Telangana: నిరుద్యోగులకు అలర్ట్.. ఓటీఆర్‌లో మార్పులకు టీఎస్‌పీఎస్‌సీ అనుమతి.. నేటినుంచే

One Time Registration: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (CM KCR) ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నట్లు ఇటీవల అసెంబ్లీలో వెల్లడించిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 80,039 ఉద్యోగాలకు

Telangana: నిరుద్యోగులకు అలర్ట్.. ఓటీఆర్‌లో మార్పులకు టీఎస్‌పీఎస్‌సీ అనుమతి.. నేటినుంచే
Tspsc Otr
Follow us

|

Updated on: Mar 28, 2022 | 6:00 AM

One Time Registration: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (CM KCR) ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నట్లు ఇటీవల అసెంబ్లీలో వెల్లడించిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 80,039 ఉద్యోగాలకు ఆయా శాఖల ద్వారా నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. అయితే.. దీనిలో భాగంగా తొలి విడతలో 30 వేల 453 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతోపాటు టెట్ నోటిఫికేషన్ సైతం విడుదల చేసింది. ఈ క్రమంలో ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. నిరోద్యోగుల కోసం ప్రవేశపెట్టిన వన్‌టైమ్‌ రిజిస్ట్రేషన్‌ (OTR) లో వ్యక్తిగత మార్పులు చేసుకునేందుకు టీఎస్‌పీఎస్పీ అవకాశం కల్పిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీచేసింది. టీఎఎస్‌పీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ www.tspsc.gov.in ను సంప్రదించి ఎడిట్‌ (One Time Registration) ఆప్షన్‌ ద్వారా మార్పులు, చేర్పులు చేసుకోవచ్చంటూ టీఎస్‌పీఎస్‌సీ వెల్లడించింది.

అయితే.. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం.. 33 జిల్లాలు, 7 జోన్లు, 2 మల్టీ జోన్లకు అనుగుణంగా అభ్యర్థులు మార్పులు చేసుకోవాలని తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (Telangana State Public Service Commission) సూచించింది. ఉద్యోగార్థులు తమ స్థానికతతో పాటు అదనపు విద్యార్హతలు కూడా ఓటీఆర్‌లో నమోదు చేసుకోవచ్చని వెల్లడించింది. దీంతోపాటు కొత్త అభ్యర్థులు కూడా ఓటీఆర్‌లో తమ వివరాలు నమోదు చేసుకోవచ్చని పేర్కొంది. ఈ మేరకు టీఎస్‌పీఎస్సీ ఓ ప్రకటనను విడుదల చేసింది. సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓటీఆర్‌ వెబ్‌సైట్ అందుబాటులోకి రానుందని పేర్కొన్నారు.

ఓటీఆర్ కోసం ఈ లింకును క్లిక్ చేయండి.. www.tspsc.gov.in

కాగా.. ఓటీఆర్‌లో మార్పులు చేయదల్చుకున్న అభ్యర్థులు www.tspsc.gov.in ను సంప్రదించి ఎడిట్‌ ఆప్షన్‌ ఎంచుకోవాలి. ఆ తర్వాత అంతకుముందున్న టీఎస్‌పీఎస్సీ ఐడీ, పుట్టిన తేదీతో లాగిన్‌ కావాలి. అనంతరం తమ విద్యార్హతలు, స్థానికత, ఇతర వివరాలను దానిలో నమోదు చేయాలి. రాష్ట్రపతి ఉత్తర్వులు ప్రకారం మారిన కొత్త జిల్లాలకు 1-7 తరగతుల వరకు స్థానికత వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. కొత్తగా నమోదు చేయాలనుకున్న వారు కూడా దీనిలో లాగిన్ అయి వన్ టైమ్ రిజిస్ట్రేషన్ పై క్లిక్ ఇచ్చి వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.

Also Read:

CUET 2022 exam date: ఏప్రిల్‌ 2 నుంచి సీయూఈటీ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు ప్రారంభం! పరీక్ష తేదీ..

Aadhaar Card: ఆధార్‌లో మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసినా OTP రావడం లేదా? కారణమిదే.. అయితే, ఇలా చేయండి..