CUET 2022 exam date: ఏప్రిల్‌ 2 నుంచి సీయూఈటీ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు ప్రారంభం! పరీక్ష తేదీ..

సెంట్రల్‌ యూనివర్సిటీల్లో అండర్‌ గ్రాడ్యుయేట్‌ (యూజీ) కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే కామన్‌ యూనివర్సిటీస్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (CUET)-2022కు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌లు ఏప్రిల్‌ 2 నుంచి ప్రారంభం కానున్నట్లు..

CUET 2022 exam date: ఏప్రిల్‌ 2 నుంచి సీయూఈటీ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు ప్రారంభం! పరీక్ష తేదీ..
Cuet 2022
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 27, 2022 | 9:53 PM

Common Universities Entrance Test 2022 updates: సెంట్రల్‌ యూనివర్సిటీల్లో అండర్‌ గ్రాడ్యుయేట్‌ (యూజీ) కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే కామన్‌ యూనివర్సిటీస్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (CUET)-2022కు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌లు ఏప్రిల్‌ 2 నుంచి ప్రారంభం కానున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. దరఖాస్తుల స్వీకరన ప్రక్రియ ఏప్రిల్‌ 30 వరకు కొనసాగుతుందని నేషనల్ టెస్టింగ్‌ ఏజెన్సీ ఈ సందర్భంగా తెలియజేసింది. దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఆన్‌లైన్‌ పద్ధతిలో(CBT) ఈ పరీక్షను నిర్వహించనున్నట్లు తెలిపింది. కాగా సెంట్రల్‌ యూనివర్సిటీల్లో 2022-23 విద్యాసంవత్సరానికిగానూ అండర్ గ్రాడ్యుయేట్ (UG Courses) కోర్సుల్లో ప్రవేశాలకు మొదటిసారిగా కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ)ను ఎన్టీఏ నిర్వహించనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. సీయూఈటీ స్కోర్‌ ద్వారా మాత్రమే ఆయా యూనివర్సిటీల్లో ఈ ఏడాది యూజీ కోర్సుల్లో ప్రవేశాలు నిర్వహించనున్నట్లు యూజీసీ చైర్మన్ ఎం జగదీష్ కుమార్ (UGC chairman M Jagadesh Kumar) తాజాగా తెలిపారు. జులై మొదటి వారంలో సీయూఈటీ నిర్వహించే అవకాశం ఉంది.

ఐతే ప్రవేశ పరీక్షలో సాధించిన స్కోర్‌ ద్వారా మాత్రమే ప్రవేశాలు కల్పిస్తామని,12వ తరగతి బోర్డు పరీక్ష మార్కులకు ఎలాంటి వెయిటేజీ ఉండబోదని, ఇంటర్‌ మార్కలను కేవలం అర్హత ప్రమాణంగా మాత్రమే పరిగణిస్తామని యూజీసీ తెల్పింది. ఈ పరీక్షలో సాధించిన స్కోరు ఆధారంగా ఏ సెంట్రల్‌ యూనివర్సిటీలోనైనా ప్రవేశం పొందవచ్చు. దేశంలో యూజీసీ గుర్తింపు పొందిన 45 సెంట్రల్‌ యూనివర్సిటీలకు, మొత్తం 13 భాషల్లో ఈ పరీక్ష జరుతుంది. ఢిల్లీ యూనివర్సిటీ, జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ, జామియా మిలియా ఇస్లామియా, ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ, యూపీలోని అలీఘర్ ముస్లిం యూనివర్శిటీ, బనారస్ హిందూ యూనివర్శిటీ వంటి ప్రసిద్ధ సెంట్రల్ యూనివర్సిటీలు కూడా CUET పరిధిలోకి వస్తాయి. జనరల్ సీట్లతోపాటు, రిజర్వేషన్ సీట్లను కూడా ఆయా విధానాల ప్రకారం కేటాయిస్తారు. ఐతే ఇందుకు ఎలాంటి కౌన్సింగ్‌ ఉండదు.

Also Read:

Stealth Omicron: సోమవారం నుంచి మళ్లీ లాక్‌డౌన్‌! మహమ్మారి చావులు ఓవైపు.. ఆకలి కేకలు మరోవైపు!