Sachin Wife Viral: అడవీలో పులులలో సరదాగా సచిన్ భార్య.. వైరల్ అవుతున్న వీడియో..!

Sachin Wife Viral: క్రికెట్‌ గాడ్‌, టీమిండియా మాజీ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ భార్య అంజలీ టెండూల్కర్‌ అడవిలో సరదాగా విహరించారు.

Sachin Wife Viral: అడవీలో పులులలో సరదాగా సచిన్ భార్య.. వైరల్ అవుతున్న వీడియో..!
Sachin Wife
Follow us

|

Updated on: Mar 27, 2022 | 6:20 AM

Sachin Wife Viral: క్రికెట్‌ గాడ్‌, టీమిండియా మాజీ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ భార్య అంజలీ టెండూల్కర్‌ అడవిలో సరదాగా విహరించారు. టైగర్‌ జోన్‌‌లో సఫారీలో సంచరించారు. పులుల మధ్య అంజలీ టెండూల్కర్ హాయిగా గడిపారు. పులులు దారి వెంట నడుస్తూ ఉండగా.. వాటిని వెంట ఆమె ప్రయాణిస్తున్న సఫారీ ముందుకు కదులుతూ ఉంది. అంజలీ టెండూల్కర్ సఫారీలో సరదాగా పర్యటిస్తున్న వీడియోను రణతంబోర్ నేషనల్ పార్క్ యూట్యూబ్ ఛానల్‌లో పోస్ట్ చేశారు. దాంతో ఆ వీడియో కాస్తా వైరల్ అవుతోంది.

అంజలీ టెండూల్కర్ తన సన్నిహితులతో కలిసి రాజస్థాన్‌లోని రణథంబోర్లోని టైగర్ సఫారీని సందర్శించారు. వారితో కలిసి జంగిల్ సఫారీ చేశారు. నేషనల్‌ పార్క్‌లో కళ్ల ముందే పులులు సంచరిస్తుండగా వాటి వెనుక టాప్‌లెస్ జీప్‌లో అంజలి టెండూల్కర్‌ ఫాలో అయ్యారు. తలపై హ్యాట్‌ పెట్టుకొని టైగర్‌ని ఫాలో అవుతున్న వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. వన్యప్రాణుల సంరక్షణ విషయంలో సచిన్‌ టెండూల్కర్ ఫ్యామిలీ మొదట్నుంచి మద్దతుగా నిలుస్తోంది. అందులో భాగంగనే వాటి ఆహార విధానం ఎలా ఉంటుందో తెలుసుకునేందుకే అంజలి టెండూల్కర్ టైగర్ జోన్‌-3 ట్రిప్ రైడ్‌కు వెళ్లిన్నట్లు తెలుస్తోంది. ఈ వీడియోకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది.

Also read:

Yadadri Temple: యాదాద్రి ఆలయానికి ఇంత ప్రొటెక్షనా?.. భద్రతా వ్యవస్థ ఏ రేంజ్‌లో ఉందో తెలిస్తే షాక్ అవుతారు..!

Telangana: మరదలిపై కన్నేసిన అక్క భర్త.. పెళ్లి వేళ ట్విస్ట్ ఇచ్చాడు.. మరి ఆ యువతి ఏం చేసిందంటే..!

Viral News: అంతకు మించిన ఫ్రెండ్‌షిప్.. వీరిద్దరికీ ఒకే భర్త కావాలట.. షాకింగ్ ప్రకటన..!