KTR US Tour: ముగిసిన మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన.. చివరి రోజు పెట్టుబడుల వరద..
Minister KTR US Tour: భారీ అంచనాలతో అమెరికా పయనమైన తెలంగాణ మంత్రి కేటీఆర్.. పెట్టుబడుల వరదతో తిరిగొస్తున్నారు. హైదరాబాద్‌లో పెట్టుబడులు
Minister KTR US Tour: భారీ అంచనాలతో అమెరికా పయనమైన తెలంగాణ మంత్రి కేటీఆర్.. పెట్టుబడుల వరదతో తిరిగొస్తున్నారు. హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ సంస్థలు అంగీకరించాయి. వారం రోజుల పర్యటనలో అనేక ఒప్పందాలతో పాటు తెలంగాణ, హైదరాబాద్‌లో పెట్టుబడి పెట్టేందుకు వివిధ సంస్థలు సుముఖుత చూపాయి. నిన్నటి వరకు ఐటీకి కేరాఫ్‌గా ఉన్న హైదరాబాద్‌ను ఫార్మా హబ్‌గా మార్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం దూసుకెళ్తోంది. మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన ఆ క్రమంలోనే సాగింది.
ఇప్పటికే హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఆర్.ఏ చెమ్ ఫార్మా లిమిటెడ్, అవ్రా ల్యాబొరేటరీస్ లలో అడ్వెంట్ ఇంటర్నేషనల్ కంపెనీ 1750 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించింది. ఈ రెండు కంపెనీలకు 6 తయారీ యూనిట్లు, 3 R&D యూనిట్లు ఉన్నాయి. హైదరాబాద్ ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టాలన్న అడ్వెంట్ నిర్ణయం తనకు సంతోషాన్ని కలిగించిందన్నారు మంత్రి కేటీఆర్. అడ్వెంట్ కంపెనీతో కలిసి తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందన్నారు.
న్యూజెర్సీ కేంద్రంగా ఉన్న స్లే బ్యాక్ ఫార్మా హైదరాబాద్‌లో 150 కోట్ల రూపాయల పెట్టుబడినుంది. రాబోయే మూడేళ్లలో సుమారు 1500 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయాలని నిర్ణయించింది. సిజిఎంపి (cGMP)ల్యాబ్‌తో పాటు అత్యాధునిక తయారీ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించబోతుంది. మంత్రి కేటీఆర్‌తో స్లేబ్యాక్ ఫార్మా వ్యవస్థాపకులు, సీఈఓ అజయ్ సింగ్ ఈ భారీ పెట్టుబడికి సంబంధించిన ప్రకటన చేశారు. గడిచిన ఐదేళ్లలో హైదరాబాద్ ఫార్మాలో స్లేబ్యాక్ కంపెనీ సుమారు 2300 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టింది. హైదరాబాద్ ఫార్మారంగంలో స్లేబ్యాక్ అసాధారణ ఎదుగుదల, విస్తరణ ప్రణాళికలు అద్భుతంగా ఉన్నాయన్నారు మంత్రి కేటీఆర్.
యునైటెడ్ స్టేట్స్ ఫార్మాకొపియా తెలంగాణలో రెండు లక్షల డాలర్ల అదనపు మూలధన పెట్టుబడితో ఫ్లో కెమిస్ట్రీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో పెట్టుబడులు పెట్టనుంది యునైటెడ్ స్టేట్స్ ఫార్మాకొపియా. మంత్రి కేటీఆర్‌తో కంపెనీ చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్, ఇండియా ఆపరేషన్స్ హెడ్ స్టాన్ బుర్హాన్స్ సమావేశమై ఈ ప్రకటన చేశారు.
కేటీఆర్ అమెరికా పర్యటనలో జరిపిన సంప్రదింపులతో ప్రముఖ గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్ అడ్వెంట్ ఇంటర్నేషనల్ కంపెనీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టబోతుంది. లైఫ్ సైన్సెస్, ఫార్మా కంపెనీల్లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు అడ్వెంట్ ఇంటర్నేషనల్ రెడీ అయ్యింది. లైఫ్ సైన్సెస్ రంగానికి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత, కల్పిస్తున్న మౌలిక వసతులు తమ విస్తరణ, ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడతాయని ఆ కంపెనీ ప్రకటించింది. న్యూయార్స్‌లో ఆ సంస్థ మేనేజింగ్ పార్టనర్ జాన్ మాల్డోనాడోతో సమావేశమయ్యారు కేటీఆర్.
హైదరాబాద్‌లో సర్వీసెస్ సెంటర్ ఏర్పాటు చేయనుంది క్యూరియా గ్లోబల్ షేర్డ్. ఫలితంగా వచ్చే 12 నెలల్లో 200 మందికి హై స్కిల్లిడ్ ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. కేటీఆర్‌తో పాటు పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, తెలంగాణ ప్రభుత్వ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి ఎం నాగప్పన్ అమెరికాలో పర్యటించారు.
Also read:
Ugadi 2022: ఉగాది పండుగ ఎప్పుడనే దానిపై తర్జన భర్జన.. మరి పంచాంగకర్తలు ఏం చేశారంటే..!
Viral Photo: ప్రకృతి విసిరిన సవాల్.. ఈ ఫోటోలో ఒక అద్భుతం దాగుంది.. అదేంటో కనిపెట్టగలరా?