Heart Attack: గుండెపోటు తర్వాత బ్రెయిన్‌లో మార్పులు.. అధ్యయనంలో షాకింగ్ నిజాలు..!
Heart Attack: గుండెపోటుకి గురైన వ్యక్తులలో సాధారణంగా చాలా మార్పులు సంభవిస్తాయి. తాజాగా అలాంటి వ్యక్తుల మెదడు రాబోయే రోజుల్లో మునుపటి కంటే
Heart Attack: గుండెపోటుకి గురైన వ్యక్తులలో సాధారణంగా చాలా మార్పులు సంభవిస్తాయి. తాజాగా అలాంటి వ్యక్తుల మెదడు రాబోయే రోజుల్లో మునుపటి కంటే తక్కువగా పనిచేస్తుందని కొత్త అధ్యయనం వెల్లడిస్తోంది. అతడిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, అతడు నిత్యం చేసే కార్యకలాపాలను పర్యవేక్షించాలని పరిశోధకులు సూచిస్తున్నారు. పోలాండ్‌లోని జె.స్ట్రాస్ హాస్పిటల్‌లోని కార్డియాలజిస్ట్ ఇలా అన్నారు. “మయోకార్డియల్ ఇన్‌ఫార్జన్ కారణంగా ఆసుపత్రిలో చేరిన రోగులలో ఇంతకుముందు తెలియని బలహీనతలని గుర్తించినట్లు తెలిపారు. ఈ మానసిక బలహీనత శాశ్వతంగా లేదా తాత్కాలికంగా ఉంటుందని పేర్కొన్నారు. కొంతమంది రోగులలో ఈ మానసిక బలహీనత గుండెపోటు తర్వాత చాలా నెలల తర్వాత కనిపిస్తోందని’ సూచించారు.
ఈ అధ్యయనంలో గుండెపోటుకి గురైన 220 మంది రోగులు పాల్గొన్నారు. ఈ రోగులందరికి కొన్ని రోజుల తర్వాత రెండు పరీక్షలు నిర్వహించారు. మినీ-మెంటల్ స్టేట్ ఎగ్జామినేషన్, క్లాక్ డ్రాయింగ్ టెస్ట్. ఈ పరీక్షలు ఒక వ్యక్తి ఆలోచన, జ్ఞాపకశక్తి, ప్రాథమిక విధులు నిర్వహించగల సామర్థ్యాన్ని అంచనా వేస్తాయి. ఈ పరీక్షలు ఒక వ్యక్తి మతిమరుపు స్థాయిని నిర్ధారిస్తాయి. ఈ రెండు పరీక్షలలోని దాదాపు 50 శాతం మంది రోగులలో వారి మానసిక పనితీరు సాధారణంగా పని చేస్తుంది. మిగిలిన సగం మంది రోగులలో కొంత మానసిక బలహీనత ఉందని తేలింది. 35 నుంచి 40 శాతం మంది రోగులలో గుండెపోటు తర్వాత ప్రారంభ రోజుల్లో మతిమరుపు సమస్యని గుర్తించారు. అయితే 27 నుంచి 33 శాతం మంది రోగులలో గుండెపోటు వచ్చిన ఆరు నెలల తర్వాత మెదడు బలహీనత కనిపించినట్లు పరిశోధకులు తెలిపారు.
గమనిక : అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.