Elon Musk: ట్విట్టర్ కు పోటీగా ఎలాన్ మస్క్ మరో సోషల్ మీడియా వేదిక.. ఎందుకంటే..

Elon Musk: అమెరికా టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ మరో కొత్త ఆలోచనతో ముందుకొచ్చారు. యూజర్ల కోసం కొత్త సోషల్ మీడియా(Social media) ప్లాట్ ఫామ్ వేదికను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Elon Musk: ట్విట్టర్ కు పోటీగా ఎలాన్ మస్క్ మరో సోషల్ మీడియా వేదిక.. ఎందుకంటే..
Elon Musk
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Mar 28, 2022 | 6:42 AM

Elon Musk: అమెరికా టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ మరో కొత్త ఆలోచనతో ముందుకొచ్చారు. యూజర్ల కోసం కొత్త సోషల్ మీడియా(Social media) ప్లాట్ ఫామ్ వేదికను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఒక వ్యక్తి సోషల్ మీడియాలో ఎలాన్ మస్క్ ను ట్యాగ్ చేస్తూ చేసిన ట్వీట్ కు ఆయన స్పందించారు. ఓపెన్ సోర్స్ ఆల్గరిదం, భావవ్యక్తీకరణ స్వేచ్ఛ(Freedom of speech), ప్రచార ఆర్భాటాలు తక్కువగా ఉండే ఒక సోషల్ మీడియా వేదిక కావాలంటూ ఆ ట్వీట్ లో అతడు మస్క్ ను కోరాడు.

దీంతో మస్క్ తనదైన శైలిలో స్పందిస్తూ.. దీనిపై నెటిజన్ల స్పందన తెలుసుకునేందుకు ఒక పోల్ కూడా నిర్వహించారు. ట్విట్టర్ డెమోక్రసీ పాటిస్తోందా.. భావ వ్యక్తీకరణకు విలువ ఇస్తోందా అంటూ అందులో ప్రశ్నించారు. మీరు వేసే ఓటు చాలా ముఖ్యమైనది. జాగ్రత్తగా ఓటు వేయండంటూ యూజర్లకు సూచించారు. ఈ ఓటింగ్ లో పాల్గొన్న వారిలో 70 శాతం మేర మంది ట్విట్టర్ సేవలపై అసహనం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన ట్విట్టర్ మాజీ సీఈవో జాక్ డోర్సీ ఏ అల్గారిదం వాడాలన్న అంశం ఓపెన్ టు ఎవిరివన్ అని అన్నారు. మరో పక్క సీఐఏ ఎనలిస్ట్, రేడియో హోస్ట్ బక్ సెక్ట్సన్ స్పందిస్తూ.. ట్విట్టర్ ను కొనేయండి.. లేదా కొత్తగా ఒక దానిని అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. దేశాన్ని సైకో సిలికాన్ వ్యాలీ లిబ్స్ నుంచి కాపాడాలంటూ ఎలన్ మస్క్ ను కోరాడు.

ఇవీ చదవండి..

Gold & Silver Price Today: నిలకడగా కొనసాగుతున్న బంగారం ధరలు.. వెండి రేట్ ఎలా ఉందంటే..

KTR US Tour: ముగిసిన మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన.. చివరి రోజు పెట్టుబడుల వరద..