AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhaar Card: ఆధార్‌లో మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసినా OTP రావడం లేదా? కారణమిదే.. అయితే, ఇలా చేయండి..

ఆధార్‌లో మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేశామని, అయితే తమకు ఓటీపీ రాలేదని చాలా మంది ఫిర్యాదు చేస్తున్నారు. OTP రాలేదంటే మీకు అలర్ట్ రాలేదని అర్థం.

Aadhaar Card: ఆధార్‌లో మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసినా OTP రావడం లేదా? కారణమిదే.. అయితే, ఇలా చేయండి..
Aadhar
Venkata Chari
|

Updated on: Mar 27, 2022 | 9:45 PM

Share

ఆధార్‌లో మీ మొబైల్ నంబర్, ఇమెయిల్ చిరునామాను తప్పనిసరిగా అప్‌డేట్ చేయాలని నిరంతరం వినిపిస్తూనే ఉంటుంది. ఆధార్ ఆన్‌లైన్ సేవలతో ఇలాంటి మార్పులను ఎన్నో చేసుకోవచ్చు. ఇలా అప్‌డేట్ మీ ఆధార్‌(Aadhaar Card)ని మరెక్కడైనా ఉపయోగిస్తుంటే లేదా దానిపై ఏదైనా లావాదేవీ జరిగినట్లయితే, మీకు వెంటనే అలర్ట్ వస్తుంది. మొబైల్ నంబర్, ఇమెయిల్ అప్‌డేట్ చేయకపోతే ఈ హెచ్చరికలు అందవు. మీరు మోసపోవచ్చు. మొబైల్ నంబర్‌(Mobile Number)ను ఆధార్‌తో నమోదు చేయడం ద్వారా మీరు ప్రభుత్వ సేవలతో పాటు ప్రభుత్వేతర సేవలను కూడా వేగంగా పొందవచ్చు. ఆధార్‌లో మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. దీనితో మీరు ఆధార్‌లో చిరునామాను మార్చవచ్చు. అలాగే ఆధార్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆదాయపు పన్ను రిటర్న్‌ను ధృవీకరించవచ్చు. బ్యాంక్ ఖాతా తెరవవచ్చు. NPS ఖాతాను తెరవవచ్చు. ఆధార్‌తో మొబైల్ నంబర్‌ను నమోదు చేసుకోవడం ద్వారా అనేక ఇతర ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. మీరు ఆధార్‌ని ధృవీకరించాలనుకుంటే, అది మీ మొబైల్ నుంచి కూడా సులభంగా చేసుకోవచ్చు. దీని కోసం, మీరు ఇ-ఆధార్ లేదా ఆధార్ లెటర్ లేదా ఆధార్ పీవీసీ కార్డ్‌లోని క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలి. కొన్నిసార్లు మీరు ఆధార్‌లో ఇచ్చిన మొబైల్ నంబర్‌ను మార్చుకోవచ్చు. ఇటువంటి పరిస్థితిలో, ఇది వెంటనే అప్‌డేట్ చేసుకోవాలి. మీ ఆధార్‌లో సరైన మొబైల్ నంబర్ రిజిస్టర్ చేశారా లేదా, ఆధార్‌లో సరైన ఇమెయిల్ చిరునామా నమోదు చేశారా లేదా అని తెలుసుకోవడానికి మీరు https://myaadhaar.uidai.gov.in/verify-email-mobile లింక్‌ని సందర్శించవచ్చు.

ఆధార్‌లో మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేశామని, అయితే తమకు ఓటీపీ రాలేదని చాలా మంది ఫిర్యాదు చేస్తున్నారు. OTP రాలేదంటే మీకు అలర్ట్ రాలేదని అర్థం. హెచ్చరికలు అందనప్పుడు, లోపం ఉన్నట్లయితే మీరు ఈ నోటిఫికేషన్‌లను స్వీకరించలేరు. ఇటువంటి పరిస్థితిలో, మొబైల్ నంబర్ అప్‌డేట్, OTP సమస్యను త్వరగా పరిష్కరించాలి.

ఎందుకు OTP రాలేదు..

OTP అందకపోవడానికి సంబంధించి, @UIDAI బలహీనమైన మొబైల్ నెట్‌వర్క్ వల్ల కావచ్చునని పేర్కొంది. మీరు కూడా ఈ సమస్యకు గురైనట్లయితే, మీ ప్రాంతంలోని మొబైల్ నెట్‌వర్క్ తీవ్రమైన సమస్యలను సృష్టిస్తే, అప్పుడు T-OTP అంటే టైమ్ బేస్డ్ OTPని ఉపయోగించుకోవాలని కోరింది. ఇందుకోసం మొబైల్‌లో mAadhaar యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. mAadhaarలో ఉన్న టైమ్ బెస్ట్ OTP సహాయంతో, మీరు ఆధార్ డౌన్‌లోడ్, ఆధార్ అప్‌డేట్ సేవలు పొందవచ్చు. ఇప్పుడు మొబైల్ నంబర్‌ను ఆధార్‌తో ఎలా లింక్ చేయాలో కూడా తెలుసుకుందాం.

మొబైల్ నంబర్‌ను ఎలా అప్‌డేట్ చేయాలి..

UIDAI ప్రకారం, మొబైల్ నంబర్ నవీకరణకు బయోమెట్రిక్ అవసరం. ఇది పోస్ట్ లేదా ఆన్‌లైన్ ద్వారా చేయలేరు. దీని కోసం మీరు మీ సమీపంలోని నమోదు కేంద్రాన్ని తప్పకుండా సందర్శించాల్సి ఉంటుంది.

Also Read: Stealth Omicron: సోమవారం నుంచి మళ్లీ లాక్‌డౌన్‌! మహమ్మారి చావులు ఓవైపు.. ఆకలి కేకలు మరోవైపు!

PM Modi: మన్‌ కీ బాత్‌‌లో మెట్ల బావి ముచ్చట.. ప్రధాని మోడీ నోట ఆ వివరాలు..