AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: పాపం.. సింహాన్ని చెడుగుడు ఆడుకున్న జీబ్రా.. షాకింగ్ వీడియో వైరల్..

తల్లి ప్రేమను మించినది ఈ లోకంలో మరొకటి ఉండదు.. పిల్లలకు చిన్న కష్టమొచ్చిన ఆ తల్లి మనసు తల్లడిల్లిపోతుంది. ఏ కష్టం రాకుండా

Viral Video: పాపం.. సింహాన్ని చెడుగుడు ఆడుకున్న జీబ్రా.. షాకింగ్ వీడియో వైరల్..
Zebra
Rajitha Chanti
|

Updated on: Mar 26, 2022 | 7:50 PM

Share

తల్లి ప్రేమను మించినది ఈ లోకంలో మరొకటి ఉండదు.. పిల్లలకు చిన్న కష్టమొచ్చిన ఆ తల్లి మనసు తల్లడిల్లిపోతుంది. ఏ కష్టం రాకుండా తన పిల్లలను కంటికి రెప్పల చూసుకుంటుంది తల్లి. అది మనుషులైనా.. జంతువులైనా.. పక్షులైనా.. మాతృత్వానికి అతీతమేది కాదు. ఎంతటి క్రూరమృగమైనా తన పిల్లల పై అమితమైన ప్రేమను చూపిస్తాయి. తమ పిల్లల జోలికి వస్తే ప్రాణాలను అడ్డుపెట్టి మరి రక్షించుకుంటాయి. మరీ అదే పిల్లల ప్రాణాలు కళ్లముందే పోతుంటే ఏ తల్లి ఊరుకుంటుంది. అందుకే ప్రాణానికి తెగించి మరీ సింహాన్ని ఎదురించ్చింది.. బిడ్డ ప్రాణం కోసం సింహానికి తలపడి తన బిడ్డను కాపాడుకుంది ఓ జీబ్రా.. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అందులో ఓ సింహం… జీబ్రా పిల్లను వేటాడింది. ప్రాణం కోసం ఆ జీబ్రా పిల్లా కొట్టుకుంటున్నా సింహం వదిలిపెట్టలేదు. తన బిడ్డ సింహానికి చిక్కడం.. చూసిన తల్లి జీబ్రా వెంటనే దాని దగ్గరకు వచ్చి సింహానికి ఎదురుతిరిగింది. సింహాంతో పోట్లాడి తన బిడ్డను రక్షించుకుంది. తలతో సింహం నోటితో పట్టుకున్న తన బిడ్డను విడిపించుకుంది..కాళ్లతో తన్నుతూ సింహం తన బిడ్డ దగ్గరకు రాకుండా జాగ్రత్త పడింది. జీబ్రా ధైర్యానికి సింహం వెనకడుగు వేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఇది చూసిన నెటిజన్స్.. మథర్స్ లవ్… ధైర్యమున్న జీబ్రా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Beast: పాన్ ఇండియా స్టార్‏గా హీరో విజయ్ ప్రయత్నం.. బీస్ట్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..

RRR Movie: ‘మహారాజ’ మౌళికి హ్యాట్సాఫ్.. రాజమౌళిపై పొగడ్తల వర్షం కురిపించిన పాన్ ఇండియా డైరెక్టర్..

Prakash Raj: పుట్టిన రోజు వేళ ఆసక్తికర ట్వీట్ చేసిన ప్రకాష్ రాజ్.. ఇక ఆ బాధ్యత నాదేనంటూ..

Indian Idol Telugu: ఈ వారం తెలుగు ఇండియన్ ఐడల్‏లో ఛాలెంజింగ్ ఎపిసోడ్.. ఓటింగ్ లైన్స్ ప్రారంభం..