Russia-Ukraine War: రూట్ మార్చిన రష్యా.. డాన్‌బాస్‌పై కాకుండా కీవ్ పైనే గురి.. ఎందుకంటే..
ఉక్రెయిన్‌ను సర్వనాశనం చేయడమే లక్ష్యంగా రష్యా దాడులు వరుసగా 32వ రోజు కొనసాగాయి. పెద్దనగరాలను మాత్రమే కాకుండా చిన్న పట్టణాలపై కూడా రష్యా బాంబుల వర్షం కురిపిస్తోంది. రష్యా అధ్యక్షుడని మార్చేందుకు తాము కుట్ర చేస్తునట్టు వస్తున్న వార్తల్లో..
ఉక్రెయిన్‌ను సర్వనాశనం చేయడమే లక్ష్యంగా రష్యా దాడులు(Russia-Ukraine War) వరుసగా 32వ రోజు కొనసాగాయి. పెద్దనగరాలను మాత్రమే కాకుండా చిన్న పట్టణాలపై కూడా రష్యా బాంబుల వర్షం కురిపిస్తోంది. రష్యా అధ్యక్షుడని మార్చేందుకు తాము కుట్ర చేస్తునట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని అమెరికా వివరణ ఇచ్చింది. డాన్‌బాస్ పైనే తమ గురి అన్న రష్యా రూట్ మార్చింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా రష్యా భీకరదాడులు చేస్తోంది. కీవ్‌ను నాలుగు వైపుల నుంచి చుట్టుముట్టాయి రష్యా బలగాలు. రష్యా తాజా దాడుల్లో కీవ్ లోని పలు భవనాలు ధ్వంసమయ్యాయి. రష్యా దాడిలో కీవ్ లోని ఆయిల్ డిపో కూడా ధ్వంసమయ్యింది. ఉక్రెయిన్ లోని ప్రధాన నగరాలను మాత్రమే కాదు.. చిన్న చిన్న పట్టణాలను కూడా రష్యా సైన్యం వదలడం లేదు. పశ్చిమాన ఉన్న లీవ్‌లో ఆయిల్ డిపోను మిస్సైళ్లతో పేల్చేశారు. ఆయిల్ డిపో నుంచి భారీగా మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు.
మరియాపోల్ నగరం పూర్తిగా రష్యా ఆధీనం లోకి వచ్చింది. మరియాపోల్‌లో సెక్యూరిటీ బాధ్యతలను చెచెన్ ఫైటర్స్‌కు అప్పగించింది రష్యా సైన్యం. మరియాపోల్ పరిపాలన భవనంపై తమ జెండాను ఎగురవేశారు. యమకింకరులుగా పేరున్న చెచెన్ దళాన్ని యుద్దక్షేత్రం లోకి దింపారు పుతిన్.
ఉక్రెయిన్ లోని ఒక్కొక్క నగరాన్ని ధ్వంసం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాయి రష్యా బలగాలు . మరియాపోల్‌లో చాలా దారుణ పరిస్థితులు ఉన్నాయి. ఆహారం దొరక్క అలమటిస్తున్నారు స్థానికులు. ఇంకా రెండు లక్షల మంది పౌరులు అక్కడే చిక్కుకున్నట్టు తెలుస్తోంది. సాధారణ పౌరులు మరియాపోల్‌ను విడిచి వెళ్లడానికి హ్యూమన్ కారిడార్లకు అంగీకరిస్తామని రష్యా ప్రకటించింది. కేవలం తుపాకులతో మరియాపోల్‌ను రక్షించుకోవడం తమకు అసాధ్యమని , పశ్చిమదేశాలు యుద్దవిమానాలు , క్షిపణులను ఇవ్వాలని కోరారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.
అమెరికా అధ్యక్షుడు బైడెన్ పోలండ్ పర్యటనలో ఉండగానే ఆ దేశ సరిహద్దుకు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాన్ని రష్యా టార్గెట్ చేయడం సంచలనం రేపింది. లీవ్‌లో నాలుగు మిస్సైల్ దాడులు జరిగినట్టు ఉక్రెయిన్ సైనికవర్గాలు వెల్లడించాయి. రష్యాలో నాయకత్వం మార్చడానికి తాము జోక్యం చేసుకుంటామని వస్తున్న వార్తల్లో నిజం లేదని అమెరికా ప్రకటించింది.
ఇవి కూడా చదవండి: RRR Movie: ఆ థియేటర్‌లో జక్కన్న సినిమాను ఫస్ట్ హాఫ్ మాత్రమే వేసి ఆపేశారు.. కారణమేంటంటే..
ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు తీపికబురు! టీచర్ ఎటిజిబిలిటీ టెస్ట్ 2022 జూన్‌లో..