Yadadri: యాదాద్రిలో మహాకుంభ సంప్రోక్షణకు సర్వం సిద్ధం.. కొన్నిగంటల్లో లక్ష్మీనరసింహస్వామి దర్శనం..

ఆరేళ్లుగా ఎదరు చూస్తున్న యాదాద్రి నరసింహుని దివ్వదర్శనం మరి కొన్ని గంటల్లో భక్తులకు కలుగనుంది. ఇంత కాలం స్వామి వారి దర్శన భాగ్యం కలిగిన బాలాలయం మూత పడుతోంది. ఇక దివ్వధామంగా రూపుదిద్దుకున్న ఈ శిల్పకళా ఆలయంలో కొలువు దీరిన నరసింహుని తొలిభక్తునిగా రేపు కేసీఆర్‌ రానున్నారు.

Yadadri: యాదాద్రిలో మహాకుంభ సంప్రోక్షణకు సర్వం సిద్ధం.. కొన్నిగంటల్లో లక్ష్మీనరసింహస్వామి దర్శనం..
Yadadri
Follow us
Sanjay Kasula

|

Updated on: Mar 27, 2022 | 10:12 PM

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా యాదాద్రి(Yadadri) పంచ నారసింహ క్షేత్రానికి సర్వాంగ సుందరంగా పునర్నిర్మించింది. పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే రీతిలో వివిధ ఆలయాల శిల్పకళా శైలీవిన్యాసాలన్నీ ఒకేచోట కొలువుదీరాయి. ప్రపంచస్థాయి క్షేత్రంగా ఈ దివ్యధామాన్ని నేత్రపర్వంగా తీర్చిదిద్దారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తొలిభక్తునిగా రేపు పూజలు జరిపించిన తర్వాత భక్తులకు నరసింహుని దర్శనం లభించనుంది. మహాకుంభ సంప్రోక్షణకు యాదాద్రి సర్వం సిద్ధమయింది. రేపు జరిగే ఈ మహా క్రతువుకు సీఎం కేసీఆర్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. దీంతో ఆలయ పరిసరాలు, చుట్టు పక్కల ప్రాంతాలు సందడిగా మారాయి. ఈ మహా సంప్రోక్షణ మహోత్సవానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

మహా సంప్రోక్షణ మహోత్సవానికి సీఎం కేసీఆర్, మంత్రులు, వీఐపిలు పాల్గొంటారని ఆలయ ఈవో గీతారెడ్డి చెబుతున్నారు. ఈ కార్య్రమానికి అందరూ ఆహ్వానితులేనని, చిన జీయర్ స్వామికి ఎలాంటి ప్రత్యేక ఆహ్వానం పంపలేదని చెబుతున్నారు. ఆలయ మహా సంప్రోక్షణలో ఎలాంటి శిలా ఫలకాలు కూడా లేవంటున్నారు.

ఈ మహోత్సవానికి పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. బాంబు, డాగ్ స్క్వాడ్‌లతో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. 400 సీసీ కెమెరాలు, మూడు వేల పోలీసు సిబ్బందితో నిఘా ఏర్పాటు చేశామన్నారు రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌.

సీఎం కేసీఆర్ తో సహా ప్రముఖులు సంప్రోక్షణ మహోత్సవానికి వస్తున్న నేపథ్యంలో ఆక్టోపస్, గ్రేహౌండ్ బలగాలను కూడా రంగంలోకి దించుతున్నారు. కొండపై కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి: Yogi Adityanath Oath: రెండోసారి ఉత్తర ప్రదేశ్ సీఎంగా యోగి ఆదిత్యానాథ్‌.. కొత్త మంత్రి వర్గంలో మంత్రులు వీరే..

Kishan Reddy: పుత్రవాత్సల్యంతోనే రైతుల్ని బలిచేస్తున్నారు.. కేసీఆర్ సర్కార్‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం..

Yogi Cabinet: ఒకప్పుడు సైకిళ్లకు పంక్చర్లు వేసుకునే వ్యక్తి.. నేడు యోగి సర్కార్‌లో మినిస్టర్.. అతని పొలిటికల్ హిస్టరీ ఇది..