Ashwagandha: అశ్వగంధ పురుషులకు దివ్య ఔషధం.. లాభాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..!
Ashwagandha: అశ్వగంధ మూలికలలో రారాజు. దీనిని ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగిస్తారు. మందుల తయారీలో వాడుతారు. ముఖ్యంగా ఇది పురుషులకు చాలా ఉపయోగపడుతుంది.
Ashwagandha: అశ్వగంధ మూలికలలో రారాజు. దీనిని ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగిస్తారు. మందుల తయారీలో వాడుతారు. ముఖ్యంగా ఇది పురుషులకు చాలా ఉపయోగపడుతుంది. మగవారి అనేక సమస్యలను తొలగిస్తుంది. పురుషులు దీనిని తింటే వారి లైంగిక ఆరోగ్యం బాగుంటుందని ఆయుర్వేద పండితులు చెబుతారు. ఎందుకంటే ఇది శరీరంలో పురుష హార్మోన్లని ప్రేరేపిస్తుంది. మీకు ఏదైనా హార్మోన్ సంబంధిత సమస్య ఉంటే ఖచ్చితంగా అశ్వగంధను ప్రయత్నిస్తే మంచిది. అశ్వగంధ పురుషులలో సంతానలేమి సమస్యను దూరం చేస్తుంది. అందుకే చాలా మంది ఆయుర్వేద నిపుణులు పురుషులు అశ్వగంధను క్రమం తప్పకుండా తినమని సలహా ఇస్తారు. మారుతున్న జీవనశైలి కారణంగా పురుషులలో స్పెర్మ్ కౌంట్ తగ్గే సమస్య ఏర్పడుతోంది. ఈ పరిస్థితిలో మీరు అశ్వగంధను తింటే మీ స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది. చాలా మంది పురుషులలో స్పెర్మ్ కౌంట్ తగ్గడం వల్ల వంధ్యత్వ సమస్య పెరుగుతుంది. ఈ పరిస్థితిలో వారు ఖచ్చితంగా అశ్వగంధను ప్రయత్నించాలి. దీని వల్ల వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
ఇది కాకుండా అశ్వగంధ లైంగిక కోరికను పెంచడంలో ఉపయోగకరంగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల పురుషులలో లైంగిక కోరికను పెంచే టెస్టోస్టెరాన్ హార్మోన్ లోపం తొలగిపోతుంది. మీ లైంగిక వాంఛ తగ్గుతున్నట్లయితే డాక్టర్ సలహా మేరకు మీరు క్రమం తప్పకుండా అశ్వగంధ క్యాప్సూల్స్, పౌడర్ వాడవచ్చు. మీ రెగ్యులర్ డైట్‌లో అశ్వగంధను చేర్చుకోవడం వల్ల బరువు పెరుగుతారు. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం.. అశ్వగంధ సాధారణ బలహీనతకు, న్యూరో-కండరాల సమన్వయాన్ని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుందని నిరూపించారు. అంతేకాదు బలహీనంగా ఉన్నవారు ప్రతిరోజు అశ్వగంధ తీసుకుంటే కొద్దిరోజుల్లో బలంగా తయారవుతారు. అశ్వగంధ పక్షవాతం కలిగించే బ్రెయిన్ స్ట్రోక్స్ వంటి దీర్ఘకాలిక అనారోగ్యాలను, ప్రోస్టేట్, ఊపిరితిత్తుల క్యాన్సర్‌లతో సహా అన్ని రకాల క్యాన్సర్‌లను మెరుగుపరుస్తుంది. వృద్ధుల చివరి దశలో చాలా ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అశ్వగంధ ఆధునిక చికిత్స కంటే ఎన్నో రెట్లు మేలని నిరూపణ అయింది.
గమనిక : అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.