Gold Mines: రాష్ట్రంలో బంగారు నిక్షేపాలు.. పది చోట్ల గుర్తించిన పరిశోధకులు.. ఆ ప్రాంతాలేంటంటే..!

Gold Mines: రాయలు ఏలిన రతనాల సీమ.. మన రాయలసీమ. ఇది ఒకప్పటి మాట. కాని అది కాలం క్రమంలో తీవ్రమైన దుర్భిక్ష ప్రాంతంగా..

Gold Mines: రాష్ట్రంలో బంగారు నిక్షేపాలు.. పది చోట్ల గుర్తించిన పరిశోధకులు.. ఆ ప్రాంతాలేంటంటే..!
Gold Mines
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 26, 2022 | 9:11 PM

Gold Mines: రాయలు ఏలిన రతనాల సీమ.. మన రాయలసీమ. ఇది ఒకప్పటి మాట. కాని అది కాలం క్రమంలో తీవ్రమైన దుర్భిక్ష ప్రాంతంగా, కరవుకు నిలయంగా మారింది. అయితే ఇదంతా మనం విన్నది, చూసినది ఒకవైపు మాత్రమే. కానీ ఎవరికీ కనిపించకుండా తన గర్భంలో కోట్ల రూపాయల బంగారం నిక్షేపాలు దాచుకుంది ఈ అనంత నేల. పైకి రాళ్లు రప్పలుగా కనిపించే ఈ ప్రాంతానికి కొంత లోపలికి వెళ్తే.. జిగేల్ మనే బంగారం నిక్షేపం దాగి ఉంది. ఇన్ని రోజులు మరుగన పడిన ఈ విషయాన్ని మళ్లీ వెలుగులోకి తెచ్చింది.. ప్రస్తుత ప్రభుత్వం. అసలు ఎక్కడెక్కడ నిక్షేపాలు ఉన్నాయో గుర్తించింది. వాటి తవ్వకాలకు అడుగులు వేగంగా పడుతున్నాయి. అనంతలో దాగిన ఆ కేజిఎఫ్ రహస్యాలపై టీవీ9 ప్రత్యేక కథనం..

మనకి సృష్టిలో.. సముద్రాలు, భూభాగం ఏర్పడినప్పుడు ఎన్నో విలువైన నిక్షేపాలు అందులో దాగి ఉన్నట్టు పరిశోధనల ద్వారా తేలింది. సహజసిద్ధంగా ఉన్న ఆ నిక్షేపాలను వెలికి తీసేందుకు ఎన్నో దేశాలు ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నాయి. సరిగ్గా ఇలానే ఇప్పుడు ఏపీలో కూడా అత్యంత విలువైన బంగారం నిక్షేపాలను వెలికి తీసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. అదేంటి మన రాష్ట్రంలో బంగారం గనులు ఉన్నాయా.. ఎక్కడా అనుకుంటున్నారా… మీరు నమ్మరు కానీ బంగారం నిక్షేపాలు ఉన్నది.. మన రాయలసీమలో. అందునా తీవ్ర కరవు పీడిత ప్రాంతమైన అనంతపురం జిల్లాలో. ఇక్కడ బంగారం నిక్షేపాలు బాగా ఉన్నాయని పరిశోధనల ద్వారా తేలింది.

రామగిరి దగ్గర “భారత్‌ గోల్డ్‌ మైన్స్‌ లిమిటెడ్” (బీజీఎంఎల్‌) 2000వ సంవత్సరం వరకు రామగిరిలో బంగారు గనులు ఉన్నట్టు నిర్దారించింది. అప్పట్లో ప్రభుత్వం సహకరించడంతో తవ్వకాలు జరిపింది. ఇక్కడ చాలా మంది ఈ మైన్స్ మీద ఆధారపడి జీవించే వారు. బంగారం వెలికి తీయడం ఆ తరువాత ప్యూరిఫికేషన్ చేయడం ఇతరత్ర వాటికి సంబంధించి కొన్ని కుటుంబాలకు జీవనాధారంగా ఉండేది. అప్పడు 10 గ్రాముల బంగారం ధర 4వేల నుంచి 5వేల మధ్య ఉండేది. కానీ ఇక్కడ లభించగల బంగారానికి, తవ్వకాలకు అయ్యే ఖర్చుకు గిట్టుబాటు కాక నష్టాలు మూటగట్టుకోవాల్సి వచ్చింది. దీంతో 2001వ సంవత్సరంలో తవ్వకాలు నిలిపేశారు. ప్రస్తుతం మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 50వేల రూపాయలకు పైమాటే. అయితే బంగారం ధర ఇంచు మించు 18వేలు ఉన్న సమయంలోనే తమకు ఇక్కడ మైనింగ్ కు అనుమతి ఇవ్వాలని బీజీఎమ్‌ఎల్‌ సంస్థ దరఖాస్తు చేసింది. బంగారం తవ్వకాల్లో ఇప్పటివరకు బీజీఎంఎల్‌ కీలకంగా ఉంది. 2015వ సంవత్సరంలోనే ఇక్కడ బంగారు గనులు మళ్లీ తెరిపించాలని అప్పటి మంత్రి పరిటాల సునీత ప్రయత్నించారు. అప్పట్లో ఖనిజాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న పీతల సుజాత కూడా ఇక్కడ మైన్స్ ను పరిశీలించారు. మరికొన్ని రోజులు ఇక్కడ మైన్స్ తెరుస్తామని చెప్పారు.. కానీ ఎందుకో ఆ ప్రాజెక్టు మళ్లీ గాడిలో పడలేదు. ఆ రోజు అలా అటకెక్కిన బంగారం గనుల ప్రాజెక్టు.. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత తెరపైకి వచ్చింది. ఇక్కడ బంగారం నిక్షేపాలు తవ్వి తీసేందుకు ప్రభుత్వం అన్ని అంశాలను పరిశీలించింది.. ఆ తరువాత ఒక నిర్ణయం కూడా తీసుకుంది.

2001లో బంగారు గనులు మూత పడ్డాయి.. దాదాపు 2దశాబ్దాల తరువాత మళ్లీ బంగారం గనుల అంశం తెర మీదకు వచ్చింది. జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ రాష్ట్రంలోని పలు చోట్ల జియోలాజికల్ సర్వే చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని పది చోట్ల బంగారు నిక్షేపాలను గనులశాఖ కూడా గుర్తించింది. ప్రస్తుతం బంగారం ధర భారీగా ఉన్నందున వీటిని వెలికి తీస్తే లాభదాయకంగా ఉంటుందని గనులశాఖ భావించి వేగంగా అడుగులు వేస్తోంది.

ఎక్కడ ఆపారో అక్కడి నుంచి మళ్లీ మొదలు పెట్టాలి.. ఇప్పుడు ఇదే బంగారం గనుల విషయంలో అధికారులు, కొన్ని సంస్థల అభిప్రాయం. కాకపోతే గతంలో రామగిరిలో మాత్రం బంగారం గనులు ఉండేవని భావించారు. కానీ రాష్ట్రంలోని పది చోట్ల బంగారు నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించారు. అవన్నీ అనంతపురం జిల్లా పరిధి లోనివే కావడం విశేషం. రామగిరికి కొంత దూరంలో ఉన్న 2 ప్రాంతాల్లో, రొద్దం మండలం బొక్సంపల్లిలో రెండుచోట్ల, అలాగే కదిరి మండలం జౌకుల పరిధిలో ఆరుచోట్ల బంగారు నిక్షేపాలు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈ పది ప్రాంతాల్లోని 97.4 చదరపు కి.మీ. పరిధిలో నిక్షేపాలు ఉన్నాయని నిర్దారించారు. కేంద్రం ఇచ్చిన వాటితో కొత్తగా రాష్ట్రం బంగారం నిక్షేపాల ప్రాంతాలకు కూడా కాంపోజిట్‌ లైసెన్సు జారీ చేశారు. ఒక్కో వ్యక్తి లేక సంస్థకు వెయ్యి హెక్టార్ల వరకు ఈ లైసెన్సు ఇస్తారు. కాంపొజిట్ లైసెన్స్ అంటే ప్రధానంగా అన్వేషణ కోసమే. పూర్తిస్థాయిలో ఖనిజ నిక్షేపాలు గుర్తించిన చోట మైనింగ్‌ లీజు కేటాయిస్తారు.

ప్రస్తుతం బంగారం నిక్షేపాలు ఉన్నట్టు వెలుగులోకి రావడంతో జౌకుల, అలాగే బొక్సం ప్రాంతాల్లో ప్రజలు ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు. తమ పూర్వీకులు కూడా ఇక్కడ బంగారం ఉండేదని చెప్పే వారని.. దాదాపు 20ఏళ్ల క్రితం ఇక్కడ పరిశోధనల కోసం తవ్వకాలు కూడా చేసినట్లు చెబుతున్నారు. జౌకుల ప్రాంతంలో పూర్వం కడపరాయుని కొండ ఉండేదని.. ఇక్కడ నిక్షేపాలు ఉన్నట్లు ఆరోజుల్లో చెప్పుకునే వారని తెలుస్తోంది. అయితే ఇక్కడ తవ్వకాలు జరిపితే భూము హక్కుదారులకు సరైన న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు రామగిరి బంగారు గనులను త్వరలోనే తిరిగి తెరిపించి.. ఈ ప్రాంత ప్రజల కలలను సాకారం చేస్తామని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. ఇప్పటికే రామగిరిలోని భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ ( బీజీఎంఎల్)కు చెందిన బంగారు గనులను ఎమ్మెల్యేతో పాటు అమెరికా సంస్థ ప్రతినిధులు పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా పది బంగారు గనులను వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఎమ్మెల్యే అంటున్నారు. ఈ క్రమంలోనే రామగిరితో పాటు కదిరి, బక్సంపల్లి ప్రాంతాల్లోని గనులను తెరవనున్నట్లు తెలిపారు.

రామగిరి గనులలో ఇప్పటివరకు పది శాతం మాత్రమే బంగారాన్ని వెలికి తీశారు. అప్పట్లో బంగారం ధర తక్కువగా ఉండటంతో వెలికితీతకు అయ్యే ఖర్చులకు వచ్చే బంగారానికు పొంతన లేకపోవడంతో ఇక్కడ మైన్స్ మూత పడ్డాయి. ఇప్పుడు ఈ గనులు పునః ప్రారంభమైతే వందలాది కుటుంబాలకు ఉపాధి లభించే అవకాశం లేకపోలేదు. ఒకప్పుడు బంగారు గనులు మూత పడటం వలన చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మళ్లీ గనులు తెరలేకపోతారా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు మా ప్రాంతంలో బంగారు గనులు ప్రారంభమైతే.. ఇక్కడి ప్రజలకు తక్కువ ధరకే బంగారం ఇవ్వాలని స్థానికులు అంటున్నారు. అంతే కాదు స్థానికులకు ఉపాధి అవకాశం కల్పించాలని కూడా కోరుతున్నారు.

అన్నీ అనుకున్నట్టు జరిగితే అతి సమీపంలో బంగారం గనులపై ఈ వేలం నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తమవుతోంది. దీని వలన ఇటు ప్రభుత్వానికి అలాగే స్థానికంగా ఉన్న వారికి ఉపాధి దొరికే అవకాశం కూడా ఉంటుందని అంటున్నారు. మొత్తం మీద కరవు ప్రాంతంలో కొత్త బంగారు లోకాన్ని చూడబోతున్నారు.

Also read:

Viral Video: ఎలక్ట్రిక్ బైక్స్ వాడుతున్నారా.? అయితే ఈ వీడియో చూస్తే వెన్నులో వణుకు పుట్టాల్సిందే!

Temperature: పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. హీట్‌స్ట్రోక్‌తో ప్రమాదం.. నిపుణుల సలహాలు, సూచనలు

Mirracle: అద్భుతం అంటే ఇదే మరి.. అతనికి వచ్చిన కళ నిజమైంది.. చెప్పిన చోట శివలింగం ప్రత్యక్ష్యమైంది..!

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!