేకపోవటం వంటి కారణాల వల్ల ఈ తరహా మోసాలు చాలా వేగంగా పెరిగిపోతున్నాయి. సోషల్ మీడియాలో స్టాక్ మార్కెట్ టిప్స్ ఇస్తామంటూ నిజాయితీగా పనిచేసే సంస్థల్లా చాలా మందికి చేరువ అవుతున్నాయి. ఆర్థిక విషయాలపై అవగాహన లేకుండా సోషల్ మీడియాలో సలహాలు ఇచ్చే వారికోసం వెతికే వారిని ఇటువంటి సంస్థలు మోసం చేసేందుకు ఎక్కువగా వినియోగించుకుంటున్నాయి. ఇలా చాలా మంది ఫాలోవర్స్ పెరిగిన తరువాత వారిని స్టాక్ సూచనలు ఇస్తూ మార్కెట్ మ్యానిపులేషన్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

సోషల్ మీడియాలో చూసిన ప్రతిదీ నిజం అనుకుని చాలా మంది అనుకుంటుంటారు. ఆ సమాచారం చాలా పరిశోధన తరువాత సోషల్ మీడియాలోకి వచ్చిందని చాలా మంది భ్రమ పడుతుంటారు. ఇలా కనిపించిన విషయాన్ని తమదైన శైలిలో పరిశోధన చేసుకుని అది ఎంతవరకు నిజం, అసలు వాస్తవం ఎంత వంటివి ఆలోచించకపోవటానికి వారికి ఆర్థిక అంశాలు, స్టాక్ మార్కెట్ పనితీరుపై సరైన అవగాహన లేకపోవటం, సోషల్ మీడియాపై ఎక్కువ నమ్మకం వంటికి కారణంగా నిలుస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇటువంటి వాటిలో చిక్కుకుని మీ డబ్బును పెట్టుబడుల పేరుతో ప్రమాదంలోకి నెట్టవద్దని మార్కె్ట్ నిపుణులు సూచిస్తున్నారు. పెట్టుబడి నిర్ణయాలను స్వయంగా తీసుకోవాలి, లేదా ఆర్థిక సలహాదారుని కలిసి నిర్ణయం తీసుకోవాలని అంటున్నారు.

ఇవీ చదవండి..

Elon Musk: ట్విట్టర్ కు పోటీగా ఎలాన్ మస్క్ మరో సోషల్ మీడియా వేదిక.. ఎందుకంటే..

IRCTC: ఐఆర్‌సీటీసీ ద్వారా హోటల్‌ రూమ్ బుకింగ్స్‌.. ఎలా చేసుకోవాలంటే.. పూర్తి వివరాలివే..