Russia-Ukraine War: క్షణ క్షణం ప్రాణగండం.. బిక్కుబిక్కుమంటూ మెట్రో స్ట్రేషన్‌లో తలదాచుకుంటున్న ఉక్రెయిన్లు..!
Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య బాంబుల వర్షం కొనసాగుతోంది. ఉక్రెయిన్‌పై రష్యా భీకరదాడులు కొనసాగిస్తోంది. రష్యా దాడులతో ఉక్రెయిన్ తల్లడిల్లిపోతోంది..
Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య బాంబుల వర్షం కొనసాగుతోంది. ఉక్రెయిన్‌పై రష్యా భీకరదాడులు కొనసాగిస్తోంది. రష్యా దాడులతో ఉక్రెయిన్ తల్లడిల్లిపోతోంది. ఇప్పటికే అపారనష్టం జరిగిపోయింది. గత నెల రోజులుగా బాంబుల వర్షం కారణంగా బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు ఉక్రెయిన్ (Ukraine) ప్రజలు. ఇప్పటికే ఖార్కివ్, మారియుపోల్‌లను స్వాధీనం చేసుకునేందుకు రష్యా (Russia) బలగాలు దాడులు కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఖార్కివ్‌లోని పౌరులు బాంబుల దాడుల నుంచి తప్పించుకునేందుకు మెట్రో స్టేషన్‌లోనే తలదాచుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ట్విట్టర్‌లో ఉక్రెనియన్లకు ఆ మెట్రో స్టేషన్ బాంబు షెల్టర్‌గా మారిందని పేర్కొంది. ఆ స్టేషన్‌లో పౌరులు ఏ విధంగా తలదాచుకుంటున్నారో వివరిస్తూ వాటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. అక్కడే తలదాచుకుంటున్న ఉక్రెయిన్ల కోసం తాత్కాలిక పడకలను, సంగీత కచేరీలను ఏర్పాటు చేశారు. అలాగే ఖార్కివ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్ అండ్ టెక్నాలజీలోని న్యూట్రాన్ సోర్స్ ప్రయోగశాల అగ్ని ప్రమాదానికి గురైందని మంత్రిత్వశాఖ తెలిపింది. ఇలాంటి దృశ్యాలు ఉక్రెయిన్‌లో ఎన్నో ఉన్నాయి. రష్యా దాడులతో అక్కడున్న ఉక్రెయిన్, ఇతర దేశాలకు చెందిన ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. రష్యా ఏ మాత్రం వెనుకాడకుండా భీకర దాడులు కొనసాగిస్తూనే ఉంది.
#Kharkiv metro turned into a bomb shelter and a temporary home for many residents, but life goes on. #StandWithUkraine️#StopRussianAggression pic.twitter.com/1EGPhiVBYw
— MFA of Ukraine ?? (@MFA_Ukraine) March 27, 2022
ఇవి కూడా చదవండి: