AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: ప్రకృతి విసిరిన సవాల్.. ఈ ఫోటోలో ఒక అద్భుతం దాగుంది.. అదేంటో కనిపెట్టగలరా?

Puzzle Picture: సోషల్ మీడియాలో నిత్యం అనేక వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో ముఖ్యంగా వైల్డ్ లైఫ్‌కు సంబంధించినవి, ప్రకృతికి అందానికి సంబంధించినవి

Viral Photo: ప్రకృతి విసిరిన సవాల్.. ఈ ఫోటోలో ఒక అద్భుతం దాగుంది.. అదేంటో కనిపెట్టగలరా?
Puzzle Picture
Shiva Prajapati
|

Updated on: Mar 27, 2022 | 7:11 PM

Share

Puzzle Picture: సోషల్ మీడియాలో నిత్యం అనేక వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో ముఖ్యంగా వైల్డ్ లైఫ్‌కు సంబంధించినవి, ప్రకృతికి అందానికి సంబంధించినవి ఎక్కువగా ఉంటాయి. ఇక ఫారెస్ట్ సర్వీస్ అధికారులు ప్రకృతితో మమేకమై జీవిస్తుంటారు. ప్రకృతికి సంబంధించి ప్రతీ అంశాన్ని తమదైన దృష్టి కోణంలో చూస్తారు. కంటిని కనిపించిన ప్రకృతి అందాలన్నింటినీ తమ కెమెరాల్లో బందీ చేస్తారు. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నెటిజన్లతో పంచుకుంటారు. తాజాగా మధుమిత ఐఎఫ్ఎస్ అధికారిని అద్భుతమైన ఫోటోను సోషల్ మీడియా వేదికగా నెటిజన్లతో పంచుకున్నారు. ఫజిల్ మాదిరిగా ఉన్న ఈ ఫోటోను షేర్ చేసిన ఆమె.. అందులో ఉన్న బ్యూటీని కనిపెట్టాలంటూ ఛాలెంజ్ విసిరారు. ఈ ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేసిన మధుమిత.. అందులో ఏం దాగుందో చెప్పండి చూద్దాం అంటూ క్యాప్షన్ పెట్టారు. దీనికి నెటిజన్ల నుంచి విశేష స్పందన వస్తోంది. చాలా మంది రకరకాల జవాబులు చెబుతున్నారు. కొందరు సమాధానం చెప్పడంలో ఫెయిల్ అయితే, మరికొందరు కరెక్ట్ ఆన్సర్ చెప్పారు.

వాస్తవానికి ఐఎఫ్ఎస్ అధికారి మధుమిత షేర్ చేసిన ఈ ఫోటోలో రెండు ఎండిపోయిన ఆకులు ఉన్నాయి. ఆ ఆకులపై అందమైన సీతాకోక చిలుక ఒకటి ఉంది. అయితే, ప్రకృతి రంగులో కలిసిపోయే రకరకాల సీతాకోక చిలుకలు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిగా ఉన్నాయి. ఇక్కడ కూడా అలాంటి సీతాకోక చిలుకే ఉంది. అచ్చం ఆ ఆకులో మమేకమైనట్లుగా సీతాకోక చిలుక ఉంది. చూడటానికి అక్కడ ఏమీ లేదన్నట్లుగా అనిపిస్తుంటి. కానీ, ఆకు రంగులోనే ఉన్న అందమైన సీతాకోక చిలుక దానిపై వాలి సేద తీరుతోంది. ఈ ఛాలెంజ్‌కు చాలా మంది నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఇది కదా బ్యూటీ అంటే అని కామెంట్స్ చేస్తున్నారు. మరెందుకు ఆలస్యం ఆ సీతాకోక చిలుక ఎక్కడుందో మీరూ కనిపెట్టి.. ఆన్సర్‌ను కామెంట్ రూపంలో తెలుపండి.

Also read:

Russia Ukraine War: ‘పుతిన్’ కారణంగా పుట్టెడు కష్టాలు ఎదుర్కొంటున్న 198 ఏళ్ల నాటి చెట్టు.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే..!

Summer Beauty Care: బ్యూటీ కేర్‌లో కొబ్బరి నీళ్లే ‘ది బెస్ట్’, ఈ చర్మ సమస్యలన్నింటికీ చెక్ పెట్టొచ్చు..!

Sachin Wife Viral: అడవీలో పులులలో సరదాగా సచిన్ భార్య.. వైరల్ అవుతున్న వీడియో..!