Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Temperature: పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. హీట్‌స్ట్రోక్‌తో ప్రమాదం.. నిపుణుల సలహాలు, సూచనలు

Temperature: ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాలు ఇప్పటికే 40 డిగ్రీల సెల్సియస్‌ నమోదవుతున్నాయి. తీవ్రమైన వడ గాలులు..

Temperature: పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. హీట్‌స్ట్రోక్‌తో ప్రమాదం.. నిపుణుల సలహాలు, సూచనలు
Follow us
Subhash Goud

|

Updated on: Mar 26, 2022 | 8:58 PM

Temperature: ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాలు ఇప్పటికే 40 డిగ్రీల సెల్సియస్‌ నమోదవుతున్నాయి. తీవ్రమైన వడ గాలులు (Heat Waves) కూడా ప్రధాన కారణం. నివేదికల ప్రకారం.. రాజస్థాన్‌లోని పశ్చిమ ప్రాంతాలపై యాంటీసైక్లోన్ ఏర్పడింది. వేడి, వాయువ్య గాలులు రాజస్థాన్, మధ్యప్రదేశ్ పశ్చిమ ప్రాంతాలు, అలాగే ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో నమోదవుతున్నాయి. ఈ వేడి గాలుల ప్రభావం విదర్భ (మహారాష్ట్ర), గుజరాత్, కొంకణ్, తెలంగాణ అంతటా ఉంటాయి. మార్చి 20న అహ్మదాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెల్సియస్, హైదరాబాద్‌లో 35 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత (Temperature) నమోదైంది. ఈ ఉష్ణోగ్రతల కారణంగా వడదెబ్బ బారిన పడే ప్రమాదం ఉంది. వేసవి కాలంలో ఎండలు తీవ్రంగా ఉండటం కారణంగా శరీర ఉష్ణోగ్రత (40 డిగ్రీల సెల్సియస్‌ లేదా అంతకంటే ఎక్కువ) పెరగడం వల్ల హీట్ స్ట్రోక్‌ అనేది వస్తుంది. అధిక శరీర ఉష్ణోగ్రతను సకాలంలో నిరోధించకపోతే శాశ్వతంగా ముఖ్యమైన అవయవాలను దెబ్బతీస్తుంది. మెదడు లేదా మూత్రపిండాలు, మరణాలు కూడా సంభవించవచ్చు అని డాక్టర్ పాఠక్ హెచ్చరిస్తున్నారు. పిల్లలు (5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు), వృద్ధులు (65 ఏళ్లు పైబడినవారు), గర్భిణీ స్త్రీలు, ఊబకాయం ఉన్నవారు హీట్ స్ట్రోక్‌కి గురయ్యే ప్రమాదం ఎక్కవుగా ఉంటుందట.

వేడి గాలులు ఆరోగ్యంపై ప్రభావం..

ఈ వేడి గాలులు మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ అండ్‌ కంట్రోల్‌ ప్రివెన్షన్‌ ప్రకారం.. శరీరం ఉష్ణోగ్రత నియంత్రణ వ్యవస్థ ఓవర్‌లోడ్‌కు గురైనప్పుడు అనారోగ్యానికి గురవుతుంటారు. అధిక ఉష్ణోగ్రతలు మెదడు లేదా ఇతర ముఖ్యమైన అవయవాలు దెబ్బతినే అవకాశం ఉంది. ఈ సందర్భంగా కన్సల్టెంట్‌ ఫిజిషియన్‌, క్రిటికల్ కేర్‌ డిపార్ట్‌మెంట్‌, హిందుజా ఆస్పత్రి వైద్యులు డాక్టర్‌ ఖుష్రవ్‌ బజాన్‌ మాట్లాడుతూ.. సమ్మర్‌ సీజన్‌లో వేడి గాలులు ఉంటాయని, తర్వాత అలసట, తిమ్మిర్లు వంటి ప్రభావం ఉంటుందని అన్నారు. దీని కారణంగా అరోగ్యం దెబ్బతినే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ ఎండాకాలంలో వేడి గాలుల కారణంగా హీట్‌స్ట్రోక్‌కు గురవుతుంటారని, అలాగే మరణాలు కూడా సంభవించే అవకాశాలున్నాయని వివరించారు. శరీరం ఉష్ణోగ్రత 106 డిగ్రీలు ఉన్నప్పుడు 10 నుంచి 15 నిమిషాల వ్యవధిలో హీట్ స్ట్రోక్‌, మరణాలు సంభవించే అవకాశం ఉందన్నారు. చెటమ అనేది మానవ శరీరం సహాజ శీతలీకరణ వ్యవస్థ. చాలా వేడి కారణంగా శరీరం తనను తాను చల్లబర్చుకునే సామర్థ్యాన్ని కోల్పోతుంది. దీంతో యువకులు, మధ్య వయసు వారు, వృద్ధులు అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంది. ఈ ఉష్ణోగ్రతల కారణంగా శరీర నియంత్రణ కోల్పోతుంది. హీట్‌స్ట్రోక్‌, అలసట, హైపర్‌థెర్మియా ఏర్పడే అవకాశాలున్నాయి. తిమ్మిరిలు వచ్చే అవకాశాలున్నాయి. సాధారణంగా చేతులు, కాళ్ల కండరాల నొప్పులు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే ఛాతి భాగంలో నొప్పి, మొటిమలు, బొబ్బలు ఏర్పడతాయి.

హీట్‌ స్ట్రోక్‌ అంటే ఏమిటి?

హీట్‌ స్ట్రోక్‌.. దీనినే వడదెబ్బ కూడా అంటారు. డాక్టర్‌ పాథక్‌ వివరాల ప్రకారం.. మీ శరీర ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే ఎక్కువ పెరిగినప్పుడు ఈ అత్యంత తీవ్రమైన వేడి, వడదెబ్బ (Heat stroke) సంభవించవచ్చు. వేసవి నెలల్లో ఈ పరిస్థితి సర్వసాధారణం అని చెబుతున్నారు. వడదెబ్బ రాగానే అత్యవసరంగా వైద్యం అందించాల్సిందే. లేకపోతే ప్రాణాలకే ముప్పు ఉండే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. హీట్‌స్ట్రోక్‌ కారణంగా మరణానికి దారి తీసే అవకాశం ఉంది. శరీర ఉష్ణోగ్రత 104 నుండి 105 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటుంది. శరీరంలోని అవయవాలు సరిగ్గా పని చేయకపోవడం వల్ల మరణాలు సంభవించే అవకాశం ఉంది. హీట్‌ స్ట్రోక్‌ వచ్చిన వారిని చల్లని ప్రదేశంలో ఉంచడం మంచిది. దీని కారణంగా తలనొప్పి, తల తిరగడం, వికారం లేదా స్పృహ కోల్పోవడం వంటివి ఉండవచ్చు.

హీట్‌స్ట్రోక్ లక్షణాలు ఏమిటి?

హీట్ స్ట్రోక్ బారిన పడిన వారు అలసట, తలనొప్పి, తల తిరగడం, వికారం వంటివి సర్వసాధారణం. హీట్‌స్ట్రోక్ రాకముందే తరచుగా చెమటలు పట్టడం వంటివి ఉంటాయి. అలాగే నడవడంలో ఇబ్బంది, మూర్ఛలు లేదా స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు కూడా ఉండవచ్చు అని అంటున్నారు వైద్యులు.

తేలికపాటి దుస్తులు ధరించండి:

ఎండాకాలంలో తేలికపాటి దుస్తులను ధరించడం మంచిది. లేద రంగు, వదులుగా ఉండే దుస్తులను ధరించాలి. ఎక్కువ శాతం చల్లని ప్రదేశంలో ఉండాలి. బయటకు వెళ్లడానికి 30 నిమిషాల ముందు సన్‌స్క్రీన్‌ను అప్లై చేసుకుని వెళ్లడం మంచిది. ఎక్కవగా పండ్ల రసాలను తీసుకోవడం మంచిది.

ఇవి కూడా చదవండి:

Gourd juice: సొరకాయ రసం ఆరోగ్యానికి ఒక వరం.. అదిరిపోయే ప్రయోజనాలు

Health Tips: డీహైడ్రేషన్‌‌తో అనేక ఆరోగ్య సమస్యలు.. వాటికి ఎలా చెక్ పెట్టాలో ఇక్కడ తెలుసుకోండి..!