Health News: త్వరలో ఆయుర్వేద పద్దతిలో గర్భనిరోధక మాత్రలు.. పేటెంట్ లభించింది..!
Health News: మహారాష్ట్రలో నివసిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆశా భౌసాహెబ్ కదమ్ 10 సంవత్సరాల పరిశోధన తర్వాత గర్భనిరోధక మూలికా ఫార్ములా కోసం భారత ప్రభుత్వం నుంచి
Health News: మహారాష్ట్రలో నివసిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆశా భౌసాహెబ్ కదమ్ 10 సంవత్సరాల పరిశోధన తర్వాత గర్భనిరోధక మూలికా ఫార్ములా కోసం భారత ప్రభుత్వం నుంచి పేటెంట్ పొందారు. ప్రముఖ ఔషధ కంపెనీ సహకారంతో ఈ ఔషధాన్ని మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ ఔషధం టాబ్లెట్, ద్రవ రూపంలో అందుబాటులో ఉంటుంది. మీడియా నివేదికల ప్రకారం.. ఆయుర్వేద పద్ధతి ద్వారా కుటుంబ నియంత్రణ అనేది గొప్ప విషయం. గర్భధారణను నివారించడానికి అత్యంత ఖచ్చితమైన ఫలితాలతో మూలికా ఔషధం త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశంఉంది. మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలోని కర్జాత్ దాదా పాటిల్ మహావిద్యాలయ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆశా భౌసాహెబ్ కదమ్ (సావంత్) ఈ ఫార్ములాను సిద్ధం చేశారు. తన ఫార్ములా శాస్త్రీయ ప్రమాణాలపై పరీక్షించిందని డాక్టర్ కదమ్ చెబుతున్నారు. దీన్ని మొదటగా ఎలుకలపై పరీక్షించగా 100 శాతం విజయం సాధించింది. తరువాత ఈ ఔషధం మహిళలపై పరీక్షించారు. ఇందులో కూడా సక్సెస్ రేట్ ఎక్కువగానే ఉంది. ఇప్పటికే ఆయన పేరిట 21 పరిశోధనా పత్రాలు వెలువడ్డాయి.
దీనిపై డాక్టర్ కదమ్ మాట్లాడుతూ.. ‘ఈ మందు ఔషధ మొక్కల పదార్దాల నుంచి తయారు చేస్తాం. చాలా మంది గిరిజన మహిళలకు ఈ మొక్కల గురించి ముందుగానే తెలుసు. వీటిని ఎప్పటి నుంచో వారు వినియోగిస్తున్నారు. వివరణాత్మక అధ్యయనం తర్వాత ఫార్ములా తయారు చేశాం. మొక్కల ఆకులు, బెరడు, గింజలు తదితరాలను కలిపి ఫార్ములా రెడీ చేశాం. తరువాత ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వ నేషనల్ టాక్సికాలజీ సెంటర్ (పుణె)కి సమర్పించాం. విచారణ అనంతరం ఆమోదం లభించింది. ఫిబ్రవరి 18న పేటెంట్ మంజూరైంది. ఈ ఔషధం మూలికల నుంచి తయారైంది కాబట్టి ఇది మహిళలపై ఎటువంటి దుష్ప్రభావాన్ని చూపించదు. గర్భధారణను నివారించడానికి ఈ ఔషధం నెలలో 21 రోజులు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ మార్కెట్లో దొరికే రసాయన ఆధారిత మందులు అనేక దుష్ప్రభావాలను కలిగి ఉంటాయి’
గమనిక : అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.