PM Modi: మన్‌ కీ బాత్‌‌లో మెట్ల బావి ముచ్చట.. ప్రధాని మోడీ నోట ఆ వివరాలు..

Mann Ki Baat: ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) తన నెలవారీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్‌లో మాట్లడారు. ఇది మన్‌ కీ బాత్‌ 87వ ఎపిసోడ్‌. ఈసారి జల సంరక్షణ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రతి నీటిబొట్టు విలువైనదే.

PM Modi: మన్‌ కీ బాత్‌‌లో మెట్ల బావి ముచ్చట.. ప్రధాని మోడీ నోట ఆ వివరాలు..
Mann Ki Baat
Follow us
Sanjay Kasula

|

Updated on: Mar 27, 2022 | 9:29 PM

ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) తన నెలవారీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్‌లో మాట్లడారు. ఇది మన్‌ కీ బాత్‌ 87వ(Mann Ki Baat) ఎపిసోడ్‌. ఈసారి జల సంరక్షణ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రతి నీటిబొట్టు విలువైనదే. నీటి రీ సైక్లింగ్‌పై మనం దృష్టి పెట్టాలన్నారు. సికింద్రాబాద్‌ బన్సీలాల్‌ పేటలోని చారిత్రక మెట్ల బావి గురించి మోదీ మాట్లాడారు. ఏళ్ల తరబడి మెట్ల బావిని నిర్లక్ష్యం చేయడవం వల్ల మట్టి, చెత్తతో నిండిపోయింది. అయితే ఇప్పుడు మెట్ల బావి పునరుద్ధరణ జరుగుతోందన్నారు. ఈ కృషిని ప్రశంసించారు. వందల ఏళ్ల చరిత్ర ఉన్న మెట్ల బావులు మన సంస్కృతిలో భాగమన్నారు. బన్సీలాల్‌ పేట మెట్ల బావి కూడా అటువంటిదేనని చెప్పారు. ఈ మెట్ల బావి రాష్ట్ర ప్రభుత్వం, రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ చొరవతో మళ్లీ జీవం పోసుకుంది. ఇది 17వ శతాబ్దం నాటి మంచినీటి బావి. అప్పట్లో నిజాం రాజులు కట్టించారు. కెపాసిటీ 22 లక్షల లీటర్లు. నీళ్లు ఎంత కిందికి వెళ్లినా మెట్ల పైనుంచి దిగి తోడుకోవచ్చు.

రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాల్లో మెట్ల బావుల లాగే దీన్ని కూడా కళ్లు చెదిరేలా నిర్మించారు. ఉపరితలం నుంచి 50 ఫీట్ల లోతు వరకు నిర్మాణమై ఉంది. భూమి లోపలి నుంచే ఓ నిరంతర నీటి ఊట ఉంది. ఇది 55 ఫీట్ల కింద నుంచే వస్తున్నట్టు గుర్తించారు. దాని నుంచి ఇప్పటికీ స్వచ్ఛమైన నీరు వచ్చి బావిలో చేరుతోంది.

ప్రతి రోజు తెల్లారేసరికల్లా కనీసం 6 ఫీట్ల స్వచ్ఛమైన నీరు ఆ బావిలో చేరుతోందని చెబుతున్నారు. మెట్ల బావి పునరుద్ధరణ పనులను 2021లో ప్రారంభించారు. దాదాపు 5 వందల టన్నుల మట్టి, చెత్తను లారీల్లో తొలగించారు. మట్టి తీస్తున్నకొద్దీ అద్భుతమే బయటపడింది. ఆనాటి అరుదైన, చారిత్రక మెట్ల బావి కనిపించింది. పంద్రాగస్ట్ నాటికి మెట్ల బావిని టూరిస్ట్ ప్రాంతంగా డెవలప్ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి: RRR Movie: ఆ థియేటర్‌లో జక్కన్న సినిమాను ఫస్ట్‌ హాఫ్‌ మాత్రమే వేసి ఆపేశారు.. కారణమేంటంటే..

ఆంధ్రప్రదేశ్‌ నిరుద్యోగులకు తీపికబురు! టీచర్‌ ఎటిజిబిలిటీ టెస్ట్‌ 2022 జూన్‌లో..