AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetes: మధుమేహంపై ప్రజల్లో అపోహలు.. వాస్తవాలు.. ఇప్పుడే తెలుసుకోండి..

Diabetes: ప్రస్తుత కాలంలో చాలా మంది డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా.. చిన్న పిల్లలు మొదలు..

Diabetes: మధుమేహంపై ప్రజల్లో అపోహలు.. వాస్తవాలు.. ఇప్పుడే తెలుసుకోండి..
Diabetes
Shiva Prajapati
|

Updated on: Mar 28, 2022 | 8:28 AM

Share

Diabetes: ప్రస్తుత కాలంలో చాలా మంది డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా.. చిన్న పిల్లలు మొదలు.. పెద్దవారి వరకు డయాబెటిక్ బారిన పడుతున్నారు. అయితే, ఈ వ్యాధిని గుర్తించడంలో ఆలస్యమే అసలు సమస్యకు కారణం అని వైద్యులు చెబుతున్నారు. అనేక పరిశోధనలలో 90 శాతం మధుమేహం కేసులలో.. చాలా కాలం గడిచిన తర్వాత వ్యాధి గుర్తించడం జరుగుతుందని గుర్తించారు. కారణం మధుమేహానికి సంబంధించి పెద్ద లక్షణాలు ఏమీ లేకపోవడం. దీని కారణంగా తాము మధుమేహం బారిన పడుతున్నామనే విషయాన్నే గ్రహించలేకపోతున్నారు. మధుమేహం అనేది అంతర్లీనంగా శరీరాన్ని ద్వంసం చేసే వ్యాధి. దీనికి ఎలాంటి శాశ్వత చికిత్స లేదు. జీవితాంతం క్రమబద్ధమైన ఆహారం తిని, మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవాల్సి ఉంటుంది. జీవితాంతం మందులు వాడుతూనే ఉండాలి.

అయితే, మధుమేహానికి సంబంధించిన తినే ఆహారం గురించి ప్రజల్లో అనేక రకాల అపోహలు ఉన్నాయి. మరి ఆ అపోహలు ఏంటి? అందులోని వాస్తవాలు ఏంటి? నిపుణులు చెప్పిన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

మద్యం సేవించకూడదు.. ఆల్కహాల్‌లో ఉండే షుగర్ శరీరంలో బ్లడ్ షుగర్ స్థాయిని బాగా పెంచుతుందని చెబుతారు. ఏదైనా అతిగా తీసుకోవడం వల్ల సమస్యలు వస్తాయనీ, మద్యం సేవించడం వల్ల కూడా అదే సమస్య వస్తుందని చెబుతారు. కానీ మధుమేహం టైప్ 1తో బాధపడుతున్న వ్యక్తులు మితంగా మద్యం సేవించవచ్చట. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇలా చేయడం వల్ల డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉండదట.

పిండి పదార్ధాలు తినవద్దు.. డయాబెటిస్‌తో బాధపడుతున్న వ్యక్తులు పిండి పదార్ధంతో కూడిన ఆహారాన్ని తినడం మానేస్తారు. ఇది తప్పుడు సలహా అని నిపుణులు కొట్టిపారేస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ ఆహారాలు శరీరానికి అవసరమైన శక్తిని ఇస్తాయి. అందుకే.. డయాబెటిస్‌తో బాధపడుతున్న రోగులు శక్తివంతంగా ఉండటానికి పండి పదార్థాలతో కూడిన ఆహారాలను తక్కువ మొత్తంలో తీసుకోవాలని సూచిస్తున్నారు.

నిరంతర అనారోగ్యం.. మధుమేహంతో బాధపడేవారు తరచుగా అనారోగ్యంతో ఉన్నామనే భావన ప్రజల్లో ఉంటుంది. అయితే ఇది ఎంతమాత్రం సరైనది కాదు. మధుమేహంతో బాధపడే వ్యక్తి తన ఆహారం, జీవనశైలిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే వారు కూడా సాధారణ వ్యక్తిగా జీవితాన్ని ఆస్వాధించవచ్చు. శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్ అదుపులో ఉండేలా చూసుకుంటే వ్యాధులకు దూరంగా ఉండవచ్చు.

Also read:

Petrol Diesel Price: దేశవ్యాప్తంగా ఆందోళనలు.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. మన నగరంలో ఇలా..

Toll Plaza: టోల్ ప్లాజాల తొలగింపు.. వాహనదారులకు ఊరట లభించేనా..?

Viral Video: నాకూ ఒకటి కావాలి.. వైరల్ వీడియోపై ఆనంద్ మహీంద్ర అద్భుతమైన రియాక్షన్..!

పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా