AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తల్లిదండ్రులు జాగ్రత్త.. మీ పిల్లలు అందరి పిల్లల మాదిరిగానే ప్రవర్తిస్తున్నారా..!

Autism: తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై ఓ కన్నేసి ఉంచాలి. లేదంటే వారు వ్యాధులకి గురైన సంగతి తెలియదు. ముఖ్యంగా ఆటిజం వ్యాధి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

తల్లిదండ్రులు జాగ్రత్త.. మీ పిల్లలు అందరి పిల్లల మాదిరిగానే ప్రవర్తిస్తున్నారా..!
Autism
uppula Raju
|

Updated on: Mar 26, 2022 | 5:58 AM

Share

Autism: తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై ఓ కన్నేసి ఉంచాలి. లేదంటే వారు వ్యాధులకి గురైన సంగతి తెలియదు. ముఖ్యంగా ఆటిజం వ్యాధి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వైద్యుల అభిప్రాయం ప్రకారం ఈ వ్యాధికి చికిత్స లేదు. సకాలంలో గుర్తించడం ద్వారా మాత్రమే లక్షణాలను తగ్గించవచ్చు. ఇది న్యూరోలాజికల్ డిజార్డర్. దీని లక్షణాలు వివిధ పిల్లలలో విభిన్నంగా ఉంటాయి. చాలా సందర్భాలలో ఈ వ్యాధి జన్యుపరమైన కారణాల వల్ల సంభవిస్తుంది. దీని వల్ల పిల్లల మానసిక ఎదుగుదల సరిగ్గా జరగక సాధారణ జీవితం గడపడం కష్టమవుతుంది. ఆటిజం మెదడుకు సంబంధించిన వ్యాధి అని వైద్యులు చెబుతున్నారు. ఇందులో పిల్లల మెదడులోని కొంత భాగం సరిగా పనిచేయదు. దీనివల్ల మామూలు పిల్లాడిలా ప్రవర్తించరు. ఈ వ్యాధి లక్షణాలు పుట్టిన కొద్ది నెలల తర్వాత మాత్రమే కనిపిస్తాయి. చిన్న పిల్లవాడు మీ స్వరానికి ప్రతిస్పందించకపోవడం, ఏడాది దాటినా మాట్లాడలేకపోవడం, స్పర్శకు స్పందించకపోవడం ఆటిజం లక్షణాలుగా చెప్పవచ్చు. పిల్లలలో ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

తల్లిదండ్రులు తమ పిల్లలతో ఎక్కువ సమయం గడపడం చాలా ముఖ్యం. వారి లక్షణాలను గమనిస్తూ ఉండాలి. మీ బిడ్డ సాధారణంగా ప్రవర్తించకపోతే వెంటనే అప్రమత్తం కావాలి. అలాగే శిశువు నెలలు నిండకుండా పుడితే కూడా ఆటిజానికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. అలాంటి పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ విషయంలో ఏమాత్రం అజాగ్రత్తగా వద్దు. వ్యాధి సకాలంలో గుర్తిస్తే లక్షణాలను తగ్గించవచ్చు. పిల్లలు సాధారణ జీవితం గడిపేలా చేయవచ్చు. ఆటిజం పెద్దలలో కూడా వస్తుందని నిపుణులు చెబుతున్నారు. కొంతమంది చిన్న చిన్న విషయాలకే కలత చెందుతారు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోలేరు. మాట్లాడేటప్పుడు చాలా సార్లు గందరగోళంగా ఉంటారు. అయితే పెద్దలలో ఈ వ్యాధికి నిర్దిష్ట చికిత్స లేదు. కానీ వ్యాధి లక్షణాలను మాత్రం తగ్గించవచ్చు.

IPL 2022: ఐపీఎల్‌లో ఇప్పటివరకు అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాళ్లు వీరే..!

Oily Skin: ఆయిల్‌ స్కిన్‌ ఉన్నవారు వీటిని అప్లై చేయకూడదు.. ఎందుకో తెలుసుకోండి..!

Earthquake: అరుణాచల్ ప్రదేశ్‌లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.1 తీవ్రత