Russia Ukraine War: ‘పుతిన్’ కారణంగా పుట్టెడు కష్టాలు ఎదుర్కొంటున్న 198 ఏళ్ల నాటి చెట్టు.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే..!
Russia Ukraine War: రష్యా అధ్యక్షుడు పుతిన్ నిర్ణయం కారణంగా 198 ఏళ్ల నాటి ఓ భారీ వృక్షం శిక్షను అనుభవిస్తుంది. చెట్టుకు, పుతిన్‌కు సంబంధం ఏంటి?
Russia Ukraine War: రష్యా అధ్యక్షుడు పుతిన్ నిర్ణయం కారణంగా 198 ఏళ్ల నాటి ఓ భారీ వృక్షం శిక్షను అనుభవిస్తుంది. చెట్టుకు, పుతిన్‌కు సంబంధం ఏంటి? అనే బుర్ర గోక్కుంటున్నారు. అవును.. మీరు విన్నది నిజంగా నిజమే. ఉక్రెయిన్‌పై రష్యా అధ్యక్షుడు పుతిన్ వార్ ప్రకటించి.. ఇప్పటికీ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ చర్యల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు.. రష్యాపై ఆంక్షలు విధిస్తున్నాయి. ఆర్థికంగానే కాకుండా అన్ని రకాల ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ క్రమంలోనే.. 198 ఏళ్ల ప్రసిద్ధ రష్యన్ ఓక్ ట్రీ ‘యూరోపియన్ ట్రీ ఆఫ్ ది ఇయర్’ పోటీలో ప్రవేశించకుండా నిషేధించబడింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి కారణంగానే ఇది జరిగింది. ఈ చెట్టును నవలా రచయిత ఇవాన్ తుర్గేనెవ్ 198 ఏళ్ల క్రితం నాటారు. ప్రతీ ఏటా నిర్వహించే ‘యూరోపియన్ ట్రీ ఆఫ్ ది ఇయర్’ పోటీలో ఈ చెట్టును కూడా చేర్చేవారు. అయితే ఉక్రెయిన్‌పై దాడుల కారణంగా.. పోటీలో పాలగొనడానికి చెట్టును అనర్హమైనదిగా బ్రస్సెల్స్‌లోని ఒక ప్యానెల్ ప్రకటించింది. ఉక్రెయిన్‌పై దండయాత్ర చేస్తున్న నేపథ్యంలో ఈ పోటీల్లో చెట్టుకు అవకాశం ఉండబోదని న్యాయ నిర్ణేతలు ప్రకటించారు.
‘యూరోపియన్ ట్రీ ఆఫ్ ది ఇయర్’ పోటీ 2011లో ప్రారంభించారు. చారిత్రక చెట్ల ఉనికిని నిలుపుకోవడం, దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. ఇందులో భాగంగానే ఈ ఏడాది కూడా కాంపిటీషన్ నిర్వహించారు. బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పోలాండ్‌లోని బియాలోవిజా అడవుల్లోని 400 ఏళ్ల నాటి ఓక్ చెట్టు విజేతగా నిలిచింది. రెండవ స్థానంలో స్పెయిన్‌లోని శాంటియాగో డి కంపోస్టెలా ప్రాంతంలో 250 ఏళ్ల నాటి ఓక్ చెట్టు, మూడవ స్థానంలో వాల్లే డో పెరీరో అనే గ్రామంలో ఉన్న 250 ఏళ్ల నాటి కార్క్ ఓక్ ట్రీ నిలిచింది. ఈ పోటీసులు మొత్తం 15 దేశాలు పాల్గొన్నాయి.
Also read:
MI vs DC, IPL 2022: ఢిల్లీ టార్గెట్ 178.. హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న ఇషాన్ కిషన్..