AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: అంతకు మించిన ఫ్రెండ్‌షిప్.. వీరిద్దరికీ ఒకే భర్త కావాలట.. షాకింగ్ ప్రకటన..!

Viral Video: ప్రెండ్‌షిప్ గురించి వర్ణించడానికి అక్షరాలు కూడా సరిపోవు. స్నేహం ఓ మధురమైన అనుభూతి. దీనికి వయసుతో నిమిత్తం లేదు.

Viral News: అంతకు మించిన ఫ్రెండ్‌షిప్.. వీరిద్దరికీ ఒకే భర్త కావాలట.. షాకింగ్ ప్రకటన..!
Women
Shiva Prajapati
|

Updated on: Mar 26, 2022 | 9:30 PM

Share

Viral Video: ప్రెండ్‌షిప్ గురించి వర్ణించడానికి అక్షరాలు కూడా సరిపోవు. స్నేహం ఓ మధురమైన అనుభూతి. దీనికి వయసుతో నిమిత్తం లేదు. ఆటపాటలాడే బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు అందరిలో స్నేహ భావం ఉంటుంది. అటువంటి స్నేహానుభూతిని అనుభవిస్తేనే తెలుస్తుంది. స్నేహం అంత విలువైనది కాబట్టే.. స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం.. స్నేహంపై అనేక పాటలు వచ్చాయి. స్నేహం అద్భుతమైంది. నిజమైన మిత్రులకు మించిన ఆస్తి లేదు. స్నేహానికి ఎల్లలు లేవు. కన్నవారితో, కట్టుకున్నవారితో, తోడబుట్టిన వారితో చెప్పుకోలేని విషయాలను మిత్రులతో చెప్పుకోవడం మిత్రత్వం గొప్పదనం. కష్టసుఖాల్లో అండగా ఉండేవారు.. నిస్వార్థంగా సాయం అందించేవారు నిజమైన మిత్రులు.

ఇలాంటి ఆదర్శ స్నేహితులు ప్రపంచ వ్యాప్తంగా ఎందరో ఉంటారు. అయితే, తాజాగా ఓ ఇద్దరు అమ్మాయిలకు సంబంధించిన ప్రకటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. స్నేహితులుగా అన్నీ షేర్ చేసుకుంటున్న వీరు.. భర్తను కూడా షేర్ చేసుకోవాలని భావిస్తున్నారు. అవును మీరు విన్నది నిజమే. ఒకే వ్యక్తిని వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకోవడమే కాదు.. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. ఈ ప్రకటన ఇప్పుడు తెగ వైరల్అవుతోంది.

వివరాల్లోకెళితే.. మలేషియాకు చెందిన ఫాతిమా అజ్రాహ్(31), ఫాతిన్ అక్మా(27) బెస్ట్ ఫ్రెండ్స్. అయితే, ఫాతిమా అజ్రహా కు ఇంతకు ముందే పెళ్లై, ఒక బిడ్డ కూడా ఉంది. అయితే, భర్త నుంచి విడాకులు తీసుకుని విడిగా ఉంటోంది. ఇక ఫాతిన్ అక్మా, ఫాతిమా అజ్రాహ్ మధ్య స్నేహ బంధం బలంగా మారింది. వీరిద్దరూ తమ సాదకబాదకాలను షేర్ చేసుకున్నారు. అయితే, మంచి స్నేహితులైన వీరిద్దరూ ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఇంకేముంది.. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో వరుడు కావలెను అంటూ ప్రకటన విడుదల చేశారు. ఇద్దరికీ ఒకే వ్యక్తిగా భర్తగా కావాలంటూ పోస్ట్ పెట్టారు. తమను మంచిగా చూసుకునే వ్యక్తి భర్తగా కావాలని తమ మనసులోని అభిప్రాయలను వ్యక్తం చేశారు. తమకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని పేర్కొంటూ.. తమకు కావాల్సిన భర్త ఎలా ఉండాలో కూడా పేర్కొన్నారు. అయితే, వీరు చేసిన ఈ పోస్ట్ సంచలనంగా మారింది. నెటిజన్లు దీనిని చూసి షాక్ అవుతున్నారు. ఇదేం స్నేహం రా బాబూ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Also read:

Yadadri Temple: నవ వైకుంఠం మన యాదాద్రి.. ఇక్కడి విగ్రహాలు, గోపురాల ప్రత్యేకత ఏంటో ఇప్పుడే తెలుసుకోండి..!

Gold Mines: రాష్ట్రంలో బంగారు నిక్షేపాలు.. పది చోట్ల గుర్తించిన పరిశోధకులు.. ఆ ప్రాంతాలేంటంటే..!

Mirracle: అద్భుతం అంటే ఇదే మరి.. అతనికి వచ్చిన కళ నిజమైంది.. చెప్పిన చోట శివలింగం ప్రత్యక్ష్యమైంది..!