Health Tips: డీహైడ్రేషన్‌‌తో అనేక ఆరోగ్య సమస్యలు.. వాటికి ఎలా చెక్ పెట్టాలో ఇక్కడ తెలుసుకోండి..!

Health Tips: రోజు రోజుకు వాతావరణంలో గణనీయమైన మార్పులు జరుగుతున్నాయి. ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి.

Health Tips: డీహైడ్రేషన్‌‌తో అనేక ఆరోగ్య సమస్యలు.. వాటికి ఎలా చెక్ పెట్టాలో ఇక్కడ తెలుసుకోండి..!
Summer Tips
Follow us

|

Updated on: Mar 26, 2022 | 7:30 AM

Health Tips: రోజు రోజుకు వాతావరణంలో గణనీయమైన మార్పులు జరుగుతున్నాయి. ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి. వేసవి కాలంలో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ అధికారులు చెబుతున్నారు. అయితే, వేసవిలో ప్రజలు తరచుగా డీహైడ్రేషన్‌కు గురవుతుంటారు. సకాలంలో చికిత్స తీసుకోకపోతే.. ప్రాణాంతకం అవుతుంది. వాస్తవానికి శరీరంలో సరిపడా నీరు లేకపోతే.. డీహైడ్రేషన్ సమస్యకు దారి తీస్తుంది. దీని కారణంగా తల తిరగడం, మూత్రం రాకపోవడం, మూత్రంలో మంట, తలనొప్పి, నోరు పొడిబారడం వంటి సమస్యలు తలెత్తుతాయి. డీహైడ్రేషన్ కారణంగా.. శరీర ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది. ఇది మెదడుపై ప్రభావం చూపుతుంది. శరీరం డీహైడ్రేట్‌ అవకుండా ఉండాలంటే సరిపడా నీటిని రోజూ తాగుతుండాలి. ఎల్లప్పుడూ వాటర్ బాటిల్‌ను వెంట ఉంచుకోవాలి. రోజుకు ఒకటి లేదా రెండుసార్లు నిమ్మరసం తాగాలి.

డీహైడ్రేషన్ సమస్యకు ఇలా చెక్ పెట్టండి.. సీనియర్ ఫిజీషియన్ డాక్టర్ కమల్‌జిత్ సింగ్ కైంత్ ప్రకారం.. వేసవి కాలంలో శరీరం నుండి చెమట ద్వారా నీరు బయటకు నిరంతరంగా వస్తూనే ఉంటుంది. శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి తగినంత నీరు అవసరం. కానీ నీటి కొరత ఏర్పడితే.. డీహైడ్రేట్ అవుతుంది. ఈ కారణంగా అనేక వ్యాధులు వస్తాయి. డీహైడ్రేషన్ కారణంగా బీపీ అదుపులో ఉండదు. కొన్నిసార్లు కండరాల నొప్పి కూడా వస్తుంది. నీరు లేకపోవడం వల్ల మూత్రవిసర్జన కూడా తగ్గుతుంది. ఇది క్రమంగా కిడ్నీ సంబంధిత వ్యాధులకు దారితీస్తుంది. ఈ నేపథ్యంలో శరీరానికి సరిపడా నీటిని తాగాలి. ఉదయం పూట భోజనంలో నీరు ఎక్కువగా ఉండే పచ్చి కూరగాయలు, పండ్లు తినాలి. డీహైడ్రేట్ సమస్యకు చెక్ పెట్టేందుకు మజ్జిగ, పాలు, పెరుగు తీసుకోవాలి. టీ, కాఫీ లకు దూరంగా ఉండండి.

వాంతులు, విరేచనాల పట్ల జాగ్రత్త.. వేసవి సీజన్‌లో చాలా మంది వాంతులు, లూజ్‌మోషన్‌తో బాధపడుతుంటారు. ఇలాంటి సమస్యలు వస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి. వాంతులు, విరేచనాల కారణంగా శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. ఇది డీహైడ్రేషన్‌కు దారితీస్తుంది. ఈ సమస్య నవజాత శిశువులు, వృద్ధులలో ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే వేసవిలో చిన్న పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.

ఇవి డీహైడ్రేషన్ లక్షణాలు.. 1. ఆకస్మిక మైకము. 2. తీవ్రమైన తలనొప్పి. 3. మూత్రం పసుపు రంగులోకి మారడం. 4. పొడి బారిన చర్మం.

Also read:

Optical Illusion: మీ కళ్లకు అగ్నిపరీక్ష.. ఈ ఫోటోలో ఎంత మంది ఉన్నారో చెబితే మీరే జీనియస్..!

Viral Video: చేసిందంతా చేసి కుక్కను బలి చేసిన కంత్రీ పిల్లి.. వీడియో చూస్తే అవాక్కవుతారు..!

Astrology: వ్యక్తి ఎత్తును బట్టి వ్యక్తిత్వాన్ని అంచనా వేయొచ్చు.. అదెలాగో ఇప్పుడే తెలుసుకోండి..