Petrol Diesel Price: దేశవ్యాప్తంగా ఆందోళనలు.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. మన నగరంలో ఇలా..
పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతున్నట్లు ఆయిల్ కంపెనీలు మరోసారి ప్రకటించాయి . దేశంలోని ప్రధాన చమురు మార్కెటింగ్ కంపెనీలు ఇవాళ మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. మార్చి 28, సోమవారం ఢిల్లీలో పెట్రోల్..
Petrol Diesel Price:పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతున్నట్లు ఆయిల్ కంపెనీలు మరోసారి ప్రకటించాయి . దేశంలోని ప్రధాన చమురు మార్కెటింగ్ కంపెనీలు ఇవాళ మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. మార్చి 28, సోమవారం ఢిల్లీలో పెట్రోల్ ధర 30 పైసలు, డీజిల్ ధర 35 పైసలు పెరిగింది. ఇప్పుడు ఢిల్లీలో ఒక లీటర్ పెట్రోల్‌కు రూ.99.41 చెల్లించాల్సి ఉంటుంది . అదే సమయంలో ఒక లీటర్ డీజిల్‌కు రూ .90.77 చెల్లించాల్సి ఉంటుంది. గత 7 రోజుల్లో, ఈ రోజు 6 వ సారి.. చమురు ధరలు పెరిగాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం ఇది వరుసగా రెండో వారం. ఈ వివరాలను వెబ్ సైట్ అందించిన సమాచారం ప్రకారం పెట్రోర్, డీజిల్ ధరలు మీ కోసం..
పెట్రోలు ధర రూ.4 పెరిగింది
చమురు కంపెనీలు మార్చి 22 నుండి పెట్రోల్ , డీజిల్ ధరలను పెంచడం ప్రారంభించాయి. అప్పటి నుండి ఇప్పటివరకు అంటే 7 రోజుల్లో, లీటర్ పెట్రోల్ ధర లీటరుకు 4 రూపాయలు పెరిగింది. మార్చి 22, మార్చి 23 తేదీల్లో వరుసగా రెండు రోజుల పాటు చమురు ధర 80-80 పైసలు పెరిగింది. అదే సమయంలో, మార్చి 24 న ధరలలో ఎటువంటి మార్పు లేదు. కానీ అప్పటి నుండి చమురు ధరలను పెంచే ప్రక్రియ కొనసాగుతోంది. దీంతో దేశవ్యాప్తంగా చమురు ధర పెరిగాయి.
తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.112.37గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.99.07గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.112.24గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.99.24గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 112.15గా ఉండగా.. డీజిల్ ధర రూ.99.72గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.113.51గా ఉండగా.. డీజిల్ ధర రూ.99.18గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 112.58 ఉండగా.. డీజిల్ ధర రూ.99.07గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 112.06 పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.98.39గా ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..
విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.114.51కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.100.46లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.113.34 ఉండగా.. డీజిల్ ధర రూ. 99.33గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.114.02 లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.99.96గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 114.28గా ఉండగా.. డీజిల్ ధర రూ.100.25గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ.114.64లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.100.46లకు లభిస్తోంది.
దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు..
దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ.99.41 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 90.42 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.114.19కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.98.13 ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.108.85 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 93.57 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 105.18 ఉండగా.. డీజిల్ ధర రూ.95.10గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.104.78 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.88.67గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 99.26 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.90.79గా ఉంది.
ఇవి కూడా చదవండి: Yadadri Temple: మరికాసేపట్లో భక్తులకు యాదాద్రి నృసింహుడి నిజరూప దర్శనం.. తొలి భక్తునిగా సీఎం కేసీఆర్ ..
BJP: తెలుగు రాష్ట్రాలపై బీజేపీ స్పెషల్ ఫోకస్.. ఏపీ, తెలంగాణల్లో యూపీ ఫార్ములా..