AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BJP: తెలుగు రాష్ట్రాలపై బీజేపీ స్పెషల్ ఫోకస్.. ఏపీ, తెలంగాణల్లో యూపీ ఫార్ములా..

యుపీలో గెలుపు సరేసరి. మరి ఏపీలో ఫార్ములా ఏంటి? కమలనాథులు సంధిస్తున్న అస్త్రాలేంటి? అమరావతిపై అందుకున్న నినాదమేంటి?

BJP: తెలుగు రాష్ట్రాలపై బీజేపీ స్పెషల్ ఫోకస్.. ఏపీ, తెలంగాణల్లో యూపీ ఫార్ములా..
Uttar Pradesh Formula
Sanjay Kasula
|

Updated on: Mar 27, 2022 | 10:23 PM

Share

ఉత్తర ప్రదేశ్‌ సహా నాలుగు రాష్ట్రాల గెలుపుతో దూకుడు మీదున్న భారతీయ జనతా పార్టీ(BJP).. తెలుగు రాష్ట్రాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. గెలుపు వ్యూహాలు రచిస్తోంది. ఉత్తరప్రదేశ్ ఫార్ములా అనుసరిస్తూ.. అవసరమైతే.. అంతకు మించిన అస్త్రాలు సంధించాలని యోచిస్తోంది. ఈ క్రమంలో యుపీ ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించిన బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌తో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసిన బీజేపీ నేతలు ఏపీలో అనుసరించాల్సిన వ్యూహాలు రచిస్తున్నారు. యూపీ ఎన్నికల్లో ఇంఛార్జిగా కీలక పాత్ర పోషించిన సత్యకుమార్ సూచనలు ఏపీలో రాబోయే ఎన్నికలకు కావాలన్నారు. యుపీలో అభివృద్ధే మళ్లీ బీజేపీని గెలిపించిందన్న సత్య కుమార్.. రెండోసారి యోగి గెలుపు అనేక రికార్డులను తిరిగరాసిందన్నారు.

మోదీ, యోగి కలిస్తే.. రెండు అనుకున్నారు కాని.. అక్కడ 11 అయ్యిందన్నారు. ఏపీకి కేంద్రం నుంచి అనేక నిధులు వస్తున్నాయన్న సత్య కుమార్..పరిపాలన వికేంద్రీకరణ అంటే మూడు రాజధానులు కాదు.. పంచాయతీలకు నిధులు వెళ్లాలన్నారు. విభజన చట్టంలో ఉన్న అన్ని అంశాలను కేంద్రం పూర్తి చేసిందన్న అన్న ఆయన అభివృద్ధి విషయంలో కేంద్రం వివక్ష చూపదున్నారు.

అమరావతి నుంచి రాజధానిని కదలించలేరని స్పష్టం చేశారు. అమరావతిలో అన్ని సంస్థలు త్వరగా పనులు ప్రారంభించేలా చూస్తామన్న సత్య కుమార్.. అవసరం అయితే ప్రతి 15 రోజులకు కేంద్రంలో పెద్దలను కలిసి విన్నవిస్తామన్నారు.

ఇవి కూడా చదవండి: Yogi Adityanath Oath: రెండోసారి ఉత్తర ప్రదేశ్ సీఎంగా యోగి ఆదిత్యానాథ్‌.. కొత్త మంత్రి వర్గంలో మంత్రులు వీరే..

Kishan Reddy: పుత్రవాత్సల్యంతోనే రైతుల్ని బలిచేస్తున్నారు.. కేసీఆర్ సర్కార్‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం..

Yogi Cabinet: ఒకప్పుడు సైకిళ్లకు పంక్చర్లు వేసుకునే వ్యక్తి.. నేడు యోగి సర్కార్‌లో మినిస్టర్.. అతని పొలిటికల్ హిస్టరీ ఇది..