AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mirracle: అద్భుతం అంటే ఇదే మరి.. అతనికి వచ్చిన కళ నిజమైంది.. చెప్పిన చోట శివలింగం ప్రత్యక్ష్యమైంది..!

Mirracle: కారడవిలో శివలింగం ప్రత్యక్షమైంది.. ఆ గ్రామస్తుడికి వచ్చిన కళ నిజమై అతను చెప్పిన చోట శివలింగం కనిపించింది.

Mirracle: అద్భుతం అంటే ఇదే మరి.. అతనికి వచ్చిన కళ నిజమైంది.. చెప్పిన చోట శివలింగం ప్రత్యక్ష్యమైంది..!
Lord Shiva
Shiva Prajapati
|

Updated on: Mar 26, 2022 | 8:49 PM

Share

Mirracle: కారడవిలో శివలింగం ప్రత్యక్షమైంది.. ఆ గ్రామస్తుడికి వచ్చిన కళ నిజమై అతను చెప్పిన చోట శివలింగం కనిపించింది. దాంతో ఊరంతా భక్తి పారవశ్యంతో ఊగిపోతున్నా రు.. అక్కడికి తండోపతండాలుగా తరలివెళ్లి పూజలు నిర్వహిస్తున్నారు.. ములుగు జిల్లాలోని అడవుల్లో వెలుగుచూసింది ఈ విచిత్ర ఘటన.

వివరాల్లోకెళితే.. తెలంగాణలోని ములుగు జిల్లా మంగపేట మండలం రమణక్కపేట గుట్టల్లో శివలింగం బయట పడింది. భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి ఆ శివలింగానికి పూజలు చేస్తున్నారు. ఇటీవల గ్రామంలో కృష్ణ అనేవ్యక్తి అకస్మాత్తుగా పూనకాలతో ఊగిపోయాడు.. గ్రామ శివారు అడవిలోని గుట్టపై శివలింగం ఉందని, త్వరగా తీసి పూజలు నిర్వహించాలి ఆదేశించాడు.

కృష్ణను శువుడి ఆవహించినట్లు ఊగిపోవడంతో గ్రామస్థులు ఆయన ఆజ్ఞ మేరకు ఆ ప్రాంతంలో తవ్వారు. దీంతో విచిత్రంగా అక్కడ శివలింగం బయటపడింది. ఇంకేముంది భక్తులు తరలివచ్చి పూజలు చేస్తున్నారు.

అయితే, గుట్ట ప్రాంతంలోని దేవరబాల చెట్టు కింద పుట్టలో శివలింగం వెలికితీసేటప్పుడు తేల్లు, పాములు కనపడడంతో భయబ్రాంతులకు గురయ్యారు. అయినా జంక కుండా త్రవ్వకాలు చేసి లింగం వెలికితీశారు. అప్పటికే రాత్రి కావడంతో శివలింగాన్ని చెట్టు మొదట్లో ప్రతిష్టించి పసుపు, కుంకుమ చల్లి టెంకాయ కొట్టి తిరిగి వెళ్లిపోయారు. విషయం తెలిసిన గ్రామస్తులు తండోపతండాలుగా వచ్చి శివలింగానికి అభిషేకాలు, అర్చనలు, దీపారాధనలతో పూజలు చేస్తున్నారు. అదే ప్రాంతంలో శివలింగంతో పాటు నందీశ్వరుడి విగ్రహం కూడా ఉందని కృష్ణ తెలిపాడు. మళ్లీ ఒకరోజు చూసుకొని అది కూడా వెలికితీసి అక్కడ పలువురి సహకారంతో గుడి ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తామని అభివృద్ధికి దాతలు తోడ్పడాలని కోరారు.

Also read:

Andhra Pradesh: చేపల కోసం వల విసిరితే.. జాలర్లకు ఊహించని షాక్.. ఎదురుగా కళ్లు చెదిరే సీన్!

Sai Dharam Tej: యాక్సిడెంట్‌ తర్వాత సాయిధరమ్‌ తేజ్‌ మొదటి వీడియో.. ఆరోజు గుడ్‌న్యూస్‌ చెబుతానంటూ..

Viral Video: పాపం.. సింహాన్ని చెడుగుడు ఆడుకున్న జీబ్రా.. షాకింగ్ వీడియో వైరల్..